- నర్సీపట్నం పులి అయ్యన్నపాత్రుడు
- ప్రజల్లో ఉంటేనే పదవులు
- హలో ఏపీ.. బైబై వైసీపీ మన నినాదం
- పాలిచ్చే ఆవుని కాదని దున్నపోతును తెచ్చుకున్నారు
నర్సీపట్నం: టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, తాను కలిసి 25వేల కి.మీ సీసీ రోడ్లు వేస్తే.. జగన్ కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దద్దమ్మలా తయారయ్యాడని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. లక్ష కోట్లున్నా జగన్ పేదవాడేనని వ్యంగ్యం ప్రదర్శించారు. నర్సీ పట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. నర్సీ పట్నం నియోజకవర్గం బలిఘట్టంలో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ ఇక్క డో పులి ఉంది.
ఆయన పేరు అయ్యన్నపాత్రుడు అన్నా రు. 2019 నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అందుకే ఆయనపై 17 కేసులు పెట్టారు. రేప్ కేసు కూడా పెట్టారు. ఆయన్ను చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో 2వేల కోట్ల రూపాయల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు యుద్దప్రాతిపదికన నిర్మించారు. పరిశ్రమల కోసం పార్క్ ఏర్పాటుచేసి చిన్న పరిశ్రమలు తీసుకు వచ్చాము. నియోజకవర్గంలో 185 కి.మీల సీసీ రోడ్లు వేశామని లోకేష్ చెప్పారు.
లక్ష కోట్ల జగన్ పేదవాడే!
జగన్ పదేపదే పేదలకు-ధనవంతులకు యుద్ధం అంటున్నారు. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన వాడు పేదవాడా? లక్ష రూపాయలు విలువైన చెప్పులు, లీటర్ వెయ్యి రూపాయల ఖరీదైన నీళ్లు తాగేవాడు పేద వాడే? అతి ఖరీదైన వాచ్ పెట్టుకుని తిరిగే పేదవాడు జగన్. తాడేపల్లి,పులివెందుల, హైదరాబాద్, బెంగళూ రు, రిషికొండలో రూ.500 కోట్లతో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నా పేదవాడినని చెబుతాడు. భారతి సిమెంట్స్, సండూర్ పవర్ ప్లాంట్లు ఉన్న జగన్ పేద వాడే? సాక్షి టీవీ, పేపర్ ఉన్నా.. జగన్ నిజంగా పేద వాడే అని లోకేష్ వ్యంగ్యంగా అన్నారు.
పాలిచ్చే ఆవును కాదని..
2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు. పాలిచ్చే ఆవు టీడీపీ. దున్నపోతు వైసీపీ. 2019లో గణేశుడిని గెలిపించారు. దేవుడిలా బాగా పరిపాలిస్తాడంటే.. గణేశుడికే చెడ్డపేరు తీసుకు వచ్చారు. పెద్దఎత్తున ప్రజలపై పడి దోచుకుంటున్నా రు. ఇసుక, లాటరైట్ ద్వారా ఐదేళ్లలో రూ.150కోట్లు దోచుకున్నారు. పేద ప్రజలకు ఇచ్చిన భూములను తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ము కున్నాడు. పొరపాటున మీ ఇల్లు, మీ భూమి చూపిస్తే ఆయన పేరుపై రాసుకుంటారు. మాస్క్ అడిగిన పాపా నికి డాక్టర్ సుధాకర్‌ని పిచ్చోడిని చేసి చంపేశారు. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడు ఇద్దరు కొడుకులపై కేసులు పెట్టారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చూస్తున్నారని.. విజయ్‌పై కేసులు పెట్టారు. ఏ పోస్ట్ పెట్టినా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నా రని లోకేష్ విమర్శించారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం
టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. పెండిరగ్ లో ఉన్న 2300 టిడ్కో ఇళ్లు వందరోజుల్లో పూర్తిచేసి గృహప్రవేశాలు చేపిస్తాం. మినీ ఐటీడీఏ ఏర్పాటుచేస్తాం. గిరిజన భవన్‌లు ఏర్పా టుచేస్తాం.నాతవరంవద్ద జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం. తాండవ రిజర్వాయర్ మరమ్మతుపనులు పూర్తి చేసి నీరు అందిస్తాం. రోడ్లు దారుణంగా ఉన్నాయి. గుంతల్లో రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి. 35 కి.మీల ప్రయాణం రెండుగంటలు పట్టింది. మేం వచ్చిన రెండు ఏళ్లలోనే అన్ని రోడ్లు వేస్తాం. వరాహ నదిపై బ్రిడ్జి పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అంది స్తాం. మెడికల్ కాలేజే పనులు కూడా యుద్ధప్రాతి పది కన పూర్తిచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రజల చుట్టూ తిరగాలి
ఈశంఖారావం కార్యక్రమం ద్వారా బాబు సూపర్- 6 హామీలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి. గతంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చేశాం. బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ టెక్నాల జీతో కూడిన కార్యక్రమం మనం చేశాం. ఎవరు బాగా పనిచేశారో నాకు తెలుస్తుంది. బాగా పనిచేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇచ్చాం. వారితో ప్రత్యేకం గా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. బాబు సూపర్-6 కార్యక్రమాలు కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలు నా చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిర గాలి. వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
ఈశంఖారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్,యూనిత్, బూత్ ఇన్‌ఛార్జ్‌లకు కిట్లు ఇచ్చాం. బాబు సూపర్- 6 హామీలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి. రేపు మన ప్రభు త్వం వచ్చిన తర్వాత ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 హామీలు నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకోవాలి. గతంలో బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చేశారు. లోకేష్ టెక్నాలజీ తీసుకువచ్చా రని నన్ను తిట్టుకు న్నారు. దీనివల్ల ఎవరు పనిచేశారో, లేదో నాకు తెలు స్తుంది.బాగా పనిచేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇస్తున్నాము. ప్రశంసా పత్రాలు ఇస్తున్నాము. వారితో కూర్చొని మాట్లాడాను కూడా. రేపు నన్ను, చంద్ర బాబుని కలవాలన్నా ఈ సర్టిఫికెట్ చాలు. నా చుట్టూ తిరగడం కాదు.. ప్రజల మధ్య తిరగాలి.బాగా పనిచేసి న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం.బాబు సూపర్-6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లి జయప్రదం చేయాలి. హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మన నినాదం కావాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.