- బీఆర్ నాయుడు చేసిన తప్పేంటి?
- అమరావతి రైతులకు మద్దతు తెలపడం నేరమా?
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, అక్టోబరు 25(చైతన్యరథం): ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగం ఏపీలో కష్టకాలంలో ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపు తున్న మీడియాపై జగన్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకట నలో మండిపడ్డారు. టీవీ 5చైర్మన్‌న్నారు. బి.ఆర్.నాయుడు చేసిన తప్పేం టని ప్రశ్నించారు. ఆయన ఏ బి.ఆర్ నాయుడుకి సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్‌రెడ్డి నియంత పాలన కు నిదర్శనమమైనా పాకిస్థాన్ బార్డర్ లోకి వెళ్లి ఉగ్రవాదులను కలిశారా అని అడిగారు. అమరావతి రైతులకు మద్దతు తెలపడం నేరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుల్ని నులిమేయాలని జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యాలను దాచి పెట్టి జనాన్ని కుడి యడమల దగా చేయాలన్న దురుద్దేశ్యంతో మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అధి కార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. జగన్‌రెడ్డి మూడున్నరేళ్లలో సీఐడీ నోటీసులకు ఏ4 పేపర్ల కోసం ఖర్చు చేసిన డబ్బులతో ఒక నెల పాటు రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్లు నడపొచ్చన్నారు. జగ న్‌రెడ్డి ఇకనైనా నియంత లక్షణాలు వీడి ప్రజా స్వామ్య పాలన అలవర్చుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.