అమరావతి: అధికార పార్టీ నేతల తొత్తులుగా మారిన కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఐటీడీపీ అధ్యక్షుడు షేక్.హుస్సేన్ సాబ్పై అక్కడి ఎస్సై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారన్నారు. టీడీపీ అంటే అంత ఇష్టమా అని ఎస్సై సతీష్‌కుమార్ దుర్భాషలాడటం, స్టేషన్‌కి పిలిచి కొట్టడం దారుణం. అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్న హుస్సేన్ సాబ్‌ను.. రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని అబద్ధం చెప్పి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి, తీవ్రంగా కొట్టారన్నారు. జగన్ కిరాయి సైన్యం మాదిరి మారి, గీత దాటిన వారికి ప్రజలే కోరలు పీకుతారని హెచ్చరించారు. హుస్సేన్ సాబ్‌కు పార్టీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.