చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేర్ని నానీ.. నీ పాపం పండిరది, ఇక వదిలేది లేదు

తప్పు చేసినోడిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర

by చైతన్యరధం
Jun 14, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పేర్ని నానీ.. నీ పాపం పండిరది, ఇక వదిలేది లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లు ప్రజల్ని పీక్కుతిని నేడు పిచ్చి ప్రేలాపనలా?
  • 2023లో బదిలీ అయిన తహశీల్దార్‌ 2024లో పట్టాలెలా ఇచ్చారు?
  • పేదలపై ప్రేముంటే 6400 టిడ్కో ఇళ్లు ఎందుకు పాడుబెట్టావ్‌.?
  • సీఆర్‌జెడ్‌ భూముల్లో పట్టాలివ్వడాన్ని కోర్టులే తప్పుబట్టాయి
  • 2006లో బందరు పోర్టుని అమ్మేసేందుకు ప్రయత్నించిన నీచుడు పేర్ని నాని
  • సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లింది
  • తప్పు చేసినోడిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం (చైతన్యరథం): అరాచకాలు, అకృత్యాలకు పాల్పడి.. కేసుల భయంతో వణుకుతున్న వైసీపీ నేత పేర్ని నానికి మతి భ్రమించినట్లుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. పేర్ని నాని విచిత్ర వైఖరిపై ధ్వజమెత్తారు. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని విమర్శించారు. అరాచకాలకు పాల్పడి, ప్రజల్ని మభ్యబెట్టి బతికిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఐదేళ్లు ప్రజల్ని పీక్కుతిని.. నేడు బుద్ధిమంతుడిలా మాట్లాడటం సిగ్గుచేటు. తప్పు చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల్లో వారసుడిని గెలిపించుకోవాలనే తాపత్రయంతో చేయరాని తప్పులు చేశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు దొంగ పట్టాలు సృష్టించి తహశీల్దార్‌ కార్యాలయంలో అర్ధరాత్రి రాయిస్తుంటే మేం పట్టుకున్నాం. జేసీకి అడ్డంగా దొరికిపోయారు. మేమంతా వెళ్లడంతో వైసీపీ నాయకులు ఆ పట్టాల కట్టలు పట్టుకుని పారిపోయారు. తప్పు చేయకుంటే పారిపోవాల్సిన అవసరం ఏంటి? రహదారి భూమిలో పట్టాలిస్తే తప్పేంటని ప్రశ్నించడానికి సిగ్గుండాలి. ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలివ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగా లబ్ధిపొందడం కోసం దొంగపట్టాలిస్తే వాటిపై విచారణ చేయిస్తుంటే వణికిపోతున్నాడు. తండ్రీకొడుకులిద్దరూ పారిపోయారు. తహశీల్దార్‌ సునీల్‌ జూన్‌ 2023నే బాపులపాడు మండలానికి బదిలీపై వెళ్తే.. 2024 మార్చిలో ఆయన సంతకంతో పట్టాలు సృష్టించారు. ఏడాది క్రితమే వెళ్లిపోయిన వ్యక్తి ఎన్నికల కోడ్‌ వచ్చే నాటికి ఇక్కడే ఉన్నాడని బుకాయించేందుకు ప్రయత్నించడానికి సిగ్గుండాలి. ఇలాంటి అక్రమాలకు పాల్పడినందునే ప్రజలు దారుణంగా ఓడిరచారు. ఎన్నికల సమయంలో తహశీల్దార్‌ సునీల్‌ అనపర్తిలో ఎన్నికల డ్యూటీలో ఉంటే బందరులో ఉన్నారని చెప్పడం పేర్నినాని అబద్ధాలకు పరాకాష్ట అని మంత్రి రవీంద్ర దుయ్యబట్టారు.

తప్పు చేయలేదని చెప్పే దైర్యం ఉందా..
పేదల బియ్యాన్ని పందికొక్కులా పేర్ని బొక్కి తినడం వాస్తవం కాదా? పేర్నికి చెందిన గోదాములో 8000 బియ్యం బస్తాలు మాయమవ్వడం వాస్తవం కాదా? గోదాము ఎవరి పేరుతో ఉంటే వారిని విచారిస్తారని తెలియదా? నిజంగా భార్యపై అంత ప్రేమ ఉంటే పేదల బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకునేవాడివి కాదు. గోదాము నుండి కాకినాడ వరకు వెళ్లిన ప్రతి లారీ వివరాలు రికార్డెడ్‌గా ఉన్నాగానీ బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేపర్లో వార్త రాగానే కోర్టుకు వెళ్లావు. పేపర్లో వార్త రాగానే కోర్టుకు రావడమేంటని అక్కడ గడ్డి పెడితే వెనక్కి వచ్చావు. అయినా సిగ్గురాలేదా? ప్రెస్‌ మీట్‌ పెట్టి అడ్డగోలుగా వాగితే హీరో అయిపోతానని భావిస్తున్నావేమో.. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను బఫూన్‌లా చూస్తున్నారని తెలుసుకో. ఇలాంటిడోని గెలిపించుకున్నామా అని బందరు ప్రజలు ఈసడిరచుకుంటున్నారు. రూ.1.70 కోట్లు చెల్లించానని చెబుతున్నావంటే తప్పు చేసినట్లే కదా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? పేదల సొమ్ము దొబ్బితిన్న వారికి ప్రజాక్షేత్రంలో ఉండే అర్హత ఉందా? ఇప్పటి వరకు చూసీ చూడనట్లు వదిలేశాం. ఇకపై వదిలే ప్రశక్తే లేదని పేర్ని నాని గుర్తుంచుకోవాలి. ఎక్కడో జరిగిన కేసుల గురించి మాట్లాడే పేర్ని నానికి.. తాను తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి రవీంద్ర సవాల్‌ విసిరారు.

సంబంధితవార్తలు

మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది.

People of AP, it’s kinda chic to have a CM who treats working 24×7 for the state as the bare minimum

పట్టాల గురించి మాట్లాడే అర్హత లేదు
పేదల ఇళ్లపై నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే.. 6400 టిడ్కో ఇళ్లు పేదలకు ఎందుకు పంచలేదు.? శాంక్షన్‌ లెటర్‌ ఇచ్చిన వారికి కూడా ఇళ్లు పంచకపోవడం పేర్ని నాని దుర్మార్గానికి నిదర్శనం. కపట నాటకాలు చెప్పడం తప్ప ప్రజల గురించి ఏ కోశానా ప్రేమ లేదు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు భూములు కొనుగోలు చేయించి కమీషన్లు దండుకున్నారు. కరఅగ్రహారం వద్ద భూసేకరణ పేరుతో డబ్బులు దండుకున్నారు. శ్మశానం భూములు, పోరంబోకు భూములు సహా అన్ని భూముల్లో కూడా ఎకరాకు సగటున రూ.10 లక్షల చొప్పున కమీషన్‌ వసూలు చేసుకున్నారు. మెడికల్‌ కాలేజీ కోసం భూ కొనుగోలులో రూ.8 కోట్ల అక్రమాలు జరిగాయని కాగ్‌ నివేదికలో పేర్కొంది. అక్రమాలన్నీ బయటపడతుండడంతో అరెస్టు చేయండి అంటూ సానుభూతి డ్రామాకు తెరలేపారు. గిలకలదిండి భూములపై కోర్టులో కేసులు వేశారంటున్న పేర్ని నానిని ప్రశ్నిస్తున్నా. పేదలకు భూములు కొనుగోలు చేసి అందించండి. అంతేగానీ సీఆర్జెడ్‌ పరిధిలో భూములిస్తే వారికి పట్టాలు రావని తెలిసీ ఇవ్వడం మోసం చేయడం కాదా? అవి సీఆర్జెడ్‌ భూములని కోర్టు పేర్కొనడం, కలెక్టర్‌ కూడా అవి సీఆర్జెడ్‌ భూములని నిర్ధారించడం నిజం కాదా? బందరు కోట వద్ద గతంలో ఇచ్చిన భూములకు ఇప్పటికీ పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితి ప్రజలకు రాకూడదని చెప్పడం తప్పా? కమీషన్లు దండుకోవడం కోసం ప్రజలతో ఆటలాడతామంటే చూస్తూ ఊరుకోం. కుమ్మరిగూడెంలో ప్రజలందరినీ మోసం చేసి ఉద్దరించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఐదో వార్డు స్ట్రీట్‌ ఫీల్డ్‌లో లేని సర్వే నెంబర్లు సృష్టించి పట్టాలిచ్చారు. వాటి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. స్ట్రీట్‌ ఫీల్డ్‌లో ఎవరికైనా పట్టాలొస్తాయా? బెరకా మందిర్‌, కొండపల్లి భవనాలపై కక్ష సాధించడమే లక్ష్యంగా కొట్టించేశావ్‌. లేని సర్వే నెంబర్లతో పట్టాలిచ్చి ప్రజల్ని మోసం చేసినోళ్లకు పట్టాల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదని మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బందరు పోర్టు పూర్తి చేసి చూపిస్తాం
బందరు పోర్టును తానే తెచ్చానంటున్న పేర్ని నానిని సూటిగా ప్రశ్నిస్తున్నా.. 2006లో బందరు పోర్టుని అమ్మకానికి పెట్టింది నీవు కాదా? పోర్టును గోగినేని వారికి అమ్యేందుకు నాకేం అభ్యంతరం లేదని సంతకాలు పెట్టడం నిజం కాదా? బందరు ప్రజలంతా పోరాడి తిరిగి సాధించుకున్నాం. 2006లో మా ఉద్యమ ఫలితంగానే పోర్టు ఇక్కడ నిలిచింది. పోర్టు తేకుంటే ముక్కు నేలకు రాస్తానని మాట మార్చావు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చాక ల్యాండ్‌ పూలింగ్‌, ల్యాండ్‌ అక్విజిషన్‌, ల్యాండ్‌ పర్చేజింగ్‌ ద్వారా ఎకరాకు రూ.25 లక్షల నుండి రూ.40 లక్షలు చెల్లించి భూములు సేకరించాం. ముడా ఆధ్వర్యంలో పనులు చేస్తుంటే.. భూములివ్వొద్దని జగన్‌ రెడ్డితో ధర్నాలు చేయించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా బందరు పోర్టులో తీయకుండా నాశనం చేస్తే.. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ పనులు మొదలు పెట్టాం. ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో కేంద్రం నుండి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణం తీసుకొచ్చి పనులు ప్రారంభించి పూర్తి చేస్తున్నాం. గత ఏడాది కాలంగా పనుల్ని పరుగులు పెట్టించాం. 2026 జూన్‌ నాటికి పనులు పూర్తి చేస్తామని మాటిచ్చాం. పూర్తి చేసి చూపిస్తాం. బందరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపుమంటతో విమర్శలకు తెరలేపారని మంత్రి రవీంద్ర మండిపడ్డారు.

అధికారుల్ని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడడం హేయం. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులపై నిందలేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? పేర్ని నాని అరాచకాలను చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అసత్య ఆరోపణలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. బియ్యం అక్రమాలపై విచారించాలని కోర్టు ఆదేశిస్తే.. విచారణకు పిలిచిన పోలీసు అధికారులను తప్పుబడతారా? చట్ట ప్రకారం నడచుకుంటున్నాం కాబట్టే ఇంత అరాచకాలకు పాల్పడి కూడా మీరు రోడ్లపై ప్రశాంతంగా తిరుగుతున్నారు. మీలా మేము చట్టాన్ని అతిక్రమిస్తే మీ పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమేనని మంత్రి రవీంద్ర హెచ్చరించారు.
అభివృద్ధి చేస్తుంటే బురదజల్లుతారా

గత ఐదేళ్లు బందరు అభివృద్ధిని పట్టించుకోవడం మానేస్తే.. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మించాం. మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం. బందరుని దశాబ్దాలుగా వేధిస్తున్న చెత్త సమస్యకు శాశ్వ పరిష్కారం చూపించాం. మురుగు నీటి నుండి బందరును కాపాడుతున్నాం. ఇన్ని రకాలైన అభివృద్ధి పనులు చేస్తుంటే.. చూసి ఓర్వలేకపోవడానికి సిగ్గుపడాలి. మున్సిపాలిటీకి రూ.40 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. తీర్మానం చేయనీయకుండా అడ్డుకుంటున్నది, బడ్జెట్‌ ఆమోదానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. మీ పాపాలన్నీ శాపాలు కాబోతున్నాయి. రాబోయే కాలంలో మున్సిపాలిటీని వైసీపీ నుండి విముక్తి చేస్తామని మంత్రి రవీంద్ర సవాల్‌ విసిరారు.
ఐదేళ్లు ఇసుకను పందికొక్కుల్లా దోచుకున్న మీరు.. నేడు పారదర్శకంగా రీచులు కేటాయిస్తే ఇసుకలో ఏదో జరిగిపోతోందని ఆరోపించడానికి సిగ్గుండాలి. గతంలో ఇసుక ఎంతుంది? ఇప్పుడు ఎంతుందో పేర్ని నాని సమాధానం చెప్పాలి. ముడా భూముల్లో ఎక్కడ ఎవరు ఎంత తవ్వారో సాంకేతిక ఆధారాలు తెప్పిస్తా. చర్చకు సిద్ధమా. బందరులో డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగిస్తుంటే.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మురుగు కాల్వల్లో కనీస చెత్త కూడా తొలగించని పేర్ని.. ఇప్పుడు అక్కడేదో జరిగిపోయిందని ఆరోపించడానికి సిగ్గుపడాలి. బందరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అని మేము తాపత్రయపడుతుంటే.. బురద వేయాలనుకోవడం పేర్ని నాని విజ్ఞతకే దిలేస్తున్నాం. డిగ్రీలు చదువుకున్న యువతకు ఉద్యోగాల్లేక కూలి పనులు చేసుకునేలా మీరు తయారు చేస్తే.. వారికి లక్షల రూపాయల వేతనాల ఉద్యోగాలొచ్చేలా మేము ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు.

మసులా బీచ్‌ ఫెస్టివల్‌పై విమర్శలా
దేశంలో ఎక్కడా లేని విధంగా మంగినపూడి బీచ్‌లో మసులా బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తే.. అక్కడేముందని వెకిలి మాటలు మాట్లాడటం వారి నీచ బుద్ధికి నిదర్శనం. పర్యాటకంగా, క్రీడా పరంగా ఆ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. గతంలో కోట్ల వ్యయంతో పనులు చేస్తే.. మీరు గాలికి వదిలేశారు. మేము బందరుకి పూర్వ వైభవం కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంటే.. ఎందుకంత కడుపు మంట? బందరులో జరిగిన మంచి కార్యక్రమాన్ని కూడా మెచ్చుకోలేని కుటిల మనస్తత్వానికి పేర్ని నాని వ్యాఖ్యలు నిదర్శనం. ఎవరు ఏమన్నా గానీ, బందరు పోర్టుని పూర్తి చేస్తాం. మచిలీపట్నం టూరిజం కేంద్రంగా మంగినపూడి బీచ్‌ను తీర్చిదిద్దుతాం. 7000 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుస్తాం. ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా యువతకు శిక్షణ అందించేలా కేంద్రాలు ఏఱ్పాటు చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి జాబ్‌ మేళా నిర్వహిస్తాం. ఎంఎస్‌ఎంఈలకు ముందుకు వచ్చే యువతకు ప్రోత్సహిస్తాం. సుందర నగరంగా మచిలీపట్నాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి రవీంద్ర ఉద్ఘాటించారు.

వెంటాడుతున్న పాపాలు
చేసిన పాపాలు వెంటాడుతుండడంతోనే పేర్ని నాని నిద్రల్లేని రాత్రులు గడుపుతున్నాడు. దొంగపట్టాలు, బియ్యం దొంగతనం వంటి పాపాలు పేర్ని నానిని వదలవు. బినామీల పేర్లతో, అత్తమామల పేరుతో, అనుయాయుల పేరుతో భూములు బదలాయించుకున్నారు. ఎక్కడ ఎంత దోచుకున్నావో ప్రతి లెక్కా బయటకు రాబోతోంది. బందరు ప్రతిష్టను ప్రపంచ పటంపై చూపించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. బందరు పోర్టు పూర్తి చేయడం, ఇన్లాండ్‌ వాటర్‌ వేస్‌ ద్వారా అమరావతికి అనుసంధానించడం, మెడికల్‌ కాలేజీ సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా కష్టమే. అధికారంలో ఉన్నంత కాలం దోచుకోవడం తప్ప పేర్ని నాని నియోజకవర్గానికి గానీ, జిల్లాకు గానీ చేసిందేమీ లేదు. ఇంత వయసొచ్చినా ఇంకా నిందారోపణలు చేసి తప్పించుకుంటామంటే కాలం వదిలి పెట్టదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2025

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2025

మరిన్ని వార్తలు

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ August 27, 2026
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం
ఆంధ్రప్రదేశ్

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’
ఆంధ్రప్రదేశ్

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-08-2026

కార్యకర్త
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..
ఆంధ్రప్రదేశ్

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మత్స్యకారుల ఆచూకీ లభ్యత
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల ఆచూకీ లభ్యత

చైతన్యరధం
@ August 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

కార్యకర్త
@ August 26, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ August 27, 2026
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist