- సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయాలన్న సీఎం చంద్రబాబు
- గ్రామాల్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
- వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార శుద్ధితో విలువ పెంపు
- ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీపం సమీక్ష
అమరావతి (చైతన్య రథం): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి… పలు సూచనలు, ఆదేశాలిచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి చేయూతనిస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వంనుంచి తగు ప్రోత్సాహమందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం సూచించారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండిరగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి… వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రలమ ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం అన్నారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్‌లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు.
రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ది చేకూర్చామో… అదేతరహా విధానాన్ని ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటులోనూ అవలంభించాలన్నారు. పూణెవంటిచోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా…. అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సీఎం అదేశించారు. నిర్థేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారైనా.. విభాగమైనా అనుమతి ఇవ్వకపోతే…. ఆటోమేటిక్‌గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే….. చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందన్నారు. డ్వాక్రా సంఘాలవంటి వాటిని ఎంఎస్ఎంఇలతో అనుసంధానించాలని, వారిని ప్రోత్సహించాలన్నారు.
ఎప్పటి నుంచో పెండిరగ్‌లోవున్న పరిశ్రమల ఇన్సెంటివ్స్ను ఇవ్వాల్సిన అవసరముందని… దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యచరణ అమలు చేయాలన్నారు. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని సీఎం అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలోవున్న 7 క్లస్టర్లను పూర్తి చెయ్యాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. విశ్వకర్మవంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, శిక్షణ అందేలా చూడాలన్నారు.
ఆహార శుద్ధి పరిశ్రమకు రాష్ట్రంలో అపార అవకాశాలు
రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్ ఉత్తత్తులకు… ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం అన్నారు. రైతులు తాము పండిరచే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించేలా పాలసీ తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిరచే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని…. వాటిని ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఆయా ప్రాంతాల్లో పండే టమాటా, మ్యాంగో, మిరప, పసుపు, ఆక్వా ఉత్పత్తులకు అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానించి గ్రామాల్లో ప్రోత్సాహమిచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. సమీక్షలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.