అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండబోదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కుమారస్వామికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మనోభావాలను నిలబెట్టిన కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో లోకేష్ పోస్ట్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ చేసిన ప్రకటన రాష్ట్రం మొత్తానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశ పరిచి ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉంది. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల అంచనాలను అందుకోవడమే మా ప్రాధాన్యం. జగన్, నీలి మీడియాకు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పారు. హెచ్చరికను పట్టించుకోకపోతే 2029లో మరోసారి ఘోర ఓటమి తప్పదు. తప్పుడు వార్తలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని నారా లోకేష్ అన్నారు.