- పార్టీలోకి కొలనుకొండ, ఆత్మకూరు సీపీఎం నేతలు
- పేరుకలపూడి, ఈమని, చిలువూరు వైసీపీ నేతలు
- వీరితో పాటు సుమారు 200 కుటుంబాలు చేరిక
- కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): మంగళగిరి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామా నికి చెందిన సీపీఎం మండల కమిటీ మాజీ సభ్యుడు, కాట్రగడ్డ శివన్నారాయణతోపాటు ఆ పార్టీకి చెందిన 100 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన సీపీఎం మండల మాజీ కార్యదర్శి, మాజీ ఉపసర్పంచ్ ముసలి జ్యోతిబసుతోపాటు 40 కుటుంబాలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరాయి. దుగ్గిరాల మండలం పేరుకలపూడికి చెందిన వైసీపీ సీనియర్ నేత నూతలపాటి చెన్నకేశవ రావుతోపాటు 10 కుటుంబాలు, దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉయ్యూరు వెంకటేశ్వరరావుతోపాటు వైసీపీకి చెందిన 15 కుటుం బాలు, ఈమనికి చెందిన వైసీపీ నేత ముద్రబోయిన శ్రీనుతోపాటు 15 కుటుంబాలు, దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత షేక్ యూసబ్ తోపాటు 10కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉండవల్లి నివాసంలో వీరందరికీ టీడీపీ కండువాలు కప్పి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించారు
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు మంగళగిరికి వచ్చాను. నేనేంటో మీకు అర్థం కాలేదు. మీ సమస్య లేంటో నాకు తెలియవు. ఫలితంగా 5,300ఓట్ల తేడా తో ఓడిపోయాను. అప్పటి నుంచి ఐదేళ్లపాటు ప్రజల్లో ఉండి వారి సమస్యలు అర్థం చేసుకున్నా. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ పరంగా చేపట్టాం. అంతకుముందు 15ఏళ్లు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతి నిధ్యంవహించిన వారు చేసిన అభివృద్ధిని, నేను చేపట్టిన కార్యక్రమాలను బేరీజు వేసు కుని 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా. ఎంత ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే అంత బలం వస్తుందని ఆనాడు చెప్పా. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక 91వేల మెజార్టీతో గెలిపించారని తెలిపారు.
7 వేల ఇంటి పట్టాలు అందించాం
అత్యధిక మెజార్టీతో గెలిపించారు కనుకనే మంగళ గిరి నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కమ్యూనిటీ, అంగన్వాడీ భవనాలు, పార్కులు, చెరువులు, శ్మశానాలు, చర్చిలు, దేవాలయాలు అభివృద్ధిచేశాం. దేశం మొత్తం మంగళ గిరి వైపు చూసేలా నిడమర్రు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశాం. క్రమ పద్ధతిలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.
కక్షలు ముఖ్యం కాదు..
అభివృద్ధి ముఖ్యం అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మొదటి దశ కింద రూ.1,300 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టాం. 2029 నాటికి ప్రతి గడపకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తాం. అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్, గ్యాస్, కరెంట్ అందిస్తాం. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశాం. నూతన వస్త్రాలు, భోజనం పెట్టి ఇప్పటి వరకు 7వేల ఇంటి పట్టాలు అందించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదని చెప్పారు.
నేతలు ప్రజల మనస్సు గెలుచుకోవాలి
మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నియోజక వర్గ అభివృద్ధికి ఐదేళ్లు అహర్నిశలు కష్టపడతా. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీమెజార్టీతో గెలిచేలా చూడాల్సిన బాధ్యతస్థానిక నాయకత్వానిదే. నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. ప్రజల మనస్సు గెలుచుకోవాల్సిన బాధ్యత ఇక్కడి నాయకులపై ఉంది. అహంకారం వీడాలి. అందరినీ కలుపుకునిపోవాలి. నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరంఉందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం
అబద్దయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి రూరల్ టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.


