మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయం వినాయక మండపంలో శనివా రం లడ్డూ వేలం కార్యక్రమం ఘనంగా జరిగింది. వినాయకుడి చల్లని చూపులు పడి.. బొజ్జ గణపయ్య కరచాలములో మహిమాన్వితమైన లడ్డూను దక్కించుకునేందుకు కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. వేలంలో విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకునేందుకు పోటీ పడ్డారు. వేలం పాటలో కార్యాలయ ప్రోగ్రాం కమిటీ రూ.27 వేలకు లంబోధరుడి లడ్డూను కైవశం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎ.వి.రమణ, దారపనేని నరేంద్ర, రాంబాబు, హర్ష, దామోదర్, సంపత్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అందరూ పాల్గొని ఏకదంతుడి ఆశీస్సులు పొందాలని నాయకులు, కార్యాలయ సిబ్బంది కోరారు.