రాజంపేట బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం లో జరిగిన మూడు ఘటనల గురించి వివరించాడు . మొదటిది సిపిఎస్ మోసం. ప్రతి సారి చర్చలు అంటూ నమ్మించడం ఉద్యోగుల గొంతు కొయ్యడం. 3 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయేలా ఇప్పుడు మళ్లీ జిపిఎస్ అంటున్నాడు. పైగా ఇచ్చిన హామీ నుండి తప్పించుకోవడానికి జగన్ ఒక అవగాహన లేని వ్యక్తి అని ఏకంగా ప్యాలస్ బ్రోకర్ సజ్జల ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నేను ఒక్కటే అడుగుతున్నా మాట తప్పను, మడమ తిప్పను అని బిల్డప్ ఇచ్చావ్ కదా సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తావ్?
రెండోవది పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టించి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇళ్లు కట్టలేదు అని సుమారు లక్ష మందికి ఇళ్ల పట్టాలు రద్దు చేసాడు. మరో 3 లక్షల మంది పట్టాలు వెనక్కి తీసుకోవడానికి స్కెచ్ వేసాడు. ఈయనకి పేదలు అంటే ఎంత కక్షో నిన్నే చూసా. ఈయన దేశంలోనే ధనిక సీఎం, ఊరికో ప్యాలస్. కానీ సొంత జిల్లా కడప లో పేదలకు సెంటు స్థలం ఎక్కడ ఇచ్చాడో తెలుసా కనీసం వెళ్ళడానికి రోడ్డు కూడా లేని కొండ మీద.
మూడోవది మార్గదర్శి అంశం. మోసగాడు జగన్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందరి కంపెనీలు నీ కంపెనీల్లా సూట్ కేసు కంపెనీలు కాదు. అసలు మార్గదర్శి మీద ఫిర్యాదే లేదు. వీళ్లు విచారణ అంటూ హడావిడి చేస్తారు. అందులో కూడా ఎంత విచిత్రం అంటే విచారణ పూర్తి అయిన తరువాత మంగళవారం రాత్రి సిఐడి అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారు మీడియా తో మాట్లాడుతూ ఎండీ శైలజా కిరణ్ గారు విచారణ కు సహకరించారు అని చెప్పారు. తాడేపల్లి ప్యాలస్ నుండి కోటింగ్ పడే సరికి స్వరం మారింది 14 గంటల్లోనే ఆయన కూడా మాట మార్చాడు విచారణ కు సహకరించలేదు అని మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. కక్ష సాధింపు కి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్.