జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి.
2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. 2019 ఎన్నికల్లో రాజంపేట రూపురేఖలు మార్చేస్తారని మేడా మల్లిఖార్జున రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు. నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలు, ప్రజలకు జరిగిన అన్యాయం, సొంత పార్టీ కార్యకర్తలే వేసిన కర పత్రాలు గురించి తెలుసుకున్న తరువాత స్టేట్ లో ఇంత చేతగాని ఎమ్మెల్యే ఎవరూ ఉండరు అని తేలిపోయింది. అందుకే పేరు మార్చాను అయన మేడా మల్లిఖార్జున్ కాదు చేతగాని మల్లిఖార్జున్.
చేతగాని మల్లిఖార్జున్ బినామీల పేరుతో వేల ఎకరాలు కొట్టేసాడు. చేతగాని మల్లిఖార్జున్, జెడ్పి ఛైర్మెన్ అమర్నాధ్ రెడ్డి లు కలిసి భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. బాధితులు అంతా ఫిర్యాదు చెయ్యడంతో కలెక్టర్ ఆర్డీఓ పై చర్యలు తీసుకున్నారు. మరి భూములు కొట్టేసిన వారిపై చర్యలు ఉండవా? చేతగాని మల్లిఖార్జున్, జెడ్పి ఛైర్మెన్ అమర్నాథ్ రెడ్డి కలిసి రూ.15 కోట్లు జెడ్పి సొమ్ము కాజేసారు. జగన్ ని ఆదర్శంగా తీసుకోని ఊరుకో ప్యాలస్ కట్టుకున్నారు ఈ ఇద్దరు. హైదరాబాదులో ఒక ప్యాలెస్, బెంగుళూరులో మరో ప్యాలెస్, తిరుపతిలో ఒక ప్యాలెస్, రాజంపేటలో మరో ప్యాలెస్, స్వగ్రామం చెన్నాయగారి పల్లెలో మరో ప్యాలెస్ మొత్తం ఐదు ప్యాలెస్ లను కట్టుకొని జగన్ ను మించిపోయాడు. నందలూరు తన సొంత మండలమైన చెన్నాయగారి పల్లె చుట్టూ సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని తన చిన్నాన్న మేడా భాస్కర్ రెడ్డితో కలిసి కబ్జా చేసాడు చేతగాని మల్లిఖార్జున్.
ఎమ్మెల్యే ని మించి జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి తమ స్వగ్రామమైన రాజంపేట మండలం ఆకేపాడులో మూడు స్మశానాలున్న గుట్టనే ఆక్రమించి అక్కడ మైసూర్ ప్యాలెస్ లాంటి ఇల్లును కట్టి చుట్టూ వందలాది ఎకరాలు భూకబ్జాలకు పాల్పడ్డాడు. ఒకవైపు ఎమ్మెల్యే చేతగాని మల్లిఖార్జున్ మరోవైపు జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజంపేటను సర్వనాశనం చేశారు. నాలుగేళ్లలో మీరు ఏం సాధించారు అని చేతగాని మల్లిఖార్జున్ ని అడిగితే ఎం చెప్పాడో తెలుసా? రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకోవడం, మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకోవడం, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చెయ్యడం, ప్రభుత్వ భూములు కబ్జా చెయ్యడం, మున్సిపాలిటీకి వంద కోట్లు తెస్తానని హామీ ఇచ్చి రూపాయి తేకపోవడం అని సమాధానం చెప్పాడట. చేతగాని మల్లిఖార్జున్ స్వార్థం వలనే అన్నమయ్య, పించా డ్యాంలు కొట్టుకుపోయాయి. 38 మంది చనిపోయారు, పశువులు, వందల కొద్ది ఇళ్లు అన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. బాధితులను ఆదుకోలేని చెత్త ప్రభుత్వం ఇది. ఇసుకని దోచేసి టిప్పర్లలో బెంగుళూరు,చెన్నై, హైదరాబాద్ ఎక్స్ పోర్ట్ చేసి కోట్లు గడిస్తున్నాడు చేతగాని మల్లిఖార్జున్.
చేతగాని మల్లిఖార్జున్ ని కొన్ని అంశాల పై ప్రశ్నిస్తున్నాను. రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా ఎందుకు అడ్డుకున్నారు? మెడికల్ కాలేజీ ఎందుకు రాలేదు? అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి మీరు కారణం కాదా? ప్రభుత్వ భూములు కబ్జా చేసింది నిజం కాదా? గెలిస్తే 100 కోట్లు తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ నిధులు ఎక్కడ? రాజంపేటలోని ఆరు మండలాలను ఆరుగురు కుటుంబ సబ్యులకు వాటాలు వేసి పంచేసాడు చేతగాని మల్లిఖార్జున్. టి సుండుపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు ప్రభుత్వ స్థలాలైన కొండలు, గుట్టలు చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు. ఒక దళిత మహిళ తోటపై కన్ను వేసి మామిడి చెట్లను కూడా నరికించి, వారి కుటుంబ సభ్యులను బెదిరించాడు. నందలూరు మండలంలో ఎమ్మెల్యే చిన్నాన్న అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఆఖరికి మాట వినకపోతే అధికారుల పై దాడులు, ట్రాన్స్ ఫర్లు చేయిస్తున్నాడు.
సిద్దవటం మండలంలో ఒక మహిళ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడింది. పోలీసులు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మరదలని అని చెప్పింది. చేతగాని మల్లిఖార్జున్ అనుచరులు భూకబ్జాలు, ఇసుక దోపిడీ, దాడులు, ఆఖరికి దళితుల స్మశానాలు కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. వీళ్ల అరాచకాలు పరాకాష్టకు చేరాయి, ఎంపీటీసీ అభ్యర్థి గా పోటీ చేసిన జింకా శివ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే అతని ఇంట్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి అరెస్ట్ చేసారు. రాజంపేటను అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, రోడ్లు అభివృద్ధి చేసింది టిడిపి.
టిడిపి హయాంలో రూ.1500 కోట్లు ఖర్చు చేసి రాజంపేట నియోజకవర్గంని అభివృద్ది చేసాం. ఒంటిమిట్టను ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా అభివృద్ధి చేసింది టిడిపి. 100 కోట్లు ఖర్చు చేసాం. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలు అందించడానికి 30 కోట్లు ఖర్చు చేసాం. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. జగన్ రాజంపేటకు అనేక హామీలు ఇచ్చారు. ఒక అసమర్ధ సీఎం వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. 38 మంది చనిపోయారు. ఎంతో మంది ఇళ్లు కోల్పోయారు. రోడ్డున పడ్డారు. ఇప్పటికీ గుడారాల్లో ఉంటున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు రెండు నెలల్లో ఇళ్లు కట్టిస్తా అన్నాడు. 18 నెలలు అయ్యింది, ఒక్క ఇటుక పెట్టలేదు.
ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ని జిల్లా చేస్తామని చెప్పి రాజంపేట ప్రజలను మోసం చేసాడు. రాజంపేటకు మెడికల్ కాలేజీ ఇస్తామని మోసం చేసాడు. నందలూరు లో ఆల్విన్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తానని మోసం చేసాడు. నందులూరు లో రైల్వే లోకో షెడ్ ఓపెన్ చేయిస్తానని మోసం చేసాడు. జరికోన ప్రాజెక్ట్ నుండి సుండుపల్లి మండలానికి త్రాగు, సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చాడు. రాజంపేట నుండి వీరబల్లి, సుండుపల్లి వెళ్ళే రోడ్ల విస్తరణ చేస్తానని హామీ ఇచ్చాడు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటుంది. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం.
సోమశిల బ్యాక్ వాటర్ వలన ఇబ్బంది పడుతున్న గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తాం. రాజంపేట అండర్ బ్రిడ్జ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం. మార్కెట్ యార్డ్ ని అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటాం. పట్టు, కలర్ సబ్సిడీలు అందిస్తాం. జీఎస్టీ భారం లేకుండా చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మాచుపల్లి బ్రిడ్జ్ రెండేళ్ల లో పూర్తి చేస్తాం. టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను. రాజంపేటలో ఉన్నా రష్యా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.