• వెంకటగిరి నియోజకవర్గం మాధవాయపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో సుమారు 150మంది రైతులు సీజేఎఫ్ఎస్ భూములను సాగుచేస్తున్నారు.
• 1976లో అప్పటి ప్రభుత్వం మనిషికి 2ఎకరాలు చొప్పున 325ఎకరాలు కేటాయించారు.
• ఈ భూములన్నీ ఆర్డీఓ పేరుమీద ఉన్నాయి. వాటిని మా పేరు మీదకు మార్చాలని అడిగితే పట్టించుకోవడం లేదు.
• మా గ్రామంలోని దళితులకు పట్టాలు కేటాయించలేదు.
• మా గ్రామం భూములను పూర్తిగా రెడ్ మార్క్ పెట్టి ఉంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు పట్టాలు ఇప్పించాలి.
• మా గ్రామంలో కరెంటు స్థంబాలు దెబ్బతిన్నాయి, ఎవరూ పట్టించుకోవడం లేదు.
• లైబ్రరీ, డ్రైనేజీ, శ్మశానం, సీసీ రోడ్లు లేవు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన పేదవర్గాలకు శాపంగా మారింది.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద 5వేల ఎకరాల భూమిని అదజేశాం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాస్తవ అనుభవదారులను గుర్తించి, మాధవాయపాలెం దళితులకు పట్టాలు అందజేస్తాం.
• మాధవాయపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.