వాల్మీకిలకు న్యాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గం ఆరేకల్ లో వాల్మీకి సామాజికవర్గీయులు లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో దాదాపు 40లక్షలమంది వాల్మీకిల జనాభా ఉన్నారు. 1956వరకు ఎపిలో వాల్మీకిలు ఎస్టీ జాబితాలోనే కొనసాగారు. ఆ తర్వాత మైదాన ప్రాంతంలో ఉన్నవారిని బిసిలుగా, ఏజన్సీ ప్రాంతంలో ఉన్న వారిని ఎస్టీలుగా కొనసాగించారు.
అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో వాల్మీకిలను బిసి జాబితాలో పెట్టడం అన్యాయం. ఇటీవల జగన్ ప్రభుత్వం కేవలం కొన్నిజిల్లాల్లో వాల్మీకిలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. వాల్మీకిల మధ్య ప్రాంతీయ విభేదాన్ని తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలి.అని వారు లోకేష్ ను కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. వాల్మీకి/బోయలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన పార్టీ తెలుగుదేశం.
ఈ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులును ఎంపిగా, రాష్ట్రమంత్రిగా చేసింది టిడిపినే. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. గతంలో చేసిన తీర్మానం కేంద్రం వద్ద ఉండగా, జగన్ ప్రభుత్వం మరో అసంబద్ధమైన తీర్మానం చేసి పంపడంలో అంతర్యమేమిటో వాల్మీకులంతా గమనించాలి అని కోరారు.