నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల పెంపు తో బ్రతుకు భారం గా మారిన మహిళల కష్టాలు నేను చూసాను. నా అక్క, చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. ప్రజల కష్టాలు తెలుసుకున్నాకే చంద్రబాబునాయుడు మహానాడులో మినీ మ్యానిఫెస్టో ప్రకటించారు. 1) మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే.. మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారు. ఉద్యోగాలు ఇస్తానని యువతను చీట్ చేసాడు జగన్. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడాది 6,500 కానిస్టేబుల్ పోస్టులు, మెగా డిఎస్సీ అని ఒక్క హామీ నిలబెట్టుకోలేదు.
యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దిక్కుమాలిన పరిస్థితి జగన్ పాలనలో ఉంది. రైతు రాజ్యం తెస్తానని రైతులు లేని రాజ్యం తెచ్చాడు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపి నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం అని అన్నాడు .