టిడిపి అధికారంలోకి రాగానే దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడమేగాక, ఎస్సీలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్రలో సందర్భంగా బుధవారం నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరులో నియోజకవర్గంలో దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎస్సీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ నిధులను వైసిపి ప్రభుత్వం నవరత్నాలకు దారిమళ్లించి తీరని ద్రోహం చేస్తోంది.
వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన 27సంక్షేమ పథకాలను పునరుద్దరించాలి.
గతంలో అమలుచేసిన అంబేద్కర్ స్టడీసర్కిల్, విదేశీవిద్య, ఎన్ఎస్ఎఫ్ డిసి వంటి పథకాలను మీరు అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టాలి.
గతంలో ఇంటర్, డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థుల స్వయం ఉపాధికి ఇన్నోవాలు, ట్రాక్టర్లు అందించారు. టిడిపి వచ్చాక మళ్లీ సబ్సిడీపై వాహనాలను అందించాలి.
కెజి నుంచి పిజి వరకు ఎస్సీ నిరుపేదలకు ఉచిత విద్య అందించడంతోపాటు విదేశీవిద్య అందించేలా చర్యలు తీసుకోవాలి. అని విజ్ఞప్తి చేశారు.
సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ఎస్సీలకు చెందాల్సిన రూ.28,147 కోట్లు దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.
ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేయడమేగాక, అదేమని ప్రశ్నించిన దళితులపై దాడులకు పాల్పడుతున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
పేద ఎస్సీ విద్యార్థలకోసం స్టడీసర్కిల్స్, అంబేద్కర్ విదేశీవిద్య పథకాలను అమలుచేస్తాం.
దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో బుద్దిచెప్పండి అని కోరారు.