యథావిధిగా ఆర్డీటీ సేవలు: నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పారు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు కొనసాగుతాయని ప్రకటించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాటిచ్చాను. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయ్యింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ కృతజ్ఞతలు. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్‌కు అభినందనలు” అని లోకేష్ పేర్కొన్నారు.
















