తాడేపల్లి (చైతన్య రథం): మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మెడ్ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బొర్రా విజయ్ చైతన్య, ఛైర్మన్ బొర్రా లక్ష్మీ సింధూర, మెడ్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ పర్చూరి సాయికుమార్, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, ఏపీఎంఎసఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

















