మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల క్యాంప్ సైట్ వద్ద పొగాకు రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.
పొగాకు రైతుల పెట్టుబడి బాగా పెరిగింది. కేవలం 36.5 టన్నులకు మాత్రమే బోర్డు అనుమతి ఇస్తుంది. కనీసం 50 టన్నులు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి.
ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే పొగాకు రైతుకు మంచి రేటు వస్తుంది.
పొగాకు పంటకు ఇన్స్యూరెన్స్ లేక పోవడం వలన అకాల వర్షాలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాం.
పొగాకు రైతులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. ఎరువుల ధర కూడా పెంచేశారు.
అకాల వర్షాలతో నష్టపోతున్నాం. పొగాకు రైతులకు మాత్రం జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు.
పొగాకు స్టాక్ పెట్టుకోడానికి షేడ్స్ ఏర్పాటు కోసం సబ్సిడీలు అందించాలి.
…మార్కాపురం పొగాకు రైతులు
లోకేష్ మాట్లాడుతూ
పాదయాత్ర చేసిన జగన్… సిఎం అయిన జగన్ ఒక్కరేనా అనే అనుమానం నాకు ఉంది.
రాయలసీమ రైతాంగంతో పాటు మెట్ట ప్రాంతం రైతులకు జీవనాడి డ్రిప్ ఇరిగేషన్ అని పాదయాత్ర చేసిన జగన్ కి తెలుసు.
కానీ సిఎం అయిన జగన్ డ్రిప్ పై సబ్సిడీ ఎలా ఎత్తేసాడో నాకు అర్దం అవ్వడం లేదు. అందుకే ఆయన, ఈయనా ఒక్కరేనా అనే అనుమానం ఉంది.
అన్నం పెట్టే రైతన్న పొట్ట కొట్టాడు జగన్.
గాలి మాటలు చెప్పి జగన్ రైతుల్ని మోసం చేశాడు.
రైతు కష్టం లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం ఇచ్చే సహాయం తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి రూ.20 వేల సాయం అందిస్తాం.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రూ.50 వేల లోపు ఉన్న రైతు రుణాలు అన్ని ఒకే సంతకంతో మాఫీ చేసాం.
ఇన్పుట్ సబ్సిడీ, సూక్ష్మ పోషకాలు, రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్ ఇలా అనేక పథకాలు టిడిపి హయాంలో రైతు సంక్షేమం కోసం అమలు చేసాం.
ఎన్టీఆర్ గారు కందుకూరు లో పొగాకు బోర్డు ఏర్పాటు చేసారు.
పొగాకు కు రేటు లేకపోతే కిలో కి అదనంగా రూ.5 ఇచ్చి పొగాకు రైతులని ఆదుకుంది చంద్రబాబు గారు.
రైతుల కోసం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేసాడు.
డ్రిప్ ఇరిగేషన్ కట్ చేశాడు.
జగన్ అసమర్థ నిర్ణయాల వలన రైతులు ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రైతుల తలసరి అప్పు రూ.70 వేలు ఉంటే జగన్ పాలనలో రైతుల తలసరి అప్పు రూ.2.50 లక్షలకు చేరింది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం తో పోరాడి 50 టన్నులు అమ్ముకోవడానికి బోర్డు. అనుమతి ఇచ్చేలా పోరాడతాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొక్క దగ్గర నుండి మందుల వరకూ అందించే విధంగా ప్రతి పంటకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ జోన్లు ఏర్పాటు చేసి రైతులకు సూచనలు ఇస్తాం.
పొగాకు లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతుకి మేలు జరుగుతుంది.
పొగాకు కి ఇన్స్యూరెన్స్ కల్పించే అంశం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
పొగాకు రైతుల పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల పెట్టుబడి తగ్గిస్తాం. డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీలు, రుణాలు అందిస్తాం.
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేయడం వలన దాని ప్రభావం రైతాంగం పై కూడా పడింది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులు స్టాక్ పెట్టుకోడానికి రేకుల షెడ్డు నిర్మాణానికి సహాయం అందిస్తాం.