- డాక్టర్ ఎమ్మెల్యే దోపిడీ 1200 కోట్లు
- ఎమ్మెల్సీ తమ్ముడే అతని సైన్యం..
- కొండలు పిండేశారు.. చెరువులు పీల్చేశారు
- ప్రతి పనికీ రేటు.. కాదంటే కాటు
- చీకటి పనులకు అనధికార కేబినెట్
- శ్రీవారి సిఫార్స్ టికెట్లకూ శఠగోపం
- ఇదీ మొండితోక బ్రదర్స్ అంతులేని దందా
చదివింది డాక్టరు
జనం ముందు యాక్టరు.
చేసేది ప్రజా – సేవ
కోట్లు మింగేయాలన్న – యావ.
ఉన్నత చదువులు చదివిన బుద్ధి `వక్రమార్గం పట్టింది.మొండితోక బుర్రలో`కుట్ర రూపుదిద్దు కుంది. కోట్లు కొల్లగొట్టాలంటే వైసీపీ తానులో దారంపోగైనా చాలనుకున్నాడు. అలా.. మొండితోక జగన్మోహన్‌రావు అను అతను ఫ్యానుగాలికి ఎగిరొచ్చి నందిగామ ఎమ్మెల్యే అయ్యాడు. అంతే.. ప్రాణాలు పోయాల్సిన వైద్యవృత్తి మాయమై.. ప్రాణాలు తోడేసే నీచ రాజకీయ ప్రవృత్తి బలపడిరది అతని బుర్రలో.
అధికారంలోకి రాగానే..
ఆవు చేలోమేస్తే దూడగట్టున మేయాలా? అని ప్రశ్నించుకున్నాడు. వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి మాదిరే తానూ చేలోకే దిగాడు. కాకపోతే..తొండి జగన్ రాష్ట్రం మీద పడితే.. మొండితోక నందిగామ మీదకు ఎగ బడిరది. కట్‌చేస్తే `ఐదేళ్లలో అతని ఆస్తి రూ.1200 కోట్లయ్యింది. అధికార పరిధి, ప్రాంత పరిధిలాంటి లెక్కల్లో నిష్పత్తులు లెక్కగడితే`జగన్‌ను మించి ఆస్తుల ను మొండితోక కూడబెట్టారన్నది.. నియోజకవర్గం మొత్తం నిలువుకాళ్లపై నిలబడి చెప్పే పచ్చి నిజం.
ఆవు చేలోపడితే.. పంట నాశమనమవుద్ది. మొండితోక నియోజకవర్గంపై ఎగబడితే.. నందిగామ సర్వనాశనమైంది. సహజసిద్ధమైన కొండలు, పచ్చటి పొలాలు, చారిత్రక దేవాలయాలతో రమణీయమైన నందిగామ నేడు నిస్సారమైంది. సహజ వనరుల దోపిడీకి గురైంది. భూకబ్జాలకు అడ్డాగా మారింది. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ – మళ్లీ అధికారం చేపట్టడం కష్టమని మొండితోక ముందే ఊహించాడు. తమ్ముడు మొండితోక అరుణ్‌కుమార్‌ని తోడేసుకుని.. నందిగామను చెరబట్టిన నయీం సోదరుల్లా మారారు. ప్రజలను పీల్చిపిప్పి చేశారు.
ఈ భూబకాసురుల దెబ్బకు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులు మాయమయ్యాయి. ప్రైవేటు ఆస్తులకు రక్షణ కరవైంది. కొండలను, గుట్టలను తవ్వేస్తూ.. మహావృక్షాలను కూకటి వేళ్లకు నరికేస్తూ నందిగామకే నిలువ నీడలేకుండా చేశారు. ఖాళీ భూములు కబ్జా చేశారు. శ్మశానాలు, చెరువులు, దళితుల భూములే కాదు.. కొండల్ని సైతం మింగేసి నందిగామ అనకొండలనిపించుకున్నాయి ఈ మొండితోకలు. ఏతావాతా ఐదేళ్లలో ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.1200 కోట్ల ఆస్తులు కూడబెట్టారని నందిగామ కోడై కూస్తోంది. మొండితోక బ్రదర్స్ అవినీతికి అంతులేదు. టీటీడీ దర్శనాలకు ఇచ్చే సిఫార్స్ లెటర్లూ బహిరంగంగా అమ్మకానికి పెట్టడం నుంచి.. కొండల్ని కూల్చేసి పిండిగా అమ్మేయడం వరకూ వీళ్ల దందా సాగిపోతోందంటే.. అవినీతి పరాకాష్టను అంచనా వేసుకోవచ్చు.
చేతికి మట్టంటకుండా…
మొండితోక జగన్మోహన్‌రావు డాక్టరే కాదు.. యాక్టర్ కూడా. సెగ్మెంట్‌లో అరాచకాలకు, అవినీతి కార్యకలాపాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఈ ఎమ్మెల్యే వైద్యుడే. మొత్తం దందాను ముందుండి నడిపించేది మాత్రం తమ్ముడు అరుణ్‌కుమార్. వైద్యవృత్తితో యువతకు ఆదర్శంగా నిలవాల్సిన మొండితోక జగన్మో హన్‌రావు`420లు, మాఫియాలకు కింగ్‌పిన్‌గా మారా డు. చేతికి మట్టంటకుండా దందాలు సాగించ టంలో దిట్ట. భూకబ్జాలు, ఇసుక మాఫియా, జె`ట్యాక్స్ వసూ లుకు సంబంధించిన ప్రణాళికలను మొండితోక జగ న్మోహన్‌రావు రూపొందించి.. తమ్ముడైన ఎమ్మెల్సీ అరు ణ్‌కుమార్‌తో వ్యవహారాన్ని నడిపిస్తుంటాడు. కాంట్రా క్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం, పోస్టింగులకు రేటు నిర్ణయించడం, అడ్డగోలు అక్రమాల ద్వారా సం పాదించిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడం వంటి చర్యలన్నీ అరుణ్‌కుమార్.. అన్న పట్ల అచెంచల భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటాడు.
ప్రతి పనికీ పైసా వసూల్..
ఎమ్మెల్యే సిఫారసు కావాలన్నా, ఫోన్ సాయం చేయాలన్నా, సంతకం పెట్టాలన్నా `పైసా ఇవ్వనిదే ఫైలు ముందుకెళ్లదు. నందిగామ ప్రజల రక్తం పిండటంలో వీళ్లు సిద్ధహస్తులు.
1. ట్రక్కు మట్టికి రైతు కట్టాల్సిన కప్పం రూ. 3000.
2. నాలుగు మండలాల్లో.. ఒక్కో పోలీస్ స్టేషన్ నుండి నెలవారీ దందా రూ.2.5 లక్షలు.
3. నియోజకవర్గ పరిధిలో ఒక్కో బార్ లైసెన్స్‌కి ముడుపులు రూ.25లక్షలు.
4. ప్రతి అపార్ట్‌మెంట్ నుండి రూ.5 లక్షల మేర వసూలు… లేకుంటే మున్సిపల్ దాడులు.
5. కేబుల్ యాజమాన్యం నుండి ఏడాదికి దందా గిఫ్ట్ రూ.5 లక్షలు.
6. దీపావళి టపాసుల లైసెన్స్ షాప్‌ల మీదా వసూళ్లే.
7. వ్యాపారులు దగ్గర బెదిరించి వసూళ్లు.
8. అమ్మకానికి టీటీడీ దర్శనం లెటర్ రూ.10 వేలు.
9. టీచర్ల బదిలీకి రూ.లక్ష.
10. పోలీస్ పోస్టింగ్‌కు రూ.5 నుంచి రూ.20 లక్షలు.
11. రెవెన్యూలో పోస్టింగ్‌కు రూ.10 లక్షలు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మచ్చుకే..
ప్రభుత్వ స్థలాల్లో వెంచర్లు
వైసీపీ అవినీతి అనకొండలు ప్రభుత్వ స్థలాల్లో వెంచర్లు వేసి ప్రజలకు అమ్మడం సర్వసాధారణం. కానీ ఇక్కడ పంట పొలాలకు నీళ్లిచ్చే చెరువులు, కాల్వలను కబ్జా చేసి.. వెంచర్లు వేసి.. ప్రజలకు అమ్మిన చరిత్ర మొండితోక సోదరులది. నందిగామ పట్టణానికి దగ్గరలోని పీడబ్ల్యుడి, ఎన్‌ఎస్‌డబ్ల్యు కాల్వలు పూడ్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉండడంతో సెంటు రూ.3 లక్షలు చొప్పున విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నారు. విషయం బట్టబయలైతే ఇబ్బందులు తలెత్తుతాయని ముందేగ్రహించి ఇందులో కొంత భాగాన్ని పేదలకు ఇళ్ల పట్టాల పేరిట మరో నాటకానికి తెరలేపారు. ఇక్కడ పేదలంటే మొండితోక బ్రదర్స్ అనుచరులు మాత్రమే. వారి పేరుతో 3 ఎకరాలు ఇళ్ల స్థలాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సెంటు పట్టా భూములు పంపిణీ చేస్తే, నందిగామలో మాత్రం 2 సెంట్లు, 3 సెంట్లు పంపిణీ చేశారు. ఎందుకంటే, లబ్ధిదారులు ప్రజలు కాదు, మొండితోక బినామీలు. విచిత్రమేంటంటే ఇళ్ల స్థలాలు ఇచ్చింది ప్రభుత్వ అధికారులు కాదు, మొండితొక బ్రదర్సే. దగ్గరుండి తతంగం పూర్తి చేయించడం గమనార్హం.
మాయమైన కొండలు..
రాఘవాపురం, పెద్దవరం, నందిగామ రూరల్ మండలంలోని పల్లగిరి కొండ, మొగలూరులోని కీసర కొండ కొండలను తవ్వేసి ఆనవాళ్లు కూడా లేకుండా చేసేశారు మొండితోక బ్రదర్స్. రోజుకు 100 లారీలు తగ్గకుండా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఒక్కో లారీ గ్రావెల్‌ను రూ.25 వేలకు అమ్ముతున్నారు. అంటే రోజుకి ఈ అక్రమార్కుల ఆదాయం రూ.20 లక్షలు పైనే. కొండలు, గుట్టలు చూస్తుండగానే లోయలయ్యాయి. కొండలను పిండి చేసేందుకు ప్రత్యేకంగా చెన్నై నుండి భారీ క్రేన్లు తీసుకొచ్చి మరీ దందా నడిపిస్తున్నా అడిగే నాధుడే లేడు. పేదలకు ఇస్తున్న ఇళ్ళ స్థలాల మెరక కోసమని గోరంత మొత్తానికి అనుమతి తెచ్చుకుని కొండ మొత్తాన్ని తవ్వేస్తున్నారు. నందిగామ` కంచికచర్ల బైపాస్ రహదారి విస్తరణకు గ్రావెల్ అవసరమని అనుమతి పొందిన కాంట్రాక్టర్ వద్ద రూ.3 కోట్లు డబ్బులు వసూలు చేసి అనుమతి ఇచ్చినచోట కాకుండా మరోచోట మైనింగ్‌కు ఎమ్మెల్యే అనుమతి ఇచ్చాడు. కొండలను తవ్వడాన్ని ప్రశ్నించిన ప్రజా సంఘాలపై దాడులకూ పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేని దుస్థితి.
మున్సిపాలిటీల్లో అవినీతి..
నందిగామ మున్సిపాలిటీలో ఏ ఫైలు క్లియరవ్వా లన్నా మొండితోక సోదరుల అనుమతి కావాల్సిందే. నిర్మాణాలు, లేఅవుట్లకు, షాపుల లైసెన్సులకు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఏ కాంట్రాక్టరు అయినా నెలకు లక్షల్లో అవినీతి బ్రదర్స్‌కు కప్పం కట్టాల్సిందే. లేదంటే అతని బిల్లులు ఆపేయడం, అక్రమంగా తొలగించడం వంటివి సర్వసాధారణం. మున్సిపాలిటీ ల్లో జరిగే టెండర్లలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ హయాంలో ఎక్కడా ఎక్సెస్ టెండర్లు నమోదు కాలేదు. ఇప్పుడు 20శాతం పైనే ఎక్సెస్‌తో టెండర్లు ఆమోదించి కోట్ల అవినీతికి తెరలేపారు.
కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు..
నందిగామ నుంచి కంచికచర్ల వరకు హైవే విస్తరణ పనులు చేపట్టినప్పుడు కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ.20 కోట్లు వసూలు చేశారు. నందిగామలో రోడ్డు విస్తరణ పనులు, కంచికచర్ల, పెద్దాపురం రోడ్డు నిర్మాణ సమయంలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు గుంజారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రూ.87 కోట్లతో నందిగామ టౌన్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుకు టెండర్లు కూడా పూర్తిచేసి కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేశారు. ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన మొండితోక బ్రదర్స్ ఆ టెండర్లను రద్దు చేసి రెండేళ్లపాటు కాలయాపన చేశారు. చివరికి అదే మొత్తానికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి రూ.17 కోట్లు డబ్బులు వసూలు చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను ఇంటికి పిలిపించి బెదిరించి నెలకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో అతను కాంట్రాక్టు వదిలేసి పారిపోయాడు. మరో అసమర్థుడిని తీసుకొచ్చి నెలకు రూ.లక్ష తీసుకుంటూ నాసిరకం పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
టీటీడీ టిక్కెట్లూ అమ్మకం..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా కింద ఇచ్చే సిఫారసు లేఖలను కూడా నయీం సోదరులు బేరానికి పెట్టారు. ఒక్కో లెటర్ రూ.10 వేల చొప్పున విక్రయించిన విషయం టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సోదాలో బట్టబయలైంది. మంత్రి పెద్దిరెడ్డిని పట్టుకుని లాబీ యింగ్ చేసి కేసునుంచి తప్పించుకోవడం కొసమెరుపు.