• కోవూరు నియోజకవర్గం కొడవలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూములను అధికార పార్టీ నాయకులు అధికారులను లొంగదీసుకుని దోచుకుంటున్నారు.
• సాగునీటి కాలువలను ఆక్రమించి వాటిపై పెద్దపెద్ద బిల్డింగులు కడుతున్నారు.
• వైసీపీ నేతల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు.
• లేఅవుట్ లు వేసి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర భూములను కబ్జా చేస్తున్నారు.
• పంచాయతీల్లో గ్రామకంఠం భూములను చదును చేసి అమ్ముకుంటున్నారు.
• ఈ కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయి.
• మీరు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములతో పాటు ప్రజల భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది.
• ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కబ్జాదారులకు కొమ్ము కాయడం దుర్మార్గం.
• సాగునీటి కాల్వలు, కొండలు, గుట్టలను సైతం వైసిపి నేతలు మాయం చేస్తున్నారు.
• రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
• తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక భూకబ్జాదురులపై కఠినంగా వ్యవహరిస్తాం.
• ప్రభుత్వ భూములతోపాటు ప్రజల భూముల రక్షణకు చర్యలు తీసుకుంటాం.