చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మనసంతా పోలవరమే..నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారు

పోలవరం వద్ద విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
June 18, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మనసంతా పోలవరమే..నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రాజెక్ట్‌ దుస్థితి బాధ, ఆవేదన, కోపాన్ని కల్గిస్తోంది.
  • జగన్‌ క్షమించరాని నేరం చేశారు
  • మూర్ఖుడి పరిపానలకు పోలవరం ఓ కేస్‌ స్టడీ
  • రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్ట్‌ కుదేలైంది
  • 2020కి పూర్తవాల్సిన ప్రాజెక్ట్‌ను అస్తవ్యస్తం చేశారు
  • పోలవరం వద్ద విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు
  • పోలవరానికి 31వ సారి పర్యటన
పోలవరం,చైతన్యరథం: రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా మార్చాలని ఐదేళ్ల పాటు కష్ట పడ్డ చంద్రబాబు… ఐదేళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ దుస్తితి చూసి ఖిన్నుడయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనగా సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లారు. ఆయన పర్యటన ఆసాంతం ఆవేదనతో సాగింది.   ‘‘ పోలవరం ప్రాజెక్ట్‌ దుస్థితి చూస్తుంటే అందరికంటే ఎక్కువ బాధ నాకే వేస్తోంది. నా మనసంతా పోలవరమే. అందరికన్నా ఎక్కువ సార్లు నేను పోలవరాన్ని సందర్శించాను. ఇక్కడి రావడం నాకు ఇది 31వ సారి. వందకు పైగా సమీక్షలు చేశాను. 2014`19 మధ్య కాలంలో 72 శాతం ప్రాజెక్ట్‌ పూర్తయింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్ట్‌ను అస్తవ్యస్తం చేశారు. నేను పడ్డ కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారు’’ అని బాధ, ఆవేదన నిండిన స్వరంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. 2020 నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్‌ను జగన్‌ రెడ్డి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టి ప్రాజెక్ట్‌ కుదేలయ్యేలా చేసిందని బాధపడ్డారు.
ప్రజా ధనమంతా వృధా అయిపోయిందని, విలువైన కాలం హరించుకుపోయిందని, ఓ మూర్ఖుడు, రాజకీయాలకు ఎందుకు పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో పోలవరం ఓ కేసు స్టడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి చేసిన నిర్వాకం కారణంగా ప్రాజెక్ట్‌ పూర్తవ్వడానికి కనీసంగా మరో నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ చాలా ఆవేదనతో చెప్పారు. ప్రాజెక్ట్‌ను చూడడానికి కూడా జగన్‌రెడ్డి ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్ర ప్రజల జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో కరువు అన్నదే లేకుండా చేయాలన్న  తన కలను కల్లలు చేసేలా జగన్‌రెడ్డి  వ్యహరించిన తీరుపై  చంద్రబాబులో బాధ, ఆవేదన, కోపం అన్నీ ఒక్కసారిగా కనిపించాయి. ‘‘పోలవరం పరిస్థితి చూస్తుంటే బాధ, ఆవేదన, కోపం పెల్లుబుకుతోంది. కానీ వీటన్నింటనీ నిగ్రహించుకొని ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది’’ అని  ఆయన అన్నారు.   సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగన్‌రెడ్డిది క్షమించరాని నేరం
పోలవరం ప్రాజెక్ట్‌ ఆది నుండి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. తాను 2014లో ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెలంగాణలో ఉన్న ముంపు మండలాలు ఏడిరటినీ ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని పట్టుబట్టి సాధించామని, ఆనాడు అది జరగబట్టే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేయగలుగుతున్నామని చెప్పారు. పోలవరం కోసం తాను పగలు, రేయి శ్రమించానని, పండుగ రోజు కూడా నాగపూర్‌ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ప్రాజెక్ట్‌ పనులు వేగంగా జరిగేలా కృషి చేశానని గుర్తు చేశారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణకు కూడా కొంతమంది సమస్యలు సృష్టిస్తే, వారితో ప్రత్యేకంగా మాట్లాడి నచ్చచెప్పి, వారికి మంచి పునరావాస ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్ట్‌ పనులు ఆగకుండా చర్యలు తీసుకున్నానని చెప్పారు.
కానీ ప్రభుత్వం మారగానే అధికారం చేపట్టిన రోజునే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని,  కాంట్రాక్టర్‌ను మారుస్తామని ప్రకటించారని, నాలుగు రోజులకే కాంట్రాక్టర్‌ను పంపించి వేశారని చెప్పారు. అంతేకాకుండా అక్కడ పని చేస్తున్న అధికారులందర్నీ కూడా బదిలీ చేశారని, ఏమీ తెలియని అధికారులను అక్కడ నియమించారని చెప్పారు. కీలకమైన పనులు చేపట్టాల్సి ఉన్నందున కాంట్రాక్టర్‌ను మార్చవద్దని, కొత్త కాంట్రాక్టర్‌ వస్తే ఎవర్నీ బాధ్యుల్నీ చేయాలో అర్ధంకాని పరిస్థితి అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ వినకుండా మూర్ఖంగా ప్రవర్తించారని చెప్పారు. దాని ఫలితంగానే 2019`20 ఏడాదిలో గోదావరికి వచ్చిన రెండు వరదల్లో ప్రాజెక్ట్‌  కొట్టుకుపోయిందని చెప్పారు. కానీ దాని వల్ల జరిగిన నష్టాన్ని కనుక్కోవడానికి కూడా సంవత్సరం సమయం పట్టిందని చెప్పారు.
2019 సీజన్‌ పూర్తయ్యేలోపు కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయడానికి మిగిలి పోయిన పనులు చేయాల్సి ఉందని, కానీ కాంట్రాక్టర్‌ను, అధికారులను మార్చడంతో ఆ పనులు పూర్తి చేయలేకపోవడంతో ప్రాజెక్ట్‌ కొట్టుకుపోయిందని చెప్పారు. కాంట్రాక్టర్‌ను మార్చకుండా ఉండిఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్ట్‌ పూర్తయ్యేదని, కానీ జగన్‌ రెడ్డి తన మూర్ఖపు చర్యలతో రాష్ట్ర ప్రజలకు, పోలవరానికి శాపంలా మారాడని అన్నారు. పోలవరం విషయంలో జగన్‌రెడ్డి క్షమించరాని నేరం చేశారని అన్నారు. సాగునీటి రంగం ప్రాధాన్యతను గుర్తించి తాము ఏడాదికి సగటున 13,683 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి నిధులు అధికంగా ఉన్నప్పటికీ ఏడాదికి సగటున 7,100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని, అవీ కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు ఇవ్వడానికే ఉపయోగించారు కానీ పనులు చేయడానికి కాదని చంద్రబాబు తెలిపారు.
ప్రజా ధనం వృధా
జగన్‌రెడ్డి చేసిన నిర్వాకం కారణంగా డయాఫ్రమ్‌ వాల్‌ నాలుగు చోట్ల తెగిపోయిందని, 35 శాతం డ్యామేజ్‌ అయిందని చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో యుద్ద ప్రాతిపదికన రెండు సీజన్లలో 446 కోట్ల రూపాయల ఖర్చుతో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించినట్లు చెప్పారు. ఇప్పుడు మరమ్మత్తుల కోసం తెగిన ప్రాంతం వరకు సమాంతర గోడ కట్టడానికే 447 కోట్ల రూపాయలు అవుతుందని, అయినప్పటికీ డయాఫ్రమ్‌ వాల్‌ భద్రంగా ఉంటుందన్న గ్యారంటీ లేదంటున్నారని చెప్పారు. అలా కాకుండా మొత్తం గోడ కట్టడానికి 990 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు తనకు చెప్పినట్లు  తెలిపారు. అదే విధంగా ఎగువున, దిగువున ఉన్న కాఫర్‌ డ్యామ్‌ కూడా దెబ్బతిందని, తమ ప్రభుత్వ హయంలో ఈ రెండిరటినీ 550 కోట్ల రూపాయలతో నిర్మించామని, అయితే వీటి మరమ్మత్తులకు రెండు వేల కోట్ల రూపాయలు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో చెప్పలేని పరిస్థితి అని  అన్నారు. ఇవి పూర్తవ్వడానికి మరో నాలుగు సీజన్లు పడుతుందని, అంటే మరో నాలుగేళ్ల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారని తెలిపారు. జగన్‌రెడ్డి మూర్ఖపు చర్యలు వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, విలువైన సమయం హరించుకుపోయిందని చెప్పారు. 2020 చివరి నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్‌ భవిష్యుత్తుతో జగన్‌రెడ్డి ఆడుకున్నాడని, ఇప్పుడు పదేళ్ల సమయం అదనంగా తీసుకుంటుందని, ప్రాజెక్ట్‌ ఖర్చు కూడా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్‌ రెడ్డి మూర్ఖత్వంపై ప్రజల్లో చర్చ జరగాలి
పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఈ దుస్థితి కల్పించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అన్నారు. ప్రజలు వేసిన శిక్ష వారికి సరిపోదన్నారు. జగన్‌రెడ్డి అనుభవం లేకనే ఈ విధంగా ప్రాజెక్ట్‌ను నాశనం చేశారా అని ఒక విలేకరి ప్రశ్నించగా అనుభవం లేకపోవడం కాదు మూర్ఖత్వం అని చంద్రబాబు చెప్పారు. తనకు ఏమీ తెలియకున్నా ఇష్టానుసారంగా వ్యవహరించినా సరిపోతుందనే ప్రవర్తన కారణంగానే ఈ  పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి జగన్‌ కాదని, అటువంటి వ్యక్తికి అధికారం ఇస్తే ఏమౌతుందో అనే దానికి పోలవరం ఒక కేస్‌ స్టడీ అని అన్నారు. జగన్‌రెడ్డి మూర్ఖపు చర్యలు రాష్ట్రానికి శాపంగా మారాయని, అందులో పోలవరం ఒకటని, వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం  ఉందని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు అధికారుల నుండి తాను ప్రాధమికంగా సమాచారం తీసుకున్నానని, తాను ఇంకా పూర్తిగా అధ్యయం చేసి మరలా  వివరణాత్మకంగా మాట్లాడతానని చెప్పారు. కేంద్రంలోనూ జనవనరుల శాఖకు కొత్త మంత్రి వచ్చారని, ప్రస్తుత పోలవరం పరిస్థితిపై కేంద్ర పెద్దలు, అధికారులతో చర్చించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబుతోపాటు విలేకరుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామనాయుడు, రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖా మంత్రి కె.పార్దసారధి పాల్గొన్నారు.
Previous Post

టీటీడీ నిధుల్ని దోచుకున్నారు..తప్పించుకోలేరు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

November 23, 2026
పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు
ఆంధ్రప్రదేశ్

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

November 23, 2026
కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం
ఆంధ్రప్రదేశ్

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

November 23, 2026
కూటమి అభ్యర్థులను గెలిపించండి
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి

November 23, 2026
దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్

దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు

November 23, 2026
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ
ఆంధ్రప్రదేశ్

ఆళ్ళగడ్డ, మైదుకూరులో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు

November 23, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 18-06-2024

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2024

ముఖ్య వార్తలు

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

by చైతన్యరధం
November 22, 2026

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

by కార్యకర్త
November 23, 2026

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

by చైతన్యరధం
November 23, 2026

రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

by చైతన్యరధం
November 23, 2026

గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...

కూటమి అభ్యర్థులను గెలిపించండి

కూటమి అభ్యర్థులను గెలిపించండి

by చైతన్యరధం
November 23, 2026

తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.