రమణయ్య
సోమశిల ముంపు బాధితులకు న్యాయం చెయ్యలేదు. పరిహారం ఇవ్వడం లేదు గ్రామాలను అభివృద్ది చెయ్యడం లేదు.
చిన్నా రెడ్డి
హార్టికల్చర్ కి ఎటువంటి ప్రోత్సాహం అందడం లేదు.
వెంకట రమణయ్య
టిడిపి హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వారు. మిరప రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. సూక్ష్మ పోషకాలు కూడా ఇవ్వడం లేదు.
శ్రీనివాసులు నాయుడు
పామ్ ఆయిల్ రైతులకు వైసిపి ప్రభుత్వం ఎటువంటి సాయం చెయ్యడం లేదు.. మొక్క రేటు నాలుగు రెట్లు పెరిగింది. సబ్సిడీ కూడా వెయ్యడం లేదు.
పెంచలయ్య
పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి పెరుగుతుంది. మద్దతు ధర లేదు.
రమణయ్య
జగన్ పాలనలో మిర్చి రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది.
శ్రీనివాసులు యాదవ్
పత్తి రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి తగ్గిపోతుంది.
విజయ్ భాస్కర్
వరి రైతులను జగన్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బ తీసింది. ధాన్యం కొనుగోలు చెయ్యడం లేదు. కొన్న ధాన్యానికి డబ్బులు వెయ్యడం లేదు.
… ఆత్మకూరు నియోజకవర్గం రైతులు.
ఆనం రామనారాయణ రెడ్డి
తొలి రోజే రైతులతో లోకేష్ సమావేశం అవ్వడం మంచి పరిణామం.
మర్రిపాడు మండలానికి సాగునీరు లేదు. కేవలం వర్షాధారం పై రైతులు ఆధారపడ్డారు.
సోమశిల హై లెవల్ కెనాల్ ప్రాజెక్టు పూర్తయితే తప్ప ఆత్మకూరు రైతుల సాగునీరు కష్టాలు తీరవు.
ఫేస్ 1 పూర్తి చెయ్యకుండా ప్రస్తుత ప్రభుత్వం ఫేస్ 2 పనులు మొదలు పెట్టి పార్టీ నాయకుడికి పనులు కట్టబెట్టారు.
సోమశిల ఉత్తర కాలువను ఆధునీకరించాలి.
ప్రస్తుత ప్రభుత్వం సోమశిల ఉత్తర, దక్షణ కాలువలను విధ్వంసం చేసి వదిలేశారు.
అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసినట్టే సాగునీటి ప్రాజెక్టులను కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది.
జగన్ ప్రభుత్వం నెల్లూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది. బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు వదిలి వెళ్ళిపోయారు.
సోమశిల ప్రాజెక్టు, అనుబంధ ప్రాజెక్టులు నెల్లూరు జిల్లా కి జీవనాడి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది.
టిడిపి హయాంలో మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ట్రాక్టర్లు ఇచ్చారు.
వ్యవసాయ పనులు లేక వలస వెళ్లి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు, ఇతర చేసుకుంటున్నారు.
లోకేష్ మాట్లాడుతూ
జగన్ రైతులు లేని రాజ్యం తెచ్చాడు
రైతు ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది
రైతు పై ఉన్న తలసరి అప్పు లో ఏపిని నంబర్ 1 చేశాడు జగన్
టిడిపి హయాంలో ఒక్కో రైతు పై రూ.75 వేలు అప్పు ఉంటే ఇప్పుడు జగన్ పాలనలో ఒక్కో రైతుపై రూ.2.50 లక్షల అప్పు ఉంది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆదుకోవడానికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే టిడిపి లక్ష్యం.
టిడిపి హయాంలో ఒకే సంతకంతో 50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసాం.
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని సబ్సిడీ లో అందించాం.
ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేసి పంట కుంటలు తవ్వాం.
90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం.
రైతు రథాలు, ఎన్టీఆర్ జలసిరి కింద బోర్ వేసి సోలార్ పంపు సెట్లు, సూక్ష్మ పోషకాలు ఇచ్చాం.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం.
వైసిపి పాలన లో మొదటి రెండేళ్లు నెల్లూరు జిల్లాకి చెందిన అనిల్ గారు ఇరిగేషన్ మంత్రి గా ఉన్నారు. నెల్లూరు జిల్లా లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. నెల్లూరు జిల్లా కి ఆయన తీవ్ర అన్యాయం చేశారు.
ఇప్పుడు నెల్లూరు జిల్లా కి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.
కాకాణి కోర్టు దొంగ ఆయన సీబీఐ కేసులో బిజీగా ఉన్నాడు.
సొంత జిల్లా లో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాలనే ఆలోచన కూడా కోర్టు దొంగ కి రాలేదు.
జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు చెల్లించక మూతబడ్డాయి.
ప్రతి నియోజకవర్గం లో ఏడాదికి 500 బోర్లు వేస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల ప్రాజెక్టు పూర్తి చేసి ముంపు బాధితులకు పరిహారం అందిస్తాం. పిల్ల కాలువలు కూడా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తాం.
హార్టి కల్చర్ ని టిడిపి హయాంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాం.
వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత కనీస సహకారం ఇవ్వడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హర్టి కల్చర్ పంటల వారీగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
ఎక్కువ రకాలు సాగు చేసేలా రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తాం.
ప్రతి పంటకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే మొక్కలు అందిస్తాం.
మామిడి, అరటి, దానిమ్మ, కర్జూరం, బొప్పాయి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలా కంపెనీలతో ఒప్పందం చేసుకొని రైతులను ఆదుకుంటాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనం దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ బాధ్యత తీసుకుంటాం.
పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తాం.
జగన్ పాలనలో రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి రూ.7,500 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
జగన్ పనైపోయింది. రాబోయేది టిడిపి ప్రభుత్వమే.
మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కారణంగా నష్టపోతున్నారు.
కల్తీ విత్తనాలు వైసిపి నాయకులే సరఫరా చేస్తున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
మిర్చి రైతులు పెట్టుబడి పెరిగి తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీలో అందిస్తాం. మిర్చి అమ్ముకోవడానికి లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. గుంటూరు వెళ్లి అమ్ముకోవాల్సిన కష్టాలు తొలగిస్తాం.
నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు అమ్మకుండా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.
గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేస్తేనే రాష్ట్రంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.
ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో రాష్ట్రంలోని ప్రాజెక్టులు చూస్తే అర్దం అవుతుంది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది.
పొగాకు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి పెరిగి తీవ్రంగా నష్టపోతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పొగాకు కు రేటు బాగున్నా ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర ఉండటం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులని ఆదుకుంటాం. మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైసిపి ప్రభుత్వం ఆదుకొలేదు.
వైసిపి పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
గతంలో రూ.20 వేలు పెట్టుబడి అయితే ఇప్పుడు రూ.40 వేలు అవుతుంది.
కనీసం ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని దుస్థితి.
నెల్లూరు జిల్లాలో ధాన్యం కుంభకోణం రాష్ట్రం మొత్తం చూసింది.
వరి రైతులని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకుంటాం. సకాలంలో డబ్బులు వేస్తాం.