- టీడీపీకి భావి రథసారథి
- పులివెందులలోనూ పసుపు జెండా ఎగరేస్తాం
- ఎన్టీఆర్ గెలిచిన టెక్కలి ఎమ్మెల్యే కావటం నా అదృష్టం
- వేధింపులకు ఇంతకింతా తిరిగి చెల్లిస్తాం
- టెక్కలి శంఖారావం సభలో అచ్చెన్నాయుడు ఉద్ఘాటన
టెక్కలి: తెలుగుదేశం పార్టీకి భవిష్యత్‌లో చాలా సంవత్సరాలు నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదివారం సాయంత్రం జరిగిన టీడీపీ యువనేత లోకేష్ శంఖారావం సభలో అచ్చెన్నాయుడు మాట్లాడు తూ ఒక్క ఫోన్‌కాల్‌తో వేలమంది కార్యకర్తలు శంఖారా వంలో పాల్గొనేందుకు తరలివచ్చారన్నారు. నా చివరి శ్వాస వరకు టెక్కలి ప్రజలకు, ప్రజాసేవకే అంకిత మవుతానన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే కావడం, రాష్ట్రపార్టీ అధ్యక్షుడ్ని కావడం తన అదృష్టమని అచ్చెన్నాయుడు అన్నారు.
దొంగకు ఓటేసి తప్పు చేశారు
మీ అందరి సహకారంతో 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యా.అధికారమంటే ప్రజలకు సేవచేయడం, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అని భావించాను. చీమకు కూడా హానితల పెట్టకుండా సేవలందించాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను, మంత్రులను చూశా ను, 2019లో ఏపీ ప్రజలు దగాపడ్డారు. ఒక్క అవకా శం పేరుతో ఒక దుర్మార్గుడిని రాష్ట్రప్రజలు ముఖ్య మంత్రిని చేశారు, ఇది ముమ్మాటికీ ప్రజలు చేసిన తప్పిదమే.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచి, 16 నెలలు జైలులో ఉన్న దొంగకు ఓటేయడం ప్రజలు చేసిన తప్పే. మన పార్టీలేకుండా చేయాలని తప్పుడు కేసులుపెట్టి అక్రమ అరెస్టులు చేశారు, జైలు లో పెడితేపారిపోతామనుకున్నారు.తెలుగుదేశం గాలికి పుట్టలేదు, పేదవాడి ఆకలి కేకలనుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని అచ్చెన్నాయుడు అన్నారు.
పేదవాడినంటూ జగన్ కొత్త రాగం
ఈ రోజు చెబుతున్నా… రాష్ట్రంలో 175స్థానాలను రాబోయే ఎన్నికల్లో టీడీపీి గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డీ… పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగుర వేస్తాం… కాచుకో. అయిదేళ్లు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడికి ఏవిధంగా ప్రజలు ఓట్లు వేస్తారు? రాష్ట్రా న్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్. బటన్ నొక్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చానంటున్న జగన్… అప్పు తెచ్చిన 12లక్షల కోట్లు ఏంచేశాడు? రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో తాను పేదవాడినంటూ కొత్తరాగం అందుకున్నాడు. సాక్షి పేపర్, టీవీ, బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్ లు ఎవరివి? 500 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టించుకున్న జగన్ పేదవాడా అని చ్చెన్నాయుడు ప్రశ్నించారు.
50 వేల మెజారిటీ రావాలి
రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు మరోమారు మోసపోయి ఓట్లు వేస్తారనుకున్నాడు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ కు కర్రు కాల్చి వాతపెట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉత్తరాం ధ్రలోని మొత్తం 34స్థానాలు సహా, టీడీపీ-జనసేన కలిసి రాష్ట్రంలో 160 స్థానాలు గెలుస్తాయి. 2014-19మధ్య కాలం టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణ యుగం. ఎవరూ చేయనంత సంక్షేమం చేశాను. అర్థ రాత్రి ఒంటిగంటకు ఫోన్‌చేసినా ప్రజల కష్టాలు విన్నా ను. ఈ 60 రోజులు టెక్కలి కార్యకర్తలు కష్టపడా లి. 50వేల మెజారిటీతో టీడీపీని గెలిపించాలని అచ్చెన్నా యుడు పిలుపు ఇచ్చారు.
ఇంతకింతా తిరిగిస్తాం
రాబోయే ప్రభుత్వంలో లోకేష్ కీలకపాత్ర వహి స్తారు, ఆయన సహకారంతో టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తా. టెక్కలిలో ఇంకా రెండు పనులు చేయాల్సి ఉంది. ప్రతిఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలి. జిల్లాకు వంశధార జీవనాడి. వంశధార ప్రాజెక్ట్ పనులు టీడీపీి హయాంలో 72 శాతం పూర్తిచేశాం. వైసీపీ వచ్చాక తట్టమట్టి తీయ లేదు, వంశధార కాల్వలన్నీ పూడిపోయాయి. అయిదేళ్లుగా ప్రతిరైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. హిారమండలం నుంచి వజ్రపుకొత్తూరు, మర్రిపాలెం వరకు కాల్వలు తవ్వించాల్సిఉంది. వెయి కోట్లు ఖర్చయినా అయినా ఈ పనులు పూర్తిచేయాలి. మన ప్రభుత్వం వచ్చాక కాల్వల లైనింగ్ చేసి నీరు అందిస్తాం. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకున్నాం. లోకేష్ కూడా ఎర్రబుక్ లో రాశారు, ఆరుమాసాల్లో చక్రవడ్డీతో సెటిల్ చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.