రాజంపేట రాజసం అదిరిపోయింది. కలియుగ దైవం శ్రీ వారికి 33 వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యులు జన్మించిన గొప్ప నేల. శివ భక్తుడు శ్రీ భక్త కన్నప్ప జన్మించిన పుణ్య భూమి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం, సౌమ్యనాథస్వామి దేవాలయం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం రాజంపేట. రాజంపేట రాజసానికి గుర్తు సిద్దవటం కోట. ఘన చరిత్ర ఉన్న రాజంపేట గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళం… మనగళం… ప్రజాబలం.యువగళం దెబ్బకి వైసిపి నాయకుల ప్యాంట్లు తడిసిపోతున్నాయి. కడప గడ్డ పై యువగళం గర్జన చూసి జగన్ ప్యాలస్ లో నాలుగు టీవీలు పగలగొట్టాడు. నా సొంత జిల్లా లో యువగళంకి అంత మంది జనం ఎందుకు వెళ్తున్నారు అని ప్యాలస్ బ్రోకర్ సజ్జలని జగన్ అడిగాడట. వెంటనే ప్యాలస్ బ్రోకర్ ఆవేశంగా కడప జిల్లా నేతలకి కాల్ చేసి అడిగితే ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు, ఒక్క రూపాయి విడుదల కాలేదు, అన్ని శిలాఫలకాల స్టేజ్ లోనే ఉన్నాయి. నాలుగేళ్లలో మనం పీకింది ఏమి లేదు. అందుకే అంత జనం వస్తున్నారు అని వైసిపి ఎమ్మెల్యేలు చెప్పారట. అప్పుడు జగన్ ఆవేశంతో ఊగిపోయి ఎలా అయినా యువగళాన్ని అడ్డుకోవాలని కోడి గుడ్డు అటాక్ ప్లాన్ చేసాడు.
క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది కోడి గుడ్డు బ్యాచ్ కి భయపడతామా ? ఏదో ఒక వెధవ పని చెయ్యడం దానికి ఒక కథ అల్లడం జగన్ కి అలవాటు. సెల్ఫీ ఇవ్వనందుకే కోడిగుడ్డు విసిరారు అని ఒక పోలీసు అధికారి ప్రెస్ మీట్ పెడతాడు. అయ్యా అబద్దాలు చెప్పడంలో మీరు జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. నేను ప్రతి రోజూ వెయ్యి మందికి సెల్ఫీలు ఇస్తాను, అదంతా లైవ్ లో వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. ఇంకో మంచి స్టోరీ ఏదైనా చెప్పండి అని ఆ పోలీసు అధికారికి నా సలహా. నా మీద కోడిగుడ్డు వేయించి ఎక్కడికి పారిపోతావ్ జగన్. ఏపీలోనే గా ఉండాల్సింది. ఒక వేళ నువ్వు లండన్ పారిపోయినా నీకు కోడిగుడ్ల తో సన్మానం ఖాయం. నా దారి రహదారి. అడ్డొస్తే అడ్రస్ లేకుండా చేస్తా. మళ్లీ చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర. భయం నా బయోడేటా లో లేదు, బ్లూ సైకోలకు బాదుడే బాదుడు. మోసానికి మానవ రూపం జగన్. అందుకే మోసగాడు జగన్ అని పేరు పెట్టా.