పాలనలో భరోసాకు మరో పేరు... దార్శనికత కలిగిన ప్రజానేత... అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్...
నారా చంద్రబాబు నాయుడు గారి గురించి దేశ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలివి. చంద్రబాబు గారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... 'ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమ రాజకీయం' అని నమ్మిన మొదటి భారతీయ రాజకీయ నాయకుడు.
రాజకీయనాయకులలో ఐటీ జ్ఞానిగా అభివర్ణించబడే చంద్రబాబు నాయుడు, ఈ-గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేసారు. ఎలక్ట్రానిక్స్ & మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ప్రోత్సహించి విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా రంగాలలో సాంకేతికతను చొప్పించారు. ఈ క్రమంలో ఒక్క భారతదేశం లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆయన ఆకర్షించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో... 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని 'నాయుడు డే'గా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం' గా పేర్కొంది. ఎకనామిక్ టైం వార్తా సంస్థ 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' అన్నది. టైమ్ ఆసియా సంస్థ "సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్" అన్నది. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాస పత్రిక 'ప్రాఫిట్' చంద్రబాబును 'హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకరు' అని వర్ణించింది. బీబీసీ చేత 'సైబర్ సావీ చీఫ్ మినిస్టర్' అనిపించుకుంటే, సిఎన్ఎన్ వార్త సంస్థ "సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అన్నది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టోంగ్... తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్ లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమవడాన్ని తప్పనిసరి చేసుకున్నారంటే చంద్రబాబు విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ గేట్స్ తో చంద్రబాబునాయుడుకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు.
ఎన్టీఆర్ తెలుగుజాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకువస్తే, చంద్రబాబునాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేసారు. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు చేతులా ప్రజలకు అందించారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేసారు. చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరుగెత్తుకుంటూ వస్తాయి. 'బాబుతోనే జాబు' అన్నది యువత నమ్మకం. సంపద సృష్టి అన్న దాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబునాయుడు.
తెలుగుదేశం పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయం అని చెప్పవచ్చు. రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానుల ఎంపికలో, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపికలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజానాయకులలో 'ది బాస్' అంటే చంద్రబాబునాయుడే.
© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.