చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం తెచ్చుకుందాం

తనతో కలిసి రావాలని ఆళ్లగడ్డ రా..కదలిరా సభలో ప్రజలకు చంద్రబాబు పిలుపు

by చైతన్యరధం
January 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ఫోటో గ్యాలరీ
రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం తెచ్చుకుందాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భస్మాసురుడు లాంటి జగన్‌ వచ్చాకే ప్రజలకు కష్టాలు
  • జగన్‌ కు తెలిసింది రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడే
  • సొంత చెల్లికి ఆస్తివ్వకుండా తరిమేసిన జగన్‌..మాపై ఆరోపణలు చేస్తున్నాడు
  • ఇరిగేషన్‌ ను నిర్వీర్యం చేసిన సీమ ద్రోహి జగన్‌
  • పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేస్తా
  • జనసునామీని చూసి తాడేపల్లి పిల్లిలో వణుకు

ఆళ్లగడ్డ: జగన్‌ తీసుకొచ్చిన రాతియుగం కావాలో..టీడీపీ పాలనతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బంగారు భవిష్యత్‌ కోసం టీడీపీ – జనసేన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో మంగళవారం నిర్వహించిన రా..కదలిరా సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అన్నారు. బ్రిటిష్‌ వారి గుండెలో రైళ్ల్లు పరుగెత్తించిన ఉయ్యలవాడ నరసింహరెడ్డి పుట్టినగడ్డ ఇది. ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహరావు వంటి మహనీయులు ప్రాతినిథ్యం వహించిన గడ్డ ఇది. ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనవరి 9నే..తెలుగు జాతికి దశ, దిశ నిర్దేశించిన ఈ రోజు పండుగ రోజు. ఈ సభకు వచ్చిన జనసునామీని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోంది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌ లో 7 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. వైసీపీ 5 ఏళ్ల పాలన పేదలకు శాపంగా మారింది. పేద వారు నిరుపేదలుగా, యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. నాకు అధికారం కొత్త కాదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. 47 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. నా తపనంతా తెలుగుజాతి అభివృద్ది కోసమే. రాక్షసులకు అధికారం ఇవ్వటం వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్ధితి. తనకు వరమిచ్చిన వారినే నాశనం చేయాలనుకున్న భస్మాసురుడు మాదిరిగా జగన్‌ రెడ్డి తయారయ్యాడు. ముద్దులు పెట్టి మీ నెత్తిమీద చెయ్యి పెడితే మురిసిపోయి ఓట్లేశారు. నేడు కష్టాలు పడుతున్నారు. ఈ సైకో రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశాడు. రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు తప్ప జగన్‌ కి ఏమీ తెలియవు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టాడు. ఒక్కసారి కదా అని కరెంట్‌ వైర్‌ పట్టుకుంటే షాక్‌ కొడుతుందని నాడే చెప్పాను..నా మాట మీరు వినలేదు. అందరికీ కష్టాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో అందరూ బాధితులే అని చంద్రబాబు అన్నారు.

టీడీపీ హయాంలోనే కర్నూలు జిల్లా అభివృద్ది
కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో రూ. 365 కోట్లతో జైన్‌ ఇరిగేషన్‌ కి శ్రీకారం చుట్టాం. అది వస్తే మొక్కల పెంపకం, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటివి వచ్చేవి. దాన్ని నిర్వీర్యం చేశారు. నందికొట్కూరులో రూ. 650 కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌ ఏర్పాటుకు కృషి చేశాం…అది వచ్చి ఉంటే ప్రపంచం మొత్తానికి విత్తన సరఫరా కేంద్రంగా నంద్యాల ఉండేది. దాన్నీ నాశనం చేశారు. ఎమ్మిగనూరులో టెక్స్‌ టైల్‌ పార్క్‌ కి శంకుస్థాపన చేస్తే దాన్ని నిలిపేశారు. ఓర్వకల్లులో 15 నెలల్లోనే ఎయిర్‌ పోర్ట్‌ నిర్మించిన ఘనత టీడీపీది. ఇండస్ట్రియల్‌ టౌన్‌ షిప్‌ ఏర్పాటు చేశాం, నేను ఉంటే కర్నూలు జిల్లా పారిశ్రామిక హబ్‌ గా తయారయ్యేది. 6 వేల మెగావాట్ల సామర్థ్యంతో సాలార్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. నేను విజన్‌ తో ముందుకెళ్తా…జగన్‌ రెడ్డి పాయిజన్‌ గా మారి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. రతనాల సీమను జగన్‌ రెడ్డి రాళ్ల సీమగా మార్చాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమ కోసం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా?
రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌. కృష్ణా మిగులు జలాలు తెలుగు గంగ ద్వారా రాయలసీమకు ఇచ్చారు. రాయలసీమలో నీళ్లుంటే హార్టికల్చర్‌ హబ్‌ గా తయారవుంది. మన పిల్లలకు ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. గతంలో రోడ్లు సరిగా ఉండేవి కాదు. నేడు నేషనల్‌ హైవే వచ్చింది, కర్నూలులో ఎయిర్‌ పోర్ట్‌ కట్టాం, కడప ఎయిర్‌ పోర్ట్‌ రన్‌ వే పెంచాం. తిరుపతిని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ చేశాం. ముచ్చుమర్రి, సిద్దాపురం, పులకుర్తి, గోరుకల్లు, పులికనుమ, అవుకు టన్నెల్‌ పూర్తి చేశాం. అలగనూరు ప్రాజెక్టు కు మరమ్మతులు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అలగనూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తాం. జగన్‌ రెడ్డి రాయలసీమ కోసం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్‌ కోసం రూ.12,454 కోట్లు ఖర్చు చేస్తే దానిలో కనీసం 25 శాతం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇలాంటి వ్యక్తి రాయసీమను ఉద్ధరిస్తాడా అని చంద్రబాబు ప్రశ్నించారు.

భూ రికార్డులు తారుమారుతో అమ్ముకునే ప్రయత్నం
జగన్‌ రాయలసీమ ద్రోహి. నేను ముఖ్యమంత్రి అయిన మెదటి రోజునే ముచ్చుమర్రి లిప్ట్‌ ఇరిగేషన్‌ పైనలైజ్‌ చేశాం. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీళ్లిచ్చి, ఆ విధంగా ఆదా చేసిన 120 టీఎంసీలు శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇచ్చాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువకి తీసుకొచ్చి రాయలసీమకు 350 టీఎసీంల నీళ్లు ఇవ్వాలన్నది నా కల. అది వచ్చి ఉంటే కరువు ఉండేది కాదు. నల్లమలలో ఒక టన్నెల్‌ ఏర్పాటు చేసి గోదావరి నీళ్లు నేరుగా నాగార్జున సాగర్‌ ద్వారా బనకచర్లకు తీసుకురావలన్నది నా ఆలోచన. ఆ నీళ్లు అక్కడ నుంచి హంద్రీ నీవా, తెలుగంగ, ఎస్‌ఆర్బీసీ, కేసీ కెనాల్‌ కు మళ్లించటం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కానీ ఆ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా? టీడీపీ హయాంలో రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు 90 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చాం. జగన్‌ రెడ్డి ఒక్క ఎకరాకైనా డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చారా? నేడు సీమలో 4 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్‌ తగ్గిపోయింది. మీ తాతలు, తండ్రులు ఇచ్చిన భూమిపై ముఖ్యమంత్రి బొమ్మ ఏంటి? ఆయనేమైనా మీ తాత తరుపు బంధువా? మీ భూముల రికార్డులు తారుమారు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రభుత్వ వేధింపులతో పారిపోయిన పరిశ్రమలు
జగన్‌ రెడ్డి కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమలను, పెట్టుబడులను తరిమేశారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఇచ్చారా? మెగా డీఎస్సీ అన్నారు.. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? మళ్లీ జాబు రావాలంటే బాబు రావాలి. ఈ ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ కంపెనీలు పారిపోయాయి. నా హయాంలో కియా పరిశ్రమ తెచ్చి వేల మంది యువతకు ఉపాధి కల్పించాం. కార్బన్‌, డిక్సన్‌, అపోలో టైర్స్‌ వంటి అనేక కంపెనీలు తెచ్చా. నేడు ఒక్క పరిశ్రమైనా తెచ్చారా? తిరుపతిని ఆటోమొబైల్‌ హబ్‌ చేయాలని అనేక కంపెనీలు తెచ్చా. నేను గెలిచి ఉంటే కడప స్టీల్‌ ప్యాక్టరీ పూర్తి అయ్యేది. జగన్‌ రెడ్డి స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి గాలికొదిలారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి చేస్తాం. తిరుపతిలో ఐఐటీ, ఐసీఆర్‌, అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, త్రిపుల్‌ ఐటి ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఏపీ 24 శాతం నిరుద్యోగితతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ పెట్టుబడుల్లో వెనుకబడి ఉన్నాం. యువత భవిష్యత్తుకు నాదీ గ్యారంటీ. టీడీపీ-జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో యువత చైతన్యం తేవాలి. రాయలసీమకు నీళ్లు తెచ్చి, యువతకు ఉద్యోగాలు ఇస్తేనే ఈ ప్రాంతం రతనాల సీమగా మారుతుంది. అదే నా ధ్యేయం. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవాలి. నేను అందరివాడిని..అదే నా ప్రత్యేకత అని చంద్రబాబు అన్నారు.

వైసీపీ పాలనతో అన్ని వర్గాలకు దెబ్బ
వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారు. నంద్యాల జిల్లాలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా? బీసీలకు 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు చేశాడా? సబ్‌ ప్లాన్‌ ఏమైంది? ఒక్కరికైనా బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణం ఇచ్చారా? బీసీ రిజర్వేషన్లు తగ్గించి 16,500 మందికి స్థానిక సంస్థల్లో పదవులు దూరం చేశారు. బీసీలకు ఉద్దేశించిన 30 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. రేపల్లెలో అమర్నాథ్‌ గౌడ్‌ అనే విద్యార్థిని పెట్రోల్‌ పోసి తగులపెట్టారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే బీసీ నేతను హత్య చేశారు. అయినా నిందితులపై చర్యలు లేవు. దళిత యువకుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఊరేగిస్తారా? ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటారా? వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో అబ్దుల్‌ సలాం అనే మైనారిటీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిరది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. టీడీపీ హయాంలో దళితులకు భూములు కొనిచ్చాం. 27 సంక్షేమ పథకాలు అమలు చేశాం. 27 ఏళ్ల క్రితమే ఎస్సీ వర్గీకరణ చేసి మాల, మాదిగలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. కేంద్రం కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు చెప్పారు.

సొంత చెల్లికి ఆస్తివ్వకుండా గొడవలు పెట్టుకుని..మాపై ఆరోపణలా?
జగన్‌, షర్మిల గొడవ పడి మాపై విమర్శలు చేస్తున్నారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది? తోడబుట్టిన చెల్లికి ఆస్తి ఇవ్వకుండా గొడవలు పెట్టుకుని మాపై ఆరోపణలు చేస్తున్నారు. సొంత బాబాయి వివేకాను హత్య చేసి అనేక డ్రామాలు ఆడారు. వివేకా కుమార్తెపైన, సీబీఐ అధికారులపైనా కేసులు పెట్టారు. వైఎస్‌ మరణంపై రిలయన్స్‌ కంపెనీపై ఆరోపణలు చేసిన జగన్‌, అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ మనిషికే రాజ్యసభ సీటు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు.

దోపిడిదారులుగా వైసీపీ ఎమ్మెల్యేలు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాధ్‌ రెడ్డి అవినీతిలో బిజీ బిజీ ఉన్నాడు. అన్నం తినడం మానేసి ఇసుక, ఎర్రమట్టి, రేషన్‌ బియ్యం తింటున్నాడు. ఆయన్ను మార్చే దైర్యం జగన్‌ కి లేదు. నంద్యాల ఎమ్మెల్యే ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆయన నేషనల్‌ హైవేను అష్టవంకర్లు తిప్పి తన భూములకు రేట్లు పెంచుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కలెక్షన్‌ కింగ్‌. కర్నూలు గ్రావెల్‌ ఫీల్డ్‌ గా (కేజీఎఫ్‌)గా మార్చారు. 500 ఎకరాల జగన్నాధ గట్టు భూముల్ని కొట్టేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి కన్నుపడ్డ వెంచర్లను కబ్జా చేస్తున్నారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే రామిరెడ్డి బ్రహ్మంగారు కాల జ్ఞానం రాసిన రవ్వల కొండను సైతం మింగేశారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే దళితుడు కాబట్టి సీటివ్వరంట..మిగతా ఆరుగురు కథేంటి? వాళ్లు ప్రజల సొమ్మును దోచుకోలేదా? బుగ్గన పిట్టకధల మంత్రి..సినిమాల్లో నాగభూషణం మాదిరి కమ్మగా మాట్లాడి చేయాల్సిన అవినీతి అంతా చేస్తాడని చంద్రబాబు దుయ్యబట్టారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు మహర్దశ
టీడీపీ అధికారంలోని రాగానే ఓర్వకల్లు మండలంలో మల్లిఖార్జున రిజర్వాయర్‌, తెలుగునాడు ఫీడర్‌ ఛానల్‌ పూర్తి చేస్తాం. డోన్‌, పత్తికొండ చెరువులకు నీళ్లు నింపే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వేదవతి పూర్తి చేస్తాం. సిద్దాపురం లిప్ట్‌ ఇరిగేషన్‌ కి ఈ ప్రభుత్వం కనీసం కరెంట్‌ బిల్లులు కట్టడం లేదు. దీన్ని చక్కదిద్దుతాం. మిడ్తూరు లిప్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేస్తాం. నందికొట్కూరుకు పరిశ్రమలు తెస్తాం. బనగానపల్లిలో పెద్దబొబ్బర్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. కుందూనదిపై చెక్‌ డ్యాంలు నిర్మిస్తాం. నాపరాయి పరిశ్రమలను ఆదుకుంటాం. బనగానపల్లె కోవెలకుంట బైపాస్‌ రోడ్డు వేస్తాం. ఉమ్మడి కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌ గా మార్చుతాం. హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. హంద్రీనీవా, గాలేరు నగరి పూర్తి చేస్తాం. తుంగభధ్ర, హెచ్‌ఎల్సీ, ఎల్‌.ఎల్‌.సీ కాలువలు ఆధునీకరణ చేస్తాం. గండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆర్టీఎస్‌ కుడికాలువ పూర్తి చేసి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి నీరిస్తాం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు ఇస్తాం. అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తారా? టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Tags: అధినేత నారా చంద్రబాబునాయుడుజయహో బీసీరా! కదలి రా!
Previous Post

పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం: బాలకృష్ణ

Next Post

జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

November 1, 2026
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

October 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

October 31, 2026
రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

October 31, 2026
ఆంధ్రప్రదేశ్

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

October 31, 2026
Next Post
జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల

జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

by చైతన్యరధం
October 29, 2026
0

పంటలు, ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి హోం మంత్రి అమిత్‌షాకు నష్ట తీవ్రతను వివరించాం సహాయక చర్యల్లో సాంకేతికతతో సత్ఫలితాలు సాధించాం ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

by చైతన్యరధం
October 29, 2026
0

అమరావతి(చైతన్యరథం): ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖరాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు,...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

by కార్యకర్త
November 1, 2026
0

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

by చైతన్యరధం
October 31, 2026
0

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ...

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

by కార్యకర్త
October 31, 2026
0

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.