అమరావతి(చైతన్యరథం): వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. గురువారం పలువురు ప్రముఖులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి వరద బాధితుల కోసం విరాళాల చెక్కులు అందజేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 10 లక్షలు, మల్లెల రాజేష్ నాయుడు 10 లక్షలు, అమలాపురం ఎంపీ గంటి హరీష్, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి వాసు, పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న రూ. 5లక్షల చొప్పున అందజేశారు. విజయవాడకు చెందిన బుద్దిరాజు శివాజీ రూ. 5లక్షలు అందజేశారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.