- ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
- ఓటుహక్కు వినియోగించుకున్న పుర ప్రజలు
- స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిన బ్యాలెట్ బాక్సులు
- రేపే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
- రెండు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి
- నివేదికలు వచ్చాక నిర్ణయం తీసుకుంటాం
- పూర్తి వివరాలు వచ్చాక పోలింగ్ శాతం వెల్లడిస్తాం
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్‌చంద్ర పునేఠా
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం జరిగిన ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు కుటుంబసమేతంగా వచ్చి ఓటు వేశారు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓటర్ల చైతన్యం కనిపిం చింది. అనకాపల్లి, మన్యం జిల్లా పరిధిలో కొన్నిచోట్ల ఓటింగ్ శాతం అధికంగా నమోదైంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, మార్కాపురం జిల్లాల్లో అన్నిచోట్లా పురపోరు ప్రశాంతంగా సాగిం ది. రాయలసీమలో పలుచోట్ల చిన్నపాటి ఘర్షణలు చోటు చేసు కోవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాలో కాసేపు గందరగోళం నెలకొంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 55వ డివిజ న్లో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పొడిగించింది. బ్యాలె ట్ పేపర్‌పై గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటు వేసేందుకు రెండున్నర గంటల అదనపు సమయం ఇచ్చారు. పిఠాపురంలో ఒక వార్డులో స్వల్ప వివాదం చోటుచేసుకుంది.
పోలింగ్ సరళిని పరిశీలించిన ఎసఈసీ
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించామని ఎసఈసీ అనిల్‌చంద్ర పునేఠా చెప్పుకొచ్చారు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ఘటనలు జరిగినట్లు జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పోలింగ్ పూర్తయిన అనంతరం అందే ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో) నివేదికలు, ఇతర ఆధారాలను పరిశీ లించి వాస్తవాలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం తదుపరి చర్య లు తీసుకుంటామని వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 48.03 శాతం పోలింగ్ నమోదైనట్లు కమిషనర్ వెల్లడించారు. పూర్తి వివరాలు అందిన అనంతరం సోమవారం నాటికి కచ్చితమైన పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా విజయవాడలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 20 జిల్లాల్లో 41 ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటికి సంబంధిం చిన వివరాలను సేకరిస్తున్నామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ప్రతి ఘటనలోనూ వాస్తవ పరిస్థి తులను నిర్ధారించి నిందితులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
















