- కావాలనే వారు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
- ఉత్తరాంధ్ర కోసం మూడేళ్లలో 3 ఇటుకలైనా పెట్టారా?
- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం: అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో మంత్రులు అవగాహన లేకుండా పిచ్చెక్కినట్లుగా మాట్లాడుతున్నారని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంజిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలోని కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో పాల్గొన్న అచ్చెన్న విలేకరులతో మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు రూ.10లక్షల కోట్లు ఖర్చవుతుందని, రాష్ట్ర ఖజానా అంతా అమరావతి అభివృద్ధికే ఖర్చు చేస్తే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమంటూ మంత్రు లు తప్పుడు మాటలు మాట్లాడటం సబబుకాదన్నారు. రాజధాని అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రాబోయే 15ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయాల్సింది కేవలం 14వేల కోట్లరూపాయలు మాత్రమే. ఈ విషయం తెలిసి కూడా మంత్రులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులు వారికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని అమరావతి-అరసవెల్లి మహా పాదయాత్ర చేపడితే ఉత్తరాంధ్రలోని దద్దమ్మ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తే ఎవరూ వద్దన్నారు, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదా అని వితండవాదం చేస్తున్నారు, నిజంగా ఉత్తరాంధ్రపై ప్రేమే ఉంటే మూడున్నరేళ్ల పాలనలో ఎక్కడైనా మూడు ఇటుకలైనా పెట్టారా అని నిలదీశారు. అమరావతి రాజధాని విశాఖకు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకే విశాఖ రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఈ మూడు సంవత్స రాల్లో ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా? అని ప్రశ్నించారు.
అమరావతి రైతులను వేధించడం దారుణం
విభజిత ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబువల్లే సాధ్యమని నమ్మి ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో 34 వేల ఎకరాలు త్యాగం చేశారు. ఒక గజం స్థలం పోతేనే తలలు పగులగొట్టుకునే ఈరోజుల్లో రాష్ట్రం కోసం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇంత భారీఎత్తున భూములిచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగు నా అవమానిస్తూ వేధించడం దారుణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషిచేశాం, తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేశాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి టెండర్లు పిలిచాం, నేషనల్ హైవే ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఐటిపరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని తెలి పారు. ఈ మూడున్నర సంవత్సరాల జగన్‌రెడ్డి పాలన లో ఒక్కటంటే ఒక్కపరిశ్రమ కూడా ఉత్తరాంధ్రకు తీసుకురాలేదు. విశాఖతోపాటు ఉత్తరాంధ్రను అడ్డగో లుగా దోచుకొని నాశనంచేసి సిగ్గు లేకుండా మాట్లా డుతున్నారని దుయ్యబట్టారు.విజ్జులైన ఉత్తరాంధ్ర ప్రజ లు ఈ విషయాలన్నీ గమనించాలి. అమరావతి రైతు లు చేస్తున్న పాదయాత్రకు రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీలు సహకరిస్తున్నాయి. అందరూ కలిసి వారి కి సంఫీుభావం తెలపాలని కోరారు. పాదయాత్రను చెడగొట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం మాట్లాడాలో అర్థం కాక వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జగన్ ఎన్నికలకు ముందు ఒకమాట, తర్వాత ఒకటి మాట్లాడి ప్రజల్లో చులకనయ్యారు. ఆ పరిస్థితి తమకు రాకూడదనే వైసిపి ప్రజాప్రతినిధులు ఆ సమావేశానికి దూరంగా ఉన్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.