ప్రతి దళిత కుటుంబం ఇంటి తలుపు తట్టాలి.
జగన్ దళిత ద్రోహంపై తెలియచెప్పాలి
టిడిపి పై భరోసా కల్పించాలి
ఎస్సీ లకోసం ప్రత్యేకంగా ఒక్క బటన్ అయినా నొక్కాడా?
దళితనేతల సమావేశంలో చంద్రబాబు
“ఎవరూ ఆచరణలో చేయనిదాన్ని అమలుచేసి పేదరిక నిర్మూలన చేయాలి. ప్రతికుటుంబంతో నేరుగా మాట్లాడేలా ఒక నూతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాం” అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన దళితనేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మనం దళితులకు ఒకప్పుడు ఏంచేశాము. ఇప్పుడున్నవారు ఏంచేస్తున్నారు. మనం భవిష్యత్ లో ఏంచేయబోతున్నామో దళితవాడల్లో ప్రతి దళిత కుటుంబం ఇంటి తలుపు తట్టండి. ప్రతి దళితుడి గుండెల్లో జగన్ దళితద్రోహి అని నాటుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు జరిగిన దారుణాలు మచ్చుకుమాత్రమే.
భవిష్యత్ లో ఇంకా హృదయవిదారకమైనవి చూడాల్సి వస్తుందన్నారు. ఇప్పటివరకు చేసింది ఒకెత్తు. ఇకముందు చేయాల్సింది ఎంతోఉంది. సమాజానికి మనం న్యాయం చేయాలంటే, ప్రజల్ని మనవైపుచూసేలా, వారు మనపట్ల ఆకర్షితులు అయ్యేలా చూడాల్సింది మీరే. తప్పులు చెప్పడంకాదు. ఇప్పుడున్నవారు చేసిన తప్పులు చెప్పండి. భవిష్యత్ లో మనం ఆదుకుంటామని భరోసా కల్పించండి అని సూచించారు. ఎంతపెద్ద నాయకుడైనా ప్రజల్లో ఉంటేనే గౌరవం. మీమీ పరిధిలో ప్రజలతో మమేకమై తేనే మీరు మంచి నాయకులు అవుతారని గుర్తుంచుకోండి. అంతిమంగా దళితుల ఓట్లు మనపార్టీకే పడాలి. పడేలాచేయండి. ముందు గడపగడపకు అన్నాడు. ప్రజలు ఛీకొట్టారు. ఇప్పుడేమో స్టిక్కర్లు వేయమంటున్నాడు. ఆ స్టిక్కర్ పై ఉన్నఫోటో ఉండాల్సింది ప్రజల ఇంటిగోడలపై కాదు, పోలీస్ స్టేషన్లో అని విమర్శించారు. ఒకవ్యక్తి బాబాయ్ ని చంపి, ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టి ట్విస్టులమీద ట్విస్టులు పెడుతూ, ప్రపంచంలో ఏసినిమాలో లేని విధంగా మలుపులుతిప్పాడు.
మొన్న యర్రగొండపాలెంలో దళితుల్ని బలిచేసి, మనపై కుట్రచేయాలని ప్లాన్ చేశాడు. ఎంత కరుడుగట్టిన నేరస్తుడు ఇతను. రేపు తనింట్లో ఏదో ఒకటి చేసి, అదికూడా మనమే చేశామని చెప్పేంతటి ఘనుడు. బాబాయ్ ని చంపేశాడు. కన్నతల్లిని, చెల్లిని రోడ్లపాలు చేశాడు. యుగానికి ఒక యుగపురుషుడు పుట్టినట్టే, యుగానికి ఒక రాక్షసుడు పుడతాడు అనడానికి ఇతనే రుజువు. నాకు అనిపిస్తోంది రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే ఈదుర్మార్గుడు పుట్టాడేమో అనిపిస్తోంది అని ధ్వజమెత్తారు. ఇలాంటివన్నీ ప్రజలకు అర్థమయ్యేలా, వారుచర్చించేలా చేయండి. దళితులకు ఏం చేశాడని నిలదీయండి. ఒక్కపిల్లాడిని అయినా చదివించాడా? ఎస్సీలకోసం ప్రత్యేకం గా ఒక్క బటన్ అయినా నొక్కాడా? అమ్మఒడి, ఆసరా పథకాలు అందరికీ ఇచ్చినట్టే, దళితులకు ఇస్తున్నాడు. ఎస్సీలకోసం విదేశీవిద్య అమలు చేశాడా? 4ఏళ్లలో ఒక్క విభిన్న ప్రతిభావంతుడికైనా చిన్న ట్రైసైకిల్ ఇచ్చాడా? ఇతను నవరత్నాలతో సంక్షేమం చేస్తున్నాడంటా? 10రూపాయలిచ్చి 100రూపాయలు దోచేయడం సంక్షేమమా? అని ప్రశ్నించారు.
యర్రగొండపాలెం వెళితే, ఎస్సీ మంత్రి బట్టలు విప్పడం ఏమిటి? అతను చేసే పనుల్ని పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. నాపై రాళ్లు వేయిస్తే నాకు ఏమవుతుంది? ఎన్.ఎస్.జీ కమెండో సంతోష్ కుమార్ కు గాయాలయ్యాయి. నాపై రాళ్లేస్తే ఎన్.ఎస్.జీ కమెండోలు కాల్పులు జరిపి, దళితులుచనిపోతే చంద్రబాబు దళితుల్ని చంపాడని విషప్రచారం చేయాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి అసలు మనిషా? మనిషిలా
ప్రవర్తిస్తున్నాడా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. యర్రగొండపాలెంలో నేనేదో అన్నానంటున్నాడు. ఏమన్నానో చెప్పమంటే చెప్పరు.
ఒకప్పుడు వ్యవసాయం దండగని చెప్పానని ప్రచారంచేశారు. ఆరోజు నేనుచెప్పింది అందరూ వ్యవసాయంపై ఆధారపడితే శాశ్వతంగా పేదరికంలో ఉండాల్సి వస్తుందని చెప్పాను. ఇద్దరు పిల్లలుంటే ఒకర్నిచదివించి, మరొకర్ని వ్యవసాయంలో పెట్టుకోండి అనిచెప్పాను. నాతండ్రిరైతు. నన్నుకూడా వ్యవసాయం చేయమంటే మహా అయితే 10 ఎకరాలు కొనేవాడిని. అలాకాకుండా రైతులు, రైతుకూలీల పిల్లలు నేడు విదేశాల్లో ఉండి లక్షలుసంపాదిస్తున్నారు అంటే ఎలా సాధ్యమైందన్నారు. ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం బాగాలేకున్నాకూడా పేదరికం నిర్మూలనకోసం విద్యను, ఐటీరంగాన్ని ప్రోత్సహించాను. అలానే ఉమ్మడిరాష్ట్రంలో ఎస్సీలకోసం తొలిసారి ముందడుగు పథకం తీసుకొచ్చాను. ఎస్టీలకోసం చైతన్యం, బీసీలకోసం ఆదరణ, మైనారిటీలకోసం రోషిణి, పథకాలు తీసుకొచ్చాను.
ఉద్యమకార్యాచరణ అమలుచేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా పైకితీసుకొచ్చాను. ఆ సమయంలో ఎస్సీల్లో పేదరికం ఎక్కువ ఉంది. పేదలుగా పుట్టాలని ఎవరూ అనుకోరు అంటే, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని వక్రీకరించారు. లోకేష్ మాటల్ని వక్రీకరించి ఎస్సీలను తిట్టినట్టుగా మార్చి, విషప్రచారం చేశారు. ఇవన్నీ దళిత వాడల్లో చెప్పి, ఈ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని గడపగడపకు తెలియచేయాలని పులుపునిచ్చారు.
చైతన్యవంతులు కావాలి
తప్పుడుసమాచారంతో ప్రజల్ని మోసగిస్తున్న జగన్ లాంటి పాలకుల్ని అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలి. దానికోసం బలమైన కేడర్ తయారుచేసుకోవాలి. రాజ కీయం అనేది ఏకొద్దిమందితోనో చేసేదికాదు. అందరి భాగస్వామ్యం, అందరి ఆశీర్వాదం ఉంటేనే మనుగడ సాధించగలం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశంపార్టీ 42వసంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్ లకు మన పార్టీ చేసిన పనులు ఎవరూ చేయలేదు. భవిష్యత్ లో చేయలేరుకూడా. వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయాము అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి వ్యక్తికూడా మన ఆలోచనలకు ప్రభావితమైతేనే మీరు,నేను విజయం సాధించినట్టు. ఎన్టీఆర్ ఇళ్లనిర్మాణంలో ఎస్సీ ఎస్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు.
తొలిసారి ఎస్సీలకోసం గురుకులపాఠశాలలు పెట్టింది తెలుగుదేశంపార్టీనే.మానవవనరుల అభివృద్ధి కిందితరగతుల్లో రావాలనే, విద్య, వైద్యం వంటివాటికి ఇచ్చాము అని చెప్పారు. అంటరానితనం నిర్మూలన కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, ఆ కమిషన్ ఇచ్చిన 42రికమండేషన్స్ అమలుచేసి, దళితులు స్వేఛ్చ, సమానత్వాలతో సమాజంలో గౌరవంగా బతికేలాచేశాను. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెట్టి, కఠినశిక్షలు అమలుచేయించాను. ఎస్సీఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్లు, కార్పొరేషన్లు ఏర్పాటుచేసింది తెలుగుదేశమే. రాజశేఖర్ రెడ్డి వచ్చాక కార్పొరేషన్లను నిర్వీర్యంచేశాడు. కేంద్రప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలకు రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదు. ఇప్పుడున్నవారు 4ఏళ్లనుంచి ఎస్సీకార్పొరేషన్లకు రూపాయి ఖర్చుపెట్టలేదు. ఎస్సీ సబ్ ప్లాన్ కు రూపాయి కేటాయించలేదు. అమ్మఒడి నాన్నబుడ్డిగా మారింది. ఈ ప్రభుత్వం దళితులకోసం ప్రత్యేకంగా ఒక్కకార్యక్రమం అమలుచేసింది లేదు అని చంద్రబాబు వివరించారు.
టీడీపీప్రభుత్వం దళితుకోసం 28ప్రత్యేక పథకాలు అమలుచేసింది. వాటి అమలు పర్ ఫెక్ట్ గా జరిగేలా చూశాం. దళితవాడల్లో సిమెంట్ రోడ్లు, కాలువలనిర్మాణం, తాగునీటి వసతికి అధికప్రాథాన్యత ఇచ్చాను. నాయకులందరూ ఎస్సీకాలనీల్లో పర్యటించాలని చెప్పి దగ్గరుండి పనులు చేయించేలా చూశాను. ఎస్సీకాలనీల్లో 6వేలకిలోమీటర్ల సి మెంట్ రోడ్లువేసింది టీడీపీ ప్రభుత్వమే. అన్నిఇళ్లకు 100యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చాం. అలానే కాలనీల్లో మరుగుదొడ్లు నిర్మించాము. ఇలా మనంచేసినవి. అతను తీసేసినవి చూస్తే చాలా ఉన్నాయి. వీటిపై అవతలివారికి సవాల్ విసిరితే ఇక మాట్లాడలేరు అని చెప్పారు. తొలిసారి 2001లో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, 42 రికమండేషన్స్ అమలుచేసింది తెలుగుదేశమే. దాని అమలుకోసం 18 జీవోలు ఇచ్చాము. జీవోనెం-105 (అంటరా నితనం, దళితులపై అత్యాచారనిరోధానికి), జీవోనెం-107 (అత్యాచారాలు జరిగే అవకాశం ఉన్నప్రాంతాల్లో జిల్లా మానిటరింగ్ సెల్ పర్యవేక్షణ), జీవో-108 (అత్యా చారం జరిగే అవకాశం ఉన్నప్రాంతాల్ని కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికా రులు పరిశీలించడం), జీవో-110 (నేరస్తుల్ని శిక్షించేందుకు 10సంవత్సరాల అనుభవం ఉన్నన్యాయమూర్తులతో ప్రత్యేకన్యాయస్థానాల ఏర్పాటు, 22 మొబైల్, 22 స్పెషల్ కోర్టుల ఏర్పాటు), జీవో-117 (అత్యాచార బాధితులకు నష్టపరిహారం) అని వివరించారు.
ఎస్సీ రిజర్వేషన్ లు పెంపు
ఎస్సీ రిజర్వేషన్లను 14శాతంనుంచి జనాభాదామాషాప్రకారం పెంచినట్టు చంద్రబాబు చెప్పారు. ఎస్టీలకు 4 నుంచి 6శాతానికి పెంచాము. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు పట్టు బట్టి, చొరవచూపి మహానుభావుడు అంబేద్కర్ గారికి భారతరత్నవచ్చేలా చేశారు. ఈ విధంగా పథకాలు, సంక్షేమమే కాకుండా ఎస్సీలను వ్యక్తిగతంగా ప్రోత్సహించాము . బాలయోగిని తొలిసారి లోక్ సభ స్పీకర్ ని చేశాము. కే.ఆర్.నారాయణన్ ను రాష్ట్రప తిగా ఎంపికచేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించింది. మహేంద్రనాథ్ ను రాష్ట్ర తొలి ఆర్థికమంత్రిగా నియమించాము. కాకిమాధవరావుని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని చేశాము. ఆయనే తొలిసారి..ఆయనే ఆఖరిసారి. ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్ ని చేశాము.
ఉద్యోగాలకే పరిమితమైన రిజర్వేషన్లను తాను ముఖ్యమంత్రి అయ్యాకే ప్రమోషన్లకు కూడా వర్తింపచేశాను. దళితులకు భద్రతతోకూడిన ఆస్తి ఉండాలని భూమికొనుగోలు పథకం తీసుకొచ్చి, భూములుకొని దళితులకు ఇచ్చింది దేశంలో ఒక్కతెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. అంబేద్కర్ విదేశీవిద్య పథకంఅమలుచేసి 440మంది దళితయువతీ యువకుల్ని విదేశాలకు పంపించాము. నేను అంబేద్కర్ పేరుపెడితే, అదితీసేసి జగనన్న అనిపెట్టా రు. 4ఏళ్లలో కేవలం 10మందికి డబ్బులిచ్చి పేరుమార్చాడు. దళితయువతకు ఇన్నో వా కార్లు ఇచ్చింది తెలుగుదేశమే. చిన్నతరహాపరిశ్రమలు పెట్టుకోవాలనుకునేవారికి రూ.75లక్షల సబ్సిడీ ఇచ్చింది టీడీపీప్రభుత్వమేనన్నారు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్మృతివనం ఏర్పాటుకు బీజంవేస్తే దాన్నిఆపేశారు.
అంబేద్కర్ విగ్రహంతోపాటు, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాం పెట్టాలనుకున్నాం.దళిత విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. వారిని విద్యలో ప్రోత్సహించాలనే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను తీసుకొచ్చాను. ప్రైవేట్ స్కూళ్లకంటే మిన్నగా సౌకర్యాలు ఉండేలా గురుకుల పాఠశాలల్ని ఏర్పాటుచేశాము. ఇతను వచ్చాక ఎక్కడైనా ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాడా? పేదపిల్లలచదువుకు దూరంకాకూడదని బడిపిలుస్తోంది మళ్లీ బడికి వంటి కార్యక్రమాలు అమలచేశాం. చదువుకునే పిల్లల్ని పాఠశాలలకు తీసుకొచ్చే బాధ్యతనుఉపాధ్యాయులకు అప్పగించాం. దానివల్ల పేదపిల్లలు చదువుకున్నారు. 1997లో మనప్రభుత్వం అంటరానితనం నిర్మూలనకు శ్రీకారం చుట్టింది అని చెప్పారు.
అంబేద్కర్ గారు రాజ్యాం గం రాసేటప్పుడు 10ఏళ్లు రిజర్వేషన్లు పెట్టారు. 75ఏళ్లుగా ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. మనంకూడా మలుపు, ముందడుగు వంటి పథకాలు దళితుల కోసమే తీసుకొచ్చాం. పేదరికం – జనాభా ప్రకారంగా పథకాలు అమలుచేశామని చంద్రబాబు చెప్పారు. తెలుగురాష్ట్రాల్లో సంపదసృష్టించిందే తెలుగుదేశంపార్టీ. కొత్తగా జాతీయరహదారులు వేశాక, అనేకమార్పులు వచ్చాయి. అవి ప్రభుత్వ, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీపీపీ) భాగస్వామ్యంతోనే వచ్చాయి. అలానే సాంకేతికపరిజ్ఞానం బాగా పెరిగిందన్నారు. నిన్న ఒకఅమ్మాయిని చూశాను. చదువుకోవాల్సిన వయసులో బీదరికం వల్ల కూలి పనులకు వెళ్తోంది. ఆ అమ్మాయి నేను మాట్లాడుతుంటే ఫోన్ లో తమవారికి లైవ్ చూపిస్తోంది. ఆ అమ్మాయిని చదువుకుంటావా అని అడిగితే చదువుకుంటాను అన్నది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ అమ్మాయిని చదివించే బాధ్యత తీసుకున్నాను. ఇలాంటివి ప్రభుత్వం చేయాలన్నారు.
ప్రభుత్వంలో పోటీతత్వం
పోటీతత్వం ప్రభుత్వంలో తీసుకొచ్చింది తెలుగుదేశంపార్టీనే. దానివల్లే రోడ్లువేయడం, విమానాశ్రయాలు, పోర్టులనిర్మాణం వంటివి సాధ్యమయ్యాయని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా P-4 వి ధానానికి శ్రీకారం చుట్టాము. ఉపాధికోసం హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాల్సిన పరిస్థి తికల్పించారు. అమరావతిపూర్తై ఉంటే ఎవరూ ఎక్కడికి పోకుండా, అందరికీ ఉపాధి ఉద్యోగాలు లభించేవన్నారు. నేను చెబుతున్న ఫార్ములా పి 4 పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే. పి 4 పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్. పేదల్ని ధనికుల్నిచేయడమే టీడీపీ నిర్దిష్ట విధానం. మనం పైకిరావడం కాదు. అందరినీ పైకి తీసుకు రావాలన్నదే నా ధ్యేయం అని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా దళితద్రోహి జగన్ రెడ్డి: దళితబాంధవుడు-పేదలపెన్నిధి చంద్రన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, దానిలోని అంశాల్ని చదివి
వినిపించారు.