పత్తికొండ నియోజకవర్గం, పెద్దకొండ వద్ద తుగ్గలి వెన్నెల దివ్యాంగుల సమాఖ్య సభ్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వం రద్దు చేసిన వికలాంగ కార్పొరేషన్ ను పున:ప్రారంభించాలి. గత ప్రభుత్వంలో మంజూరైన రుణాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దివ్యాంగులను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బధిరుల కోసం సైగల భాష, సబ్ టైటిల్స్ తో టీవీ కార్యక్రమాలు నిర్వహించాలి.
విద్యా, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించాలి. గృహాల కేటాయింపుల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. వ్యాంగులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగుల పెన్షన్ ను రూ.3 వేలు చేసిన ఘనత చంద్రబాబుది. పెన్షన్ల పెంపులో దివ్యాంగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది.
దివ్యాంగులను వివాహం చేసుకున్నవారికి రూ.లక్ష ప్రోత్సాహంగా అందించాము. దాన్ని లక్షన్నరకు పెంచుతామని జగన్ చేయకుండా మోసం చేశారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారికి యాక్టివా మోటార్ సైకిళ్లు కూడా పంపిణీ చేశాం. స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల దాకా రుణాలిచ్చాం. దివ్యాంగులను ఎవరైనా కించపరిచితే అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం. ఆత్మగౌరవంతో దివ్యాంగులు బతికేలా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. విద్యా, ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.