నారా లోకేష్ గూడూరు బహిరంగ సభ లో వైసిపి ఎంపీ ల గురించి ఘాటు కామెంట్స్ చేసాడు. ఆనాడు జగన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రారంభించాడు . 25 మంది ఎంపీలను తనకి ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్నాడు. జగన్ నాటకాన్ని జనం నమ్మారు లోక్ సభ, రాజ్య సభ కలిపి 31 ఎంపీ సీట్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆ వైసిపి ఎంపీలు ఎం చేస్తున్నారో తెలుసా? ఒక ఎంపీ బాబాయ్ ని లేపిసి అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ జిప్పు విప్పి ఇండియా మొత్తం చూపించాడు.
ఒక ఎంపీ యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తూ పూలు చల్లమని అడుక్కుంటున్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న కొడుకుని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒక ఎంపీ భార్యా, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు. వీళ్లంతా కలిసి సాధించింది ఒక్కటే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కి చంచల్ గూడా జైల్లో ప్రత్యేక ఖైదీ హోదా సాధించారు. జగన్ చెత్త పాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వైసిపి ఎమ్మెల్యేలే నడి బజార్ లో జగన్ పరువు తీస్తున్నారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గారికి మంచి డౌట్ వచ్చింది? అసలు నేను ఎమ్మెల్యే నా? కాదా అని బాధపడ్డారు. లక్ష రూపాయల పని చేయించలేక ఆయన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బాధపడ్డాడు. ముస్తఫా గారు బయట ఏడ్చారు… మిగిలిన వైసిపి ఎమ్మెల్యేలు ఇంట్లో ఏడుస్తున్నారు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల ఆ పార్టీ లో కొందరు ఎమ్మెల్యేలు కూడా అసహనంగా వున్నారు అని నారా లోకేష్ విమ్మర్శించాడు.