• ఉదయగిరి నియోజకవర్గం మర్రిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మర్రిగుంట నుండి వెలిగంట్ల చర్చి రోడ్డును తారురోడ్డుగా మార్చాలి.
• మా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి మంచినీరు అందించాలి.
• గ్రామంలో డ్రైనేజీల్లో మురుగునీరు పేరుకుపోయింది. మా గ్రామంలో 2,500మీటర్ల సీసీ రోడ్లు నిర్మించాలి.
• మా గ్రామంలో పొలం వెళ్లేందుకు అవసరమైన రోడ్లు వేయాలి.
• ఆంజనేయస్వామి విగ్రహం నుండి చర్చి వరకు రోడ్డు వేయాలి. విగ్రహం వద్ద కరెంటు సదుపాయం ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో కరెంటు సమస్యలు అధికంగా ఉన్నాయి.
• మా గ్రామంలో జెడ్పి హైస్కూలుకు ప్రహరీగోడ నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామీణాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
• తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.
• పంచాయతీలకు చెందిన రూ.9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది.
• టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధి దీపాలు వేశాం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం, కరెంటు సమస్యలు పరిష్కరిస్తాం.
• ప్రతిఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన నీరు అందజేస్తాం.