- రికార్డుల పూర్తి ప్రక్షాళనకు మూడేళ్ల సమయం
- కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా ఫీచర్లు
- తెలంగాణలోనూ గొడ్డలి పార్టీ దందాలు సాగుతున్నాయి
- సంతకాలు ఫోర్జరీ చేసి రూ.1500కోట్ల ఆస్తులు కొట్టేశారు
- నేరం చేసిన ఆ పార్టీ నేతను అయినా సస్పెన్షన్ చేయరు
- గొడ్డలి పట్టే వారికి.. నాగలి పట్టే రైతుల బాధలు గుర్తుకురావు
- నేరాలు-ఘోరాలు చేసి ఎదుటి వాళ్లపైనా వేసేస్తారు
- రాజముద్రతో పట్టాలిస్తుంటే.. దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు
- ఉద్యోగాలు ఇస్తుంటే బురదజల్లే ప్రయత్నాలూ చేస్తున్నారు
- ప్రజలకు, నిరుద్యోగులకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి
- మీ భూమి- మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆచంట(చైతన్యరథం): రాష్ట్రంలో భూ రికార్డులను 2027 నాటికి ప్రక్షాళనచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత పాలకులు పశ్చిమగోదావరి జిల్లా లాంటి పచ్చని ప్రాంతంలోనూ భూ చిచ్చు పెట్టారని ఆక్షేపించారు. గజం భూమిని కూడా సద్వినియోగం చేసుకునే రైతులనూ గత ప్రభుత్వం వదిలి పెట్టలేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజముద్రతో కూడినపట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం జరి గిన సభలో మాట్లాడుతూ దుర్మార్గమైన గత పాలకుల నిర్వాకంతో రికార్డులన్నీ గందరగోళంగా తయారయ్యా యని ప్రజలకు చెందిన భూముల విషయంలో సమ స్యలు సృష్టిం చారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూ రికార్డులను ప్రైవేటు వ్యక్తులకు అప్ప గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి దుర్మార్గపు చట్టాన్ని రద్దుచేసి యాజమాన్య హక్కులను రక్షించామని వివరించారు. క్యూ ఆర్ కోడ్ సహా కరెన్సీ నోట్ల తరహాలోనే అత్యంత పటిష్టమైన భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు చేసిన అవకతవకల కారణంగా భూమి రికార్డుల ప్రక్షాళనకు మూడేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తున్నామని వెల్ల డించారు. ప్రతీ యూనిటు శాశ్వతమైన బ్లాక్చైన్ ఐడీలు ఇస్తున్నామని..దీని ద్వారా రికార్డులను ట్యాంప రింగ్ చేసేందుకు అవకాశం ఉండదని తెలిపారు. ప్రజల ఆస్తి పత్రాలపై ఫొటోలు ముద్రించుకున్నారని… పొలం సరిహద్దు రాళ్లపై బొమ్మల కోసం రూ.800 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ప్రస్తుతం భూముల రీసర్వే ప్రక్రియలో రైతులను కూడా భాగస్వాములను చేస్తు న్నామని… ఈకేవైసీ చేశాకే పట్టాదారు పాస్ పుస్తకా లను ముద్రించి రైతులకు అందిస్తున్నామని వివరించా రు. ఇప్పటికే 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూమి రికార్డులను అప్డేట్ చేశామని అన్నారు. 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశామన్నారు. వచ్చే తొమ్మిది నెలల్లో మరో 10,357 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 2027 నాటికి రాష్ట్రంలో ప్రతీ రైతు వద్దా తప్పుల్లేని పాస్ పుస్తకం ఉంటుందని స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖలో సమూల మార్పులు
రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకువస్తు న్నామని… రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని సీఎం వివరించారు. విక్రయం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100శాతం ఆటో మ్యూటేషన్ తెచ్చామని తెలిపారు. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశామని వివరించారు. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100తో బదిలీ చేస్తున్నామ ని స్పష్టం చేశారు. 1బీ, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ వంటి పాత రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు.80శాతం ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతే గ్రామాలను వెబ్ల్యండ్ 2.0లోకి తీసుకుంటు న్నామని అన్నారు. వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దర ఖాస్తు, ట్రాకింగ్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రం లోని 1.37 లక్షల ఎకాల విలేజ్ సర్వీసు ఇనామ్ భూములను 22ఏ నుంచి తప్పించామని తెలిపారు.
తిరుపతి జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న శెట్టిపల్లి గ్రామ భూములను పరిష్కరించి వారికి అప్ప గించామన్నారు. అక్వా రైతులకు అండగా నిలబడ్డామని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్య త ఇస్తున్నామని వివరిచారు. ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తు న్నామని స్పష్టంచేశారు. అక్వా ఫీడ్ రేట్లు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రాయితీలు ఇవ్వాలని సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించా లని కేంద్రాన్ని కోరామన్నారు. పశ్చిమగోదావరి లాంటి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి పెట్టామని వివరించారు. ఆక్వా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్ధాలు కాలుష్య సమస్యగా మారకుండా న్యూట్రాసిటికల్ ఔష ధాల తయారుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
రెండేళ్లుగా సమపాళ్లలో సంక్షేమం..అభివృద్ధి
కూటమి ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాలనను విజయ వంతంగా పూర్తి చేసుకున్నామని సంక్షేమం- అభివృద్ధి-సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. ఈ అం శాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తిరుపతి, అమరావతి, విశాఖలో మూడుప్రాంతాల్లో మూడు సభలు నిర్వహి స్తున్నామని తెలిపారు. అభివృద్ధిని ట్రాక్లో పెట్టామని.. పెట్టుబడులు ఉద్యోగాల కల్పన జరుగుతోందని పేర్కొ న్నారు. సంక్షేమంలో దేశంలో ఎవరూ చేయలేని విధంగా ప్రజలకు మేలుచేస్తున్నాం అని వివరించారు. సూప్సక్స్లో చెప్పిన వాటి కంటే అదనంగా ఇచ్చా మని తెలిపారు. పెన్షన్, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్న దాత సుఖీభవ, ఆటోడ్రైవర్లు, మత్స్యకారులు ఇలా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని వివరించారు.
గొడ్డలి పార్టీది ఓర్వలేనితనం
డీఎస్సీ ద్వారా దాదాపుగా 16వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని.. పరీక్షలు అంటే తెలియని వ్యక్తులు, రిజర్వేషన్ల గురించి అవగాహన లేని వాళ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు జాబ్ క్యాలెండర్ ఇస్తామని దగా చేశారని.. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. దీన్ని చూసి ఓర్వ లేకే నేరాలు ఘోరాలుచేసి ఎదుటివారిపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గొడ్డలిపార్టీ చరిత్ర రాష్ట్రం
లో అందరికీ తెలుసని… నేరాలు చేసి ఎదుటి వాళ్లపై నెట్టేస్తుందని ఆక్షేపించారు. చేసిన ప్రతీ ఆరోపణకూ మంత్రులు అధికారులు పూర్తిగా వివరణ ఇచ్చారు.. దీనికి ఆ వైపు నుంచి సమాధానం లేదన్నారు.
అసలు రాష్ట్రంలో జకీయాలుచేసే అర్హత ఆపార్టీకి లేదన్నా రు. రాష్ట్ర ప్రజలను, నిరుద్యోగులను గొడ్డలిపార్టీ నేతలు క్షమాపణలు కోరాలి.. ప్రజలను క్షమాపణ కోరకుండా. రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు గొడ్డలి పార్టీకి అర్హతలేదని అన్నారు. ప్రజలకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు సంతోషిస్తు న్నా.. కానీ వైసీపీ పార్టీ నేతలు రాష్ట్రంలో భూ కబ్జాలు చేశారని రికార్డులు తారుమారు చేశారు. తెలంగాణా రాష్ట్రానికి వెళ్లి అక్కడి తహసీల్దారు, జేసీ సంతకాలు ఫోర్జరీ చేసి రికార్డులు తారుమారు చేశారు. ఈనేరంలో రూ.1500కోట్ల అక్రమాలు జరిగాయి. ఇంత నేరం జరిగితే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు.. వినుకొండ మాజీ ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నిం చారు. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలిపట్టే రైతులు గుర్తుకురారని.. కోడి కత్తి డ్రామాలు ఆడే వారికి వరి కోతలు ఎలా తెలుస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. గంజాయి బ్యాచ్లను ఓదార్చే వారికి పంటల సాగు గురించి ఎలా తెలుస్తుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకువెళ్లాలం టే గొడ్డలి పార్టీ వ్యక్తులను దూరంగా పెట్టాలని వ్యాఖ్యానించారు.
అందరి ఆరోగ్యం కోసం యోగాంధ్ర
అనంతరం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై జిల్లా నివే దికను ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. ప్రభు త్వం అందించే వివిధ పౌరసేవలను మెరుగ్గా అందిం చటంలో కృషిచేస్తున్న అధికారులను అభినందించారు. ఆగస్టు 15లోగానే రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటు లోకి తీసుకురానున్నట్టు వివరించారు. ప్రీవెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజలకు వైద్యసేవ లు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రజలకు అందు బాటులోకి తీసుకువస్తున్నామని తెలి పారు.ప్రతీఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. జూన్ 21 తేదీన రాష్ట్రం లో కోటి మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తు న్నామని తెలిపారు. 2047 సంపన్నమైన, ఆనందకర మైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను తయారు చేయటమే లక్ష్యమని వివరించారు. అనంతరం సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న కోకో ద్వారా తయారైన చాక్లెట్లను, కొబ్బరి, పామాయిల్ ఉత్పత్తుల ప్రదర్శనలను పరిశీలించారు. వరి ఊక, గడ్డి ద్వారా తయారైన వివిధ ఉత్పత్తులు, గుర్రపు డెక్క ద్వారా తయారైన వర్మీ కంపోస్టును సీఎం పరిశీలిం చారు. ఆక్వా వ్యర్ధాల ద్వారా తయారైన ఉప ఉత్పత్తు లను పరిశీలించి తయారీదారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానా యుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.














