అమరావతి: తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుతో ఎంపీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సమావేశమ య్యేందుకు ఏర్పాట్లు చేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను ఎంఆర్పీఎస్ నేతలు కోరారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ నేతలు కొందరు శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో వర్ల రామ య్యను కలిశారు. చంద్రబాబు నాయుడుని కలిసి కొన్ని అంశాలపై చర్చించేందుకు మంద కృష్ణ ఎదురుచూస్తున్నారని చెప్పా రు. ఈ సందర్భంగా మంద కృష్ణ పంపిన లేఖను వర్ల రాయయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తప్పక తీసుకెళ్తానని ఎంఆర్పీఎస్ ప్రతినిధులకు వర్ల రామయ్య హామీ ఇచ్చారు.