- హిపోక్రసీ పరామర్శలపై జోకులేస్తోన్న జనం
- అసమర్థతను బయటపెట్టుకుంటున్న వైసీపీ నేత
- ‘జగనే ఉండివుంటే’ అంటూ విధ్వంసాన్ని గుర్తుచేస్తోన్న వైనం
- ఫ్యాను పార్టీ మాటలకు బెంబేలెత్తిన వరద బాధితులు
- గడచిన మూడునెలల్లో చేయాల్సిందేదీ చేయలేదు
- ప్రభుత్వానికి మాత్రం.. పనికిరాని హితోపదేశాలు
- పిచ్చి ప్రవర్తనతో పరువు తీసుకుంటున్న జగన్
అమరావతి (చైతన్య రథం): గోబెల్స్ ప్రచారాలకు జగన్‌రెడ్డి మామ వరుస! కేవలం అసత్యాలనే మ్యానుఫ్యాక్చర్ చేసే బ్లూ ఇండస్ట్రియలిస్టు!! తన కార్ఖానాలో తయారైన అసత్యాలను కొంగొత్త మోసాలతో అమాయక ప్రజలకు అంటగట్టగలిగే భ్రష్ట పొలిటీషియన్! అంతటి ఘనత.. భూమ్మీద కేవలం జగన్‌రెడ్డికే ఉంది. ఇది ఎవరో అన్నదీ కాదు, ఇంకెవరో చెప్పిందసలే కాదు. తనంతట తానుగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డే చెప్పుకున్న మనోవాక్కులివి. ఏలేరు వరద ముంపు బాధిత గ్రామాల్లో ‘పరామర్శ పర్యటన’ పేరిట బురదకు దూరంగా తిరిగిన జగన్‌రెడ్డి.. పోతూపోతూ పలికిన పిచ్చి మాటలు. వేసిన వెర్రి చేష్టలు! రాజకీయాలకు రాక ముందునుంచీ ఏదీ నిజం చెప్పడానికి ఇష్టపడని జగన్‌రెడ్డి.. ఏలేరు ముంపు ప్రాంత పర్యటనలోనూ అదే ఆచరించాడు, అనుసరించాడు. కాకపోతే.. తను చేసిన పాపాలు, దుర్మార్గాలను ప్రత్యర్థులకు అన్వయించి చెప్పడంలో దిట్టయిన జగన్.. `ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ముఖ్యమంత్రికి అన్వయించి అక్కసు ప్రదర్శించాడంతే. అందుకే `ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఎమ్మెల్యే జగన్ చేసిన లేకి వ్యాఖ్యలపై.. పొలిటికల్ సర్కిల్స్ జోకులు పేలుతున్నాయి.
ప్రజల చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది జగన్. ప్రతిపక్ష హోదాకూడా దక్కని బలానికి దిగజారింది జగన్. అధికారం కోల్పోయి నెలలు గడుస్తున్నా.. ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమలనుంచి బయటకు రాకుండా.. తెంపరితనపు వ్యాఖ్యలకు దిగడం జగన్ మానసిక స్థితిని తేటతెల్లం చేసేదే. కనీసం విపక్ష హోదా దక్కించుకోలేని అసమర్థ జగన్.. మాజీ ముఖ్యమంత్రిగా తాను చేయాల్సిన పనులు చేయకుండా `ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంచేయాలో పాఠాలు చెప్పడం రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంతటి విధ్వంసానికి గురి చేశాడన్నది ప్రజలిచ్చిన తీర్పులోనే స్పష్టమైంది. విపత్తుకాల పరిణామాలకు గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్న దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నా.. ఆ విమర్శను జీర్ణించుకోలేకపోతున్న జగన్.. మొత్తం ప్రజా సమాజంపైనే విషం జిమ్మడానికి తెగించడం.. విజయవాడ, ఏలేరు వరదప్రాంత పర్యటనల్లో మరోసారి కనిపించింది.
తనకు ఓటేయలేదన్న అక్కసుతో లక్షలాది ప్రాణాలనే రిస్క్‌లో పెట్టడానికి కుట్రపన్నిన అభియోగాలు తుపానుమాదిరి చుట్టుముడుతుంటే.. ‘ఔను’ అనేందుకు తగిన సాక్ష్యాలు వరదలా కళ్లకు కనబడుతుంటే.. `నిర్మాణాత్మక పాత్రతో మచ్చలేని రాజకీయాన్ని ప్రదర్శించాల్సిన జగన్.. ప్రజలెన్నుకున్న పాలకుడిపై బుదరజల్లే ప్రయత్నాలకు పాల్పడటం భ్రష్ట రాజకీయాన్ని పెంచిపోషించడమే! ప్రజలు నమ్మకంగా అధికారం కట్టబెట్టినపుడు విధ్వంస రాజకీయంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్. ఐదేళ్ల పాలనపై విసుగుతో అదే ప్రజలు కసిగా గద్దె దింపేసిన మరుక్షణంనుంచే `ప్రజా ప్రభుత్వంపై బురద జల్లడం మొదలెట్టాడు. సచ్చీల రాజకీయాలపై జగన్‌కు ఏమాత్రం గౌరవంలేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. గురివింద నలుపు తనకింద పెట్టుకుని.. ప్రజా ప్రభుత్వాధినేత చంద్రబాబుకు పనికిరాని హితోపదేశాలు చేయడం.. ఎమ్మెల్యేగా అతను చేయాల్సిన పనులపై దృష్టి పెట్టకపోవడమే. తను చేయాల్సింది చేయకుండా.. ఎదుటివాళ్లు ఏంచేయాలో నీతులు చెప్పేవాళ్లను ఏమంటారు..? ఇదే `ప్రజలు, పొలిటికల్ సర్కిల్స్‌లో జోకులవుతున్నాయి. నడపడానికేమీలేని వైసీపీని బలవంతంగా నడుపుతున్న జగన్ తక్షణం గ్రహించాల్సింది తాను చేసిన, చేస్తోన్న తప్పులే!
గడచిన మూడు నెలల్లో..
ప్రభుత్వంమీద పడి ఏడ్వటం జగన్‌కు, వైసీపీ పరివారానికి కొత్తకాదు. ప్రతిపక్ష హోదా దక్కకున్నా.. రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక పాత్ర పోషించిన ఘట్టం గత మూడు నెలల కాలంలో ఒక్కటీ లేదు. ఎన్డీయే సర్కారు గద్దెనెక్కిన దగ్గర్నుంచీ.. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను నాశనం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదన్న లేకి విమర్శలు తప్ప.. ప్రభుత్వం చేపట్టిన విధానాలపై మాట్లాడిరదే లేదు. వైసీపీ పాలనా హాయంలో అనుసరించిన విధ్వంస విధానాలను ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదన్నది జగన్ ప్రశ్న. తన పాలనా విధానాలను ప్రజలు తిప్పికొట్టారన్న ఇంగితం లేకుండా.. వైఫల్య విధానాలనే తన మార్కుగా పదేపదే చెప్పుకోవడం జగన్ రాజకీయ అపరిపక్వతకు నిలువుటద్దం. ‘ఇప్పుడే కనుక జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే..’ అన్న పరమ చెత్త పాచిపోయిన స్క్రిప్టు డైలాగు పట్టుకుని.. పదేపదే ప్రజలకు వినిపిస్తూ తన అజ్ఞానాన్ని తనే బయటపెట్టడం విడ్డూరం. ప్రభుత్వాధినేతగా జగనుంటే ఏం జరుగుతుందో.. ఒకసారి అధికారమిచ్చి రాక్షస పాలన ఎదుర్కొన్న ప్రజలకు తెలీంది కాదు.
మళ్లీ జగన్‌కు అధికారమిస్తే ఏం జరుగుతుందో ముందే గ్రహించి.. ప్రజలు కసిగా ఓట్లువేసి దించేశారన్న స్పృహ జగన్‌కు లేకపోవడం విచారకరం. తన పాలనా వైఫల్యం వల్ల సాధారణ వరద సైతం విపత్తుగా పరిణమించిందన్న కనీస ఆలోచనలేని జగన్.. అదే వరద ప్రాంతాలకు వెళ్లి తన ప్రభుత్వ గొప్పలు చెబుతుంటే.. ప్రజలు విస్తుబోతున్నారు. ఐదేళ్లు అధికారంలోవుండి నదుల కరకట్టలను నిర్లక్ష్యం చేసి, వాగు గర్భాలనే మింగేసిన తన పాపాలకు.. రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం బాధ్యత వహించాలన్నట్టు జగన్ మాట్లాడటం `వైసీపీ తెంపరి రాజకీయాలకు కుంపటి లాంటిదే!
పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టే..!
ఇలాఇలాఇలాఇలాలాలాలా. వచ్చెయ్‌వచ్చెయ్‌చ్చెయ్‌చ్చెయ్… ఇదీ పబ్లిక్‌లో జగన్ పిచ్చి చేష్టలు. తన పాలనా వైఫల్యాలతో ప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన జగనే.. వరదలో నానుతున్న ప్రజల పరామర్శకు వెళ్లి.. ప్రదర్శించిన పిచ్చి చేష్టలివి. జల విలయాన్ని ఎదుర్కోడానికి వరదకు ఎదురెళ్లి అహర్నిశలూ శ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై బుదరజల్లేందుకు జగన్ ఎంచుకున్న విమర్శల మార్గం `ఈ పిచ్చి చేష్టలే! ఒకపక్క ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రజల తరఫున ప్రశ్నించడానికి తనకు విపక్ష హోదా ఇవ్వాలంటూ పనికిమాలిన డిమాండ్‌పై పోరాటం చేస్తున్న జగనే `తమను ఆదుకున్న ప్రభుత్వంమీద తమముందే వెటకారం చేస్తుంటే విస్తుపోవడం వరద బాధితుల పనైంది. ఇటు విజయవాడలో.. అటు ఏలేరులో కనీసం గట్టుదిగకుండా కబుర్లు చెప్పిన జగన్.. పనిచేసే ప్రభుత్వంమీద చేస్తోన్న లేకి వ్యాఖ్యలను బాధితులు జీర్ణించుకోలేకపోయారు. తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానన్న విషయాన్ని పక్కనపెట్టి.. ప్రభుత్వం మొత్తాన్ని వరదలోకి దింపి.. పదిరోజులపాటు బాధితుల కోసమే పనిచేసిన చంద్రబాబుపట్ల జగన్ అమర్యాదకర ప్రవర్తన.. రాజకీయ విజ్ఞులనే విస్తుబోయేలా చేసింది. ‘అతను రాజకీయాలకు అనర్హుడు’ అంటూ అనుభవజ్ఞుడు చంద్రబాబు ఎందుకు వ్యాఖ్యానించారో `జగన్ తన పచ్చి, పిచ్చి ప్రవర్తనతో నిరూపించుకున్నట్టయ్యింది.
జగనంటేనే.. అదో టైపు!
ముఖ్యమంత్రిగా నాల్గవసారి బాధ్యతలు తీసుకున్న వెంటనే.. మిగతా రాజకీయ పక్షాలకు చంద్రబాబు చేసిన సూచన `రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాభివృద్ధికి విధానపరమైన చర్చలు స్వాగతిద్దామని. అదోటైపు జగన్‌కు అందులోని అంతరార్థం అర్థంకాలేదు. అందుకే `తన పిచ్చి చేష్టలతో ప్రభుత్వాన్ని గేలి చేయడమే తప్ప.. రాష్ట్రానికి పనికొచ్చే గొప్ప సూచనో.. ప్రజలు కోరికను డిమాండ్‌గానో ప్రభుత్వంముందు పెట్టలేకపోయాడు. మామూలు పరిస్థితులు ఎలావున్నా.. ఎదురైన విపత్తును సమష్టిగా ఎదుర్కోవాలన్న పిలుపును ఇవ్వలేకపోయాడు. తనకు మరోసారి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టని ప్రజలపై కక్షగట్టినట్టే జగన్ ప్రవర్తన కనిపిస్తోంది. విపత్తు సమయంలో ప్రజలకు ఏవిధమైన ప్రత్యామ్నాయం కల్పించాలి, ప్రభుత్వపరంగా కనిపిస్తోన్న లోపాలేంటి? ఎలాంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం? అన్న అంశాలపై తన పార్టీ ఆలోచనను ప్రభుత్వానికి నివేదించిందే లేదు. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు ఏపీని చుట్టుముట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా `ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయలేదు.
వరద బాధితుల పరామర్శకు వెళ్లి.. పిచ్చి చేష్టలు, పిల్ల చేష్టలకు పాల్పడటం తప్ప.. వైసీపీనుంచి బాధిత ప్రజలకు ఉపశమనాన్నిచ్చే ఏ అంశాన్నీ జగన్ టచ్ చేయలేదు. ప్రజలను పరామర్శిస్తున్నాన్న వంకతో.. వరదను రాజకీయం చేయడానికే బురదలోకి దిగిన జగన్ `తన ప్రవర్తనతో తనమీద తనే బురదజల్లుకున్నారు. పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధమంటూ ఎన్నికలకు ముందునుంచే సమాజాన్ని రెండుగా చీల్చిన జగన్.. ఒటమి తరువాత తన పెత్తందారీ ప్రవర్తనతో అసలు స్వరూపం బయటపెట్టుకుంటున్నాడు. ప్రజలు తమ తీర్పును చెప్పేసిన నేపథ్యంలో.. రాజకీయాలకు తావులేని రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెడదామన్న చంద్రబాబు సూచనను గౌరవంగా స్వీకరించలేకపోయిన జగన్.. పదేపదే తన దుష్ట భ్రష్ట రాజకీయాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అందుకు గత మూడు నెలల కాలంలో లెక్కలేనన్ని ఉదంతాలు. నిర్వీర్యమైన ఏపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపర్చాలి, రాష్ట్రానికున్న అభివృద్ధి అవకాశాలేంటి?, విపత్తురహిత ఏపీని ఎలా నిర్మించాలన్న అంశాలపై ప్రజా ప్రభుత్వం పరుగులు తీస్తుంటే.. అవకాశాన్ని సృష్టించుకుని ప్రభుత్వంపై బురద జల్లడానికి జగన్ ప్రయత్నించడం సిగ్గులేని రాజకీయమే.
భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మహానగరానికే ముప్పని, కనీసం 15 లక్షల క్యూసెక్కుల వరదను ఎదుర్కొనే స్థాయికి బ్యారేజ్‌ను పెంచుకోవడం, ఎగువ ప్రాంతంలో మరో బ్యారేజ్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుంటే.. వెక్కిరింపులు, వెటకారంతో విపరీత ప్రవర్తనాహార్యాన్ని ప్రజలముందు ప్రదర్శించడం… జగన్ స్థాయిని తేటతెల్లం చేసేదే. వరదలనుంచి ఏపీకి ఎలాంటి శాశ్వత రక్షణ కల్పించాలి.., అలాంటి ప్రణాళిక రూపొందించడానికి ప్రభుత్వాన్ని ఎలా చైతన్యపర్చాలి.., డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికపై నిర్మాణాత్మక సూచనలు అందించాల్సిన రాజకీయ పార్టీ.. కేవలం పాలకపక్షంపై బురద చల్లడానికే పరిమితం కావడం.. వైసీపీ విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం.
మహా నగరాలకు ముప్పు పెరుగుతోంది. గత కొన్నేళ్లలో దేశంలో కనిపిస్తోన్న పరిస్థితి అది. అటు ముంబయి, ఇటు గుజరాత్, మరోపక్క హైదరాబాద్.. ఇప్పుడు విజయవాడ. భవిష్యత్‌లో ఇలాంటి ముప్పునుంచి నివారణకు ఎలాంటి రక్షణ కవచాన్ని నిర్మించుకోవాలన్న అంశంపై ప్రజల తరఫున నిలబడాల్సిన వైసీపీ.. ప్రజా ప్రభుత్వం రూపొందిస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికకు అడ్డుపడటాన్ని ప్రజలే అడ్డుకోవాలి. ఏలేరు ఆధునీకరణ పనులను వైసీపీ చేపట్టలేకపోవడానికి రైతులే కారణమంటూ.. ఏలేరు ముంపు బాధితుల మందే జగన్ ప్రకటించడానికి మించిన అజ్ఞానం ఇంకెక్కడా ఉండదు. చేతగాని దద్దమ్మ సమాధానలతో ప్రజలనే బుకాయిస్తూ.. పనిచేసే ప్రభుత్వానికి అడ్డుపడుతున్న జగన్‌ను రాజకీయాలనుంచి శాశ్వతంగా తరిమికొట్టడం ప్రజల బాధ్యత. అది ఎంత తొందరగా సాధ్యమైతే.. ఏపీ రాష్ట్రానికి అంత శ్రేయస్కరం.