మోసగాడు జగన్ సొంత బాబాయ్ ని లేపేసి బురద మా పైన వేసాడు. కడప గడ్డ పై నిలబడి అడుగుతున్నా హూ కిల్డ్ బాబాయ్… హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ ని లేపేసిన కేసులో అవినాష్ అరెస్ట్ అయ్యాడు. ఆ విషయం బయటకి రాకుండా డ్రామాలు ఆడారు. జగన్ అండ్ అవినాష్ కిల్డ్ బాబాయ్. నీ సొంత జిల్లా ప్రజలు చెబుతున్నారు అది జగనాసుర రక్త చరిత్ర అని. బాబాయ్ ఆత్మ జగన్ ని వదిలిపెట్టదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడని లోకేష్ అన్నాడు .
చెల్లి ఉసురు తగులుతుంది. సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసినోడు కడప బిడ్డని అని బిల్డప్ ఇస్తున్నాడు. వర్ధంతికి కి, జయంతి కి తప్ప ఎప్పుడైనా ఉమ్మడి కడప జిల్లా గుర్తొచ్చిందా? కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎం అయ్యింది? అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్? నేను సవాల్ చేస్తున్నా టిడిపి హయాంలో ఉమ్మడి కడప అభివృద్ధి, వైసిపి హయాంలో అభివృద్ధి పై చర్చకు నేను సిద్ధం నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు జగన్.
జగన్ కడప బిడ్డ కాదు ఉమ్మడి కడప జిల్లా కి పట్టిన శని. జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్(mythomania syndrome) తో జగన్ బాధపడుతున్నాడు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు. బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.