.ఎవరి ఆదేశాల మేరకు సిఐడి చీఫ్ రంగంలోకి దిగారు?
.చేతనైతే అసలు వీడియో తెప్పించే ప్రయత్నం చేయండి
.తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
విశాఖపట్నం: గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నివేదికను కొమ్మారెడ్డి పట్టాభి రామ్ బయటపెట్టిన నాలుగు రోజుల తర్వాత పిలవని పేరాంటానికి వచ్చిన రీతిలో సీఐడీ అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ప్రజల ముందుకు వచ్చి ఆ నివేదిక ఒరిజినల్ కాదని ఏదోదో మాట్లాడుతున్నారు.. అసలు ఈ కేసుతో మీకు ఏమిటి సంబంధం.. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి ఏమైనా రిఫర్ చేసిందా? మిమ్మల్ని నడిపిస్తున్న, రంగంలోకి దించిన అదృశ్య శక్తి ఎవరని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన వీడియోలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించాలని మేం కోరితే..లా అండ్ అర్డర్ పోలీసులు దానిపై నివేదిక ఇచ్చాక డీజీపీ ఆదేశిస్తేనే సీఐడీకి రిఫర్ చేస్తామని గతంలో పోలీసు అధికారులు మాతో చెప్పారు. ఇప్పుడు డీజీపీ, ఎస్పీ పకీరప్పను పక్కనబెట్టి అకస్మాత్తుగా సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ బయటికొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? సీఐడీని కేసు తీసుకోమని ఎవరైనా రాతపూర్వకంగా ఆదేశించారా అని అనిత ప్రశ్నించారు. పోనీ ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు కూడా సిఐడి ఎక్కడా చెప్పలేదు, అటువంటపుడు ఏ అధికారంతో సునీల్ కుమార్ ఫారిన్ ఏజన్సీతో ఉత్తర,ప్రత్యుత్తరాలు జరుపుతారని నిలదీశారు.
ఎవరి ఆదేశాలమేరకు సిఐడి చీఫ్ రంగంలోకి వచ్చారు?
ఎవరి ఆదేశాల మేరకు మాధవ్ ను తప్పించడానికి సిఐడి చీఫ్ రంగంలోకి దిగారో సమాధానం చెప్పాలి. కోట్లాదిమంది మహిళల మనోభావాలతో కూడిన వ్యవహారంలో మానవమృగం మాధవ్ ను తప్పించడానికి సునీల్ కుమార్ లాంటి పోలీసు అధికారులంతా తప్పుమీద తప్పు చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే పనిచేసిన ఒక ఎంపిని కాపాడేందుకు ఐపిఎస్ అధికారులు పడుతున్న తాపత్రయం చూస్తే సిగ్గనిపిస్తోంది.. ఆ వీడియో ఒరిజినల్ కాదని మీరు ఏ ఆధారంతో చెబుతారు? నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాక అప్పుడు ఏది నిజమో చెప్పండి.. అప్పటివరకు సునీల్ వంటివారు బుకాయింపులు ఆపాలి. తప్పుడు పనిచేసి వీడియోలో అడ్డంగా దొరికిపోయిన మదపిచ్చి మాధవ్ ను రక్షించాలనే తపనతో యావత్ పోలీసు డిపార్టమెంటు ప్రభుత్వం వాడుకున్న తీరును చూస్తుంటే పోలీసులపై జాలేస్తోంది.
ప్రైవేటు నివేదిక పరిగణనలోకి తీసుకోబోమని చెప్పి
ఎలా ఉత్తర, ప్రత్యుత్తరాలు చేశారు?
ఎంపీ గోరంట్ల వీడియోకు సంబంధించి ప్రైవేటు ల్యాబరేటరీ నివేదికను పరిగణలోకి తీసుకోబోమని చెబు తున్న సునీల్ కుమార్ ఎక్లిప్స్‌కు ఎందుకు మెయిల్ పంపి చారు? గతంలో పక్కీరప్ప మాట్లాడుతూ మాధవ్ ఫిర్యాదు చేయలేదని, అతని అనుచరులు ఎవరో ఇచ్చారని చెప్పి నట్లు చెప్పారు. దేశంలో అధికారిక ల్యాబ్‌ల నుంచి నివేదిక తెప్పించుకునే హక్కు పోలీసులకు ఉంది, ఎందుకు ఆ పనిచేయడం లేదు? సీఎం,పోలీసులు, వైసీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడతారు అనుకుంటే,ఏ సంబంధంలేని సీఐడీ మీడియా ముందుకొచ్చి టీడీపీవారు ఎక్లిప్స్ ద్వారా తెప్పించిన నివేదిక ఫేక్ అని సునీల్‌కుమార్ విలేకరుల సమావేశం పెట్టిమరీ వివరణఇవ్వడమేమిటని అడిగారు. జిమ్ స్టాఫోర్ట్‌కి పెట్టిన మెయిల్‌లో regarding a fake certificate in circulation on your name ఉంది. ముందుగానే ఫేక్‌వీడియో అని సునీల్‌కుమార్ నిర్థారణకు రావడం వెనుక ఏ శక్తులు పనిచేశాయి? ఇద్దరి మధ్య వీడియోకాల్ సంభాషణ జరుగుతున్న దాన్ని ఎవరో వీడి యో తీశారని, ఆ వీడియో ఒరిజినల్ కాదని మాట్లాడు తున్నారు, నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు నేషనల్ ఫోరెన్సీక్ ల్యాబ్‌కు ఆ వీడియోను ఎందుకు పంపించలేదు? ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మహిళల పరిస్థితి ఏంటి? తప్పు చేసిన ఎంపీని తక్షణమే బర్తరఫ్ చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.