చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం ఘన విజయంలో లోకేష్‌ పాత్ర

యువగళంతోనే మొదలైన ప్రజాతిరుగుబాటు

by చైతన్యరధం
Jun 7, 2024 at 6:12am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
తెలుగుదేశం ఘన విజయంలో లోకేష్‌ పాత్ర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • యువగళంతోనే మొదలైన ప్రజాతిరుగుబాటు
  • అన్నీ తానై అరాచకశక్తులకు ఎదురొడ్డి…!
  • యువగళం స్పూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనపై యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజా తిరుగుబాటుగా మారి చివరకు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించింది. 2023 జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజ స్వామి పాదాలచెంత యువనేత లోకేష్‌ ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వరకు 226 రోజులపాటు 97అసెంబ్లీ నియోజకవర్గాలు, 2300 గ్రామాలమీదుగా 3132 కి.మీ.ల మేర సాగిన యువగళం పాదయాత్ర జగన్‌ విధ్వంసక పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణ విజయం సాధించింది. పాదయాత్ర ప్రారంభంలో యువగళంపై అధికార పార్టీతోపాటు స్వపక్షంలోనూ పెద్దగా అంచనాలు లేవు. పాదయాత్రకు ప్రజలనుంచి రోజురోజుకూ పెరుగుతూ వచ్చిన అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. జీఓ1తో నల్ల జీఓ తెచ్చి యువనేత గొంతునొక్కే ప్రయత్నం చేశారు. మాట్లాడే మైక్‌నుంచి నిలబడే స్టూలు వరకు అన్నీ లాగేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయితే యువనేత లోకేష్‌ ఏమాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజాగళాన్నే తమ గొంతుకగా రెట్టించిన ఉత్సాహంతో జగన్‌ సర్కారు అరాచకపర్వాన్ని ఎలుగెత్తిచాటారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదుచేశారు. రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయించి నియతృత్వంగా వ్యవహరించారు. ప్రచార రథం, సౌండ్‌ సిస్టమ్‌, మైక్‌, స్టూల్‌తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్‌ చేసినా, యువనేత ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా తమ గళాన్ని మరింత బలంగా విన్పించారు.

అన్నీ తానై అరాచకశక్తులకు ఎదురొడ్డి…!
పాదయాత్ర సమయంలో యువనేత లోకేష్‌ అసాధారణ పోరాటపటిమతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయించారు. సాధారణంగా సమస్య తలెత్తినపుడు నాయకుడి తరపున కార్యకర్తలు ఆందోళనలు చేయడం పరిపాటి. ఇటువంటి సందర్భాల్లో యువకెరటం లోకేష్‌ వ్యవహరించిన తీరు స్పూర్తిదాయకంగా నిలచింది. పాదయాత్రను అడ్డుకోవాలన్న కుతంత్రంతో జగన్‌రెడ్డి తొత్తులుగా మారిన కొందరు పోలీసులు, వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి. ఆ సందర్భంగా కార్యకర్తలకంటే ముందుగా తానే రోడ్డుపై కూర్చుని తమదైన శైలిలో నిరసన చేపట్టి క్యాడర్‌లో మనోధైర్యాన్ని నింపారు. పాదయాత్ర 14వరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లిలో యువనేత లోకేష్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడి డిఎస్పీ ప్రసాద్‌ నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు కార్యకర్తలను చుట్టుముట్టి యువగళం పాదయాత్రపై ఒక్కసారిగా దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేష్‌ మాట్లాడేందుకు బాషా అనే కార్యకర్త మైక్‌ తీసుకొస్తుండగా, అతడిపై పోలీసులు గూండాలమాదిరిగా దాడిచేసి మైక్‌ లాక్కున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

పాదయాత్రను అనుసరిస్తున్న వాలంటీర్లు, నాయకులపైనా పోలీసులు దౌర్జన్యానికి దిగి యుద్ధవాతావరణం సృష్టించారు. చివరకు లోకేష్‌ స్టూల్‌పై నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆ స్టూలును కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. పోలీసులకు రాజ్యాంగాన్ని చూపుతూ ఏ నిబంధన ప్రకారం తనను అడ్డుకుంటున్నారో చెప్పాలని యువనేత నిలదీశారు. ఈ సందర్భంగా సంసిరెడ్డిపల్లి గ్రామస్థులు పోలీసులపై తిరగబడి, లోకేష్‌ను తమ గ్రామంలో మాట్లాడవద్దు అనడానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులపై లోకేష్‌ బెబ్బులిలా విరుచుకుపడ్డారు. ఎటువంటి జంకూ గొంకూ లేకుండా లోకేష్‌ చూపిన ఈ పోరాట పటిమే ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చి చివరకు అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించింది.

యువగళం స్పూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం
పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 107 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయదుందుభి మోగించింది. భగభగమండే నిప్పుకణంలా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర పవర్‌ ఏమిటో అప్పుడుగానీ అధికారపక్షానికి అర్థం కాలేదు. పాదయాత్ర చిత్తూరు జిల్లానుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే సమయంలోనే రాష్ట్రంలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో యువగళం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా విద్యావంతులైన యువఓటర్లపై స్పష్టంగా కన్పించింది. అధికార యంత్రాంగాన్ని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకొని ఒక్కొక ఎమ్మెల్సీ స్థానానికి వందకోట్ల రూపాయలకు పైగా వైసీమీ అభ్యర్థులు ఖర్చుచేసినప్పటికీ చైతన్యవంతమైన యువత తెలుగుదేశం అభ్యర్థులవైపే మొగ్గుచూపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఏ నాయకుడు చేపట్టని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45 రోజులపాటు 577 కిలోమీటర్ల దూరం కొనసాగిన యువగళం పాదయాత్రకు అడగడుగునా అన్నివర్గాల ప్రజలు నీరాజనాలు పలికారు.

యువనేత పాదయాత్ర 40వరోజున మదనపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో యువనేత చేసిన ప్రసంగంతో పెద్దిరెడ్డి గ్యాంగ్‌లో ప్రకంపనలు చెలరేగాయి. ఆ సభలో పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో వారికి కంటిమీద నిద్ర కరువైంది. పాదయాత్ర 41వరోజు తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సాకుతో యువనేత లోకేష్‌ క్యాంప్‌ సైట్‌ ఖాళీ చేయాలని ఆర్డీఓపై వత్తిడి తెచ్చి నోటీసులు ఇప్పించారు. కనీసం కంటేవారిపల్లి క్యాంప్‌ సైట్‌లో ఉండేందుకు కూడా అనుమతించలేదు. దీంతో 3 రోజులపాటు ఆయన క్యాంప్‌ను వీడి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. యువగళం గొంతునొక్కేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే అరాచక ప్రభుత్వంపై ప్రజాతిరుగుబాటు మొదలైంది.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 06-06-2024

Next Post

వివేకా హత్యకేసులో ఓ జంట

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026

కార్యకర్త
@ May 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

కార్యకర్త
@ May 30, 2026
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి
ఆంధ్రప్రదేశ్

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026

కార్యకర్త
@ May 29, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు
ఆంధ్రప్రదేశ్

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష

చైతన్యరధం
@ May 29, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

చైతన్యరధం
@ May 29, 2026
మహిళా శక్తికి పట్టం

మహిళా శక్తికి పట్టం

చైతన్యరధం
@ May 28, 2026
జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

చైతన్యరధం
@ May 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist