అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం అందించింది. ఏపీలో రూ.27,370 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భారీ విద్యుత్ ప్రసార ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సోలార్, విండ్, పంప్డ్
స్టోరేజ్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడమే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదించింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఊతమిచ్చింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని విస్తరించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ 3) కింద ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్
లైన్లు, రామాయపట్నం, కొప్పాకలలో కొత్తగా 400 కేవీ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో విద్యుత్ ప్రసార వ్యవస్థ ఆధునికీకరణకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. రూ.27,370 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఆమోదించింది. 9,500 వీవాూ సామర్థ్యంతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. 2029-30 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికలను కేంద్రం రచించింది. ఏపీలోని పోర్టు ప్రాంతాలు, పారిశ్రామిక క్లస్టర్లకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రామాయపట్నంలో 400 కేవీ సబ్ స్టేషన్ ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
