- అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని హెచ్చరిక
- అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని ధీమా
- సిక్కోలు ఆర్మీవాసులకు ప్రత్యేక కార్పొరేషన్‌కు హామీ
- సూపర్ సిక్స్‌ని హిట్ చేయాలని శ్రేణులకు పిలుపు
శ్రీకాకుళం (చైతన్యరథం): మై డియర్ జగన్, టైం, డేట్ ఫిక్స్ చెయ్. నీ అవినీతిపై, మాపై చేస్తున్న ఆరోపణలపై చర్చకు మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? `అని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తీవ్ర స్వరంతో సవాల్ విసిరారు. జగన్ అన్నం తినడం మానేసి ఇసుక తినడమే పనిగా పెట్టుకున్నాడు. ట్రాక్టర్ ఇసుక 5వేలకు పెరగడానికి కారణం అదే. వైసీపీ మూక మొత్తం రాష్ట్రంలోని ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారు. రోజుకు 3 కోట్లు, ఏడాదికి 1080 కోట్లు, ఐదేళ్లలో 5,400కోట్లు ఇసుక దందా సాగించిన ఘనత జగన్‌దేనని లోకేష్ విరుచుకుపడ్డారు.
యువ గళానికి మలి యాత్రగా మొదలైన శంఖారావంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం సభలో లోకేష్ మాట్లాడారు. వైసీపీ జమానాలో `చట్టాలు ఉల్లంఘిం చిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో రాశానని, దీనికి డిమాండ్ బాగా పెరిగిందని ఛలోక్తి విసిరారు. ఈ విషయంలో తనపై పెట్టిన చెత్త కేసులకు బెదిరేది లేదని హెచ్చరిం చారు. సభకు పెద్దఎత్తున హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ `ఉత్తరాంధ్ర ఊపే వేరు.
ఉత్తరాంధ్ర అంటే విప్లవం. ఇప్పుడు ఆ విప్లవం మొదలైంది. సిక్కోలు సింహాల్లా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే `తాడేపల్లి కొంప గేట్లు బద్ధలయ్యే రోజులు కనుచూపుమేరలో ఉన్నట్టేనన్నారు. అరసవిల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమినుంచి ఈ సభలో మాట్లా డటం నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాని అంటూ నే.. రెండు నెలలు ఓపిక పట్టండి. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక జిల్లా స్వరూపమే మార్చేద్దామని ధైర్యం చెప్పారు.
కరెంట్ ఛార్జీలు 9సార్లు పెంచారు. బస్‌ఛార్జీలు 3సార్లు పెంచారు. చెత్తపైనా పన్ను వేశారు. రేపు పీల్చే గాలిపైనా పన్నువేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. జగన్‌ను గొప్ప కటింగ్ మాస్టర్‌గా అభివర్ణిస్తూ.. అన్న క్యాంటీన్లు కట్, ప్రమాద బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కేరీల్స్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్, చంద్రన్న బీమావంటి 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్‌రెడ్డి కట్ చేశాడని గుర్తు చేశారు.
ప్రజల కష్టాలు తీర్చేందుకే చంద్రబాబు, పవన్ కలిసి సూపర్ సిక్స్ ప్రకటించారని, వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత క్యాడర్‌పై ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకూ రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తామన్న పార్టీ స్టాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ మాట తప్పిందని, తెలుగుదేశం వాటిని రక్షించగలదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కానీయం, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడతామన్నారు.
వంశధార, తోట పల్లితో పెండిరగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, ఉత్తరాం ధ్రను అభివృద్ధిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని గుర్తుచేశారు. ఉద్దానంలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పా టు చేసిన పార్టీ మనదేనన్నారు. టీడీపీ-జనసేన కార్య కర్తలు రాబోయే రెండు నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అరాచకాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు జగన్‌రెడ్డి 60 హామీలు ఇచ్చిన విష యాన్ని గుర్తు చేస్తూ..పెండిరగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి, ఒక్క ప్రాజెక్టునూ ముందుకు తీసుకెళ్లలేక పోయిన అసమర్థ ప్రభుత్వం వైసీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార, తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తా మని, నాగావళి కరకట్ట పనులు స్పీడ్ చేస్తామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ `అక్కడ కనీసం తట్టమట్టి వేయలేక పోయిందని ఎద్దేవా చేశారు.
ఉత్తరాంధ్ర ను అభివృద్ధిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని చెబుతూ,శ్రీకాకుళం నియో జకవర్గంలో 1200కోట్లతో అనేక అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని. రోడ్లు, నీళ్లు, టిడ్కో ఇళ్లు, పాఠశాలలు కట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా 2019లో ఎందుకు ఓడిపోయామో ప్రతి కార్యకర్త ఆలోచించాలని, చేసిన మంచిని మనం చెప్పుకోలేకపోవడమే కారణమన్నారు. ఈసారి అలాంటి పరిస్థితిలోకి వెళ్లకుండా, అందరం రెండు నెలల పాటు ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడీ తప్ప నియోజకవర్గానికి మీరు చేసిందేమిటి? మేం ఏం అభి వృద్ధి చేశామో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, మీరు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? టైం, డేట్ చెప్పండి.. బహిరంగం చర్చకు సిద్ధం అని లోకేష్ సవాల్ చేశారు. మేం ఎమ్మెల్యేగా ఉంటేనే ఇన్ని చేశాం, మంత్రి ఉంటే నియోజకవర్గ రూపురేఖలు మారాలి కదా. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. ఇదేమీ మీ పనితనం అంటూ ఎద్దేవా చేశారు. సావిత్రిపురం దగ్గర 23 ఎకరాలు మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కలిపి కొట్టేసిన విషయం ప్రపంచానికి తెలుసన్నారు.
అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం
2024లో టీడీపీని గెలిపిస్తే అనంతలో కియా మాదిరిగా ఇక్కడ పరిశ్రమలు తీసుకువస్తామని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సెజ్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ చూసినా సిక్కోలు వాసులే పనిచేస్తారు. సిక్కోలు అంటే కష్టపడే మనుషులు. అమరావతి, హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా పనిచేసేది సిక్కోలు వాసులు. మేంవస్తే ఈ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేశానని, భూమి కూడా కేటాయించామని గుర్తు చేశారు. అయితే కోడిగుడ్డు మంత్రి ఒక్కసారీ దీనిపై దృష్టిపెట్టిన పాపాన పోలేదన్నారు.
సిక్కోలు ఆర్మీవాసులకు ప్రత్యేక కార్పొరేషన్
ఆర్మీలో, మిలటరీలో పెద్ద ఎత్తున సిక్కోలు వాసులుంటారని, వాళ్ల కోరిక మేరకు ప్రత్యేక కార్పోరేషన్‌ను తెదేపా ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చేది టీడీపీయేనని, 2014లో కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షలిచ్చాం. ఇప్పటివరకు రూ.100కోట్లు ఇచ్చాం. వారి పిల్లలను కూడా చదివిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీయేనన్నారు. అదిచూసి ఓర్వలేక వైసీపీ పాలకులు కేసులతో తెలుగు దేశం క్యాడర్‌ను భయపెట్టే ప్రయత్నం చేసిందన్నారు.
ఇలాంటి చెత్త కేసులకు తమ క్యాడర్ భయపడదని అంటూనే.. ఎవరెక్కువ కేసులు పెట్టించుకుంటారో వారికి అంతపెద్ద నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నాదని ఉత్తేజపర్చారు. పార్టీలో రికార్డ్ ఎవరిదో తెలుసా. జేసీ ప్రభాకర్ రెడ్డిపై వంద కేసులు ఉన్నాయి. ఆయన భయపడటం లేదని క్యాడర్‌ను ఉత్సాహపర్చారు. చంద్రబాబు అరెస్ట్ సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. చేయని తప్పుకు చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. మొదటిరోజు ములాఖత్‌కు వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను. మేం ములాఖత్ అయిన బిల్డింగ్ చంద్రబాబు కట్టించిందేనని గుర్తు చేసుకున్నారు.
సూపర్ సిక్స్‌ని హిట్ చేయండి
సూపర్ సిక్స్ కిట్లను క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జి లు ప్రతి ఇంటికి తీసుకెళ్లి హిట్ చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ రెండు నెలలు మీరు ఎక్కడకు వెళ్లినా సూపర్ సిక్స్ గురించి మాట్లాడాలని సూచిం చారు. వైకాపాకు వాలంటీర్లు ఉంటే.. టీడీపీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని ధైర్యం చెప్పా రు. మనం కలిసి అడుగేస్తే`వైసీపీకి బాదుడే బాదు డని శ్రేణులతో కేరింతలు కొట్టించారు. బూబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కోసం బాగా చేసిన వారి పేర్లు తనవద్ద ఉన్నాయని, ఎవరైతే బూత్‌లో కసిగా పనిచేస్తారో వారిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ ఆఫీసుల చుట్టూ కాదు.. ప్రజల చుట్టూ తిరిగితే నేనే స్వయంగా వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని ప్రామిస్‌చేశారు. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టడానికి వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉందని,ఈవిషయంలో జాగ్రత్తగా అడుగు లేయాలన్నారు. వైసీపీ పేటీయం బ్యాచ్ పెళ్లి చేయ లేరుగానీ, చెడగొట్టడానికి రెడీగా ఉంటారంటూ ఎద్దేవా చేశారు. అలాంటి ఐదు రూపాయల బ్యాచ్ లు చేసు తప్పుడు ప్రచారం నమ్మొద్దని హితవు పలి కారు. సొండి కులస్తులు ఓబీసీలో చేర్చాలని అర్జీ ఇచ్చారని అంటూ.. ఓబీసీ విషయం కేంద్రంతో పోరాడాలి. అందుకు మన ఎంపీని గెలిపించాలి. మనం అనుకున్న ప్రభుత్వమే కేంద్రంలో వస్తుంది. ఈ విషయంలో తెదేపాపై నమ్మకంతో ఉండండి అని లోకేష్ హామీ ఇచ్చారు.