- విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
- ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సమావేశం
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులను వివరించిన కేశినేని
విజయవాడ(చైతన్యరథం): పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానమైన నాలుగు డ్రైన్ల సమ స్య రైల్వే శాఖతో ముడిపడి ఉంది. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే విజ యవాడకు ఇటీవల వరద కూడా వచ్చేది కాదు. డ్రైనేజీ పూడికలు తీసి ఉంటే ఇబ్బందులు పడేవారు కాదు. రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, వీఎంసీ అధికారులు కలిసి ఉమ్మడిగా పరిశీలించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ, విజయవాడ రైల్వే శాఖకు ఉన్న సమస్యలు పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఎంపీ చెప్పారు. ఈ నేపథ్యంలో మధురానగర్ ఈటీటీసీ కేంద్రంలో ఏపీలో రైల్వే పెండిరగ్ ప్రాజెక్టులపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ శుక్రవారం ఎంపీలందరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని విజయవాడ పార్లమెంట్ పరిధిలో పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులపై జీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజీ శాశ్వత పరిష్కారా నికి రైల్వే శాఖతో ముడిపడి ఉన్న సమస్యను వివరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైల్వేల్లో రాష్ట్రం వెనకబడిరదని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌కు భూసేకరణ జరగలేదన్నారు. రైల్వే అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదన్నారు. రైల్వే అధికారుల సహకారంతో చిత్తశుద్ధితో పనిచేసి ఆ పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించటం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్‌వోబీలు, రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు, కొత్త రైల్వేలైన్లు, కొత్త రైళ్లు వంటి ప్రతిపాదనలపై చర్చించినట్టు తెలిపారు. అమరావతి రాజధాని రైల్వే లైన్‌కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో రైల్వేలైన్ పను లు ప్రారంభం అవుతాయన్నారు. అలాగే రాజధానికి కొత్త ట్రైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు కావాలని కోరగా రైల్వే బోర్డుకు సమాచారం అందించి అవి వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులు పురోగమనం దిశగా సాగుతున్నాయన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి రైల్వే శాఖ నుంచి ఏమి కావాలో, ఏమి పనులు చేయించుకోవాలో అవన్నీ చేయించుకుంటామని తెలిపారు.
ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య ప్రతిపాదనలు
ముస్తాబాద్ రైల్వేస్టేషన్ వద్ద వరద నీరు ప్రవహించేలా బుడమేరును వెడల్పు చేయ డానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలి. 30 ఏళ్ల క్రితం నిర్మించిన జగ్గయ్యపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ జరగాలి. ప్యాసింజర్ రైళ్లు ఆగే ఏర్పాటు చేయాలి. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి. ఎస్కలేటర్లు సరిగా పనిచేయడం లేదు. కొండపల్లి, ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి ఆర్‌ఓబీలు త్వరగా ఆమోదించాలి. హౌరా రైళ్లను విజయవాడ నార్త్ సెక్షన్‌లో నుంచి ఆపరేట్ చేయాలి. 2023 మార్చి 2 రైల్వే జాయింట్ సర్వే ఆధారంగా ఆర్‌ఓబీల నిర్మాణం 100 శాతం రైల్వే ఖర్చుతో జరగాలి. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలంలో ఎల్‌సీ నెంబరు 140 కొండపల్లి వద్ద, ఎల్‌సీ నెంబరు 147 ఎలాప్రోలు వద్ద ఆర్‌వోబీకి ఆమోదించాలి. అలాగే విజయవాడ రూరల్ మండలం ఎల్‌సీ నెంబరు 148 రాయనపాడు వద్ద ఆర్‌వోబీతో పాటు ఆర్‌యూబీ ఆమోదించాలి. ఎల్‌సీ నెంబరు 150 గొల్లపూడి వద్ద ఆర్‌వోబీకి ఆమోదం తెలపాలి.