ఉదయగిరి యూత్ ఉత్సాహం అదిరిపోయింది. శ్రీ కృష్ణ దేవరాయలు పాలించిన నేల ఉదయగిరి. ఉదయగిరి కోటకి ఎంత పౌరుషం ఉందో ఇక్కడి ప్రజలకు అంత పౌరుషం ఉంది. శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఉదయగిరి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఉదయగిరి నుండే. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉదయగిరి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.యువగళం..మనగళం.. ప్రజాబలం. ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వం అన్నారు…2 వేల కిలోమీటర్లు నడిచాను. ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటాం అన్నారు… 154 రోజులుగా ప్రజల్లోనే ఉన్నా. మాట్లాడనివ్వం అన్నారు..యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి షేక్ అయ్యింది.జగన్ ది పోలీసు బలం.. లోకేష్ ది ప్రజా బలం. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం…లోకేష్ ది అంబేద్కర్ గారి రాజ్యాంగం. అమ్మకి అన్నం పెట్టని వాడు అంగన్వాడీ టీచర్లకు బంగారు గాజులు కొనిస్తానని చెప్పాడు. అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల ముందు జగన్ అనేక హామీలు ఇచ్చాడు. నాలుగేళ్లు అయ్యింది ఒక్క హామీ నెరవేర్చలేదు. జీతం పెంచలేదు, ప్రభుత్వ ఉద్యోగం అంటూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా పోరాడుతున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులతో కొట్టిస్తున్నాడు జగన్.
అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి టిడిపి మద్దతు ఇస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం. ఆంధ్రప్రదేశ్ కి మధ్యప్రదేశ్ కి ఎంత తేడా ఉందో తెలుసా? సైకో సిఎం కి ఇక మంచి సిఎం కి మధ్య ఎంత తేడా ఉంటుందో తెలుసా? మధ్యప్రదేశ్ లో ఒక గిరిజనుడిపై ఒక దుర్మార్గుడు ఉచ్చ పోసి బూతులు తిడుతూ అవమానించాడు. వెంటనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిందితుడిని అరెస్ట్ చేయించి అతడు ఆక్రమించుకొని కట్టిన ఇల్లు కూడా కూల్చారు. గిరిజనుడు రావత్ ని ఇంటికి పిలిచి అతని కాళ్లు కడిగారు. ఆంధ్రప్రదేశ్ లో సైకో సిఎం ఏమి చేసాడు? దళిత యువకుడు సుబ్రమణ్యంని చంపేసిన అనంతబాబు పై చర్యలు తీసుకోలేదు. పైగా బెయిల్ రావడానికి సహకరించారు. ఇప్పుడు ఏకంగా అనంతబాబుకి సన్మానాలు, ఊరేగింపులు చేస్తున్నారు. దళితుడిని చంపిన అనంతబాబు మీటింగులు పెడుతున్నాడు. ఇప్పుడు మీకో క్విజ్ పెడతాను. జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాష్ కి కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి.
మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించాడనికి. నాలుగో ఆప్షన్. ఆల్ ది ఎబోవ్. ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. చెల్లిపై నిందలు వేసింది ఎవరు? జగన్. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర. జగన్ ఒక కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా పెడతాడో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, చిక్కుడు ధర రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే స్టిక్కర్ ఇంటికి కాదు… కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా వెయ్యాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది.
రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది.
మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు. నాలుగో సింహం ఎందుకు సైలెంట్ గా ఉంది. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం.
జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. సింహపురిలో నేను సింహంలా అడుగుపెట్టా. అడుగుపెట్టనివ్వం అన్న వాళ్లు అడ్రస్ లేరు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసా. 31 రోజులు, 460 కిలోమీటర్లు నడిచాను. నన్ను నెల్లూరు ఆదరించింది. ప్రజల కష్టాలు నేరుగా చూసా. మీ కన్నీళ్లు తుడుస్తాను. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు సోమశిల, కండలేరు ప్రాజక్టుల ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. 2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం. ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేదు ఈ సైకో ప్రభుత్వం.
ఒక్క నెల్లూరు టౌన్ లోనే 43 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. 2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు.
నెల్లూరు జిల్లాని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. సిల్లీ బచ్చా అవినీతి ఆధారాలతో సహా బయటపెట్టా. దాంతో సిల్లీ బచ్చా సైలెంట్ అయ్యాడు. 2024 లో 10 కి 10 సీట్లు మాకు ఇవ్వండి… అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. జగన్ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వరి రైతులు నాలుగేళ్లలో రూ.3400 కోట్లు నష్టపోయారు. చంద్రబాబు గారి హయాంలో రూ.20 వేల పెట్టుబడి అయితే జగన్ పాలనలో పెట్టుబడి రూ.40 వేలకు పెరిగింది. జగన్ పాలనలో ధాన్యం కొనడు. కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతుల పెట్టుబడి తగ్గిస్తాం. గిట్టుబాటు ధర కల్పిస్తాం. చంద్రబాబు గారి హయాంలో ఏపీ ఆక్వా రంగంలో నంబర్ 1. జగన్ పాలనలో ఆక్వా రంగం తీవ్ర సంక్షభంలో ఉంది. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసారు, ఫీడ్ ధర పెరిగింది, పరికరాల ధర పెరిగింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులను ఆదుకుంటాం. తక్కువ ధరకే విద్యుత్ అందిస్తాం, ఫీడ్, పరికరాలు తక్కువ ధరకే అందిస్తాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీ తో వైసిపిని గెలిపించారు.
కానీ జరిగింది ఏంటి? జగన్ ఉదయగిరి ప్రజల్ని అవమానించాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని జగన్ అవమానించాడు. నియోజకవర్గం అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ప్యాలస్ బ్రోకర్ సజ్జల కన్ను ఉదయగిరి నియోజకవర్గం మీద పడింది. అందుకే కుట్ర చేసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని బయటకి పంపాడు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాజేసేందుకు భారీ స్కెచ్ వేసాడు. బినామీల పేరు మీద సేకరిస్తున్నాడు. ఏకంగా దీని కోసం ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాడు అంట. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన భూ అక్రమాల పై సిట్ వేస్తాం. ప్యాలస్ బ్రోకర్ సజ్జల, అతని బినామీలు కొట్టేసిన భూములు వెనక్కి తీసుకొని పేదలకు పంచేస్తాం. ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పేదలకు ఇళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడి భవనాలు, పంచాయతీ భవనాలు నిర్మాణం చేసింది టిడిపి. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ పేషేంట్స్ కోసం మెరుగైన ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఉదయగిరి టౌన్ లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిని మోడల్ టౌన్ గా అభివృద్ధి చేస్తాం.
సాగు, తాగు నీరు అందించేందుకు వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల నార్త్ కెనాల్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం పూర్తిచేస్తాం. ఉదయగిరిలో షాదీ మంజిల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తాం. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. వెంగమాంబ ఆలయం, సిద్దేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేస్తాం. వింజమూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో బత్తాయి, పసుపు రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఉదయగిరి కి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. బాబు అంటే బ్రాండ్…. జగన్ అంటే జైలు. కియా, ఫాక్స్ కాన్ బాబు గారి బ్రాండ్లు. బూమ్, బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ జగన్ బ్రాండ్లు. ఉదయగిరిలో టిడిపి జెండా ఎగరేయండి. టిడిపి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు నా బాధ్యత. టిడిపి నాయకులు, కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. భయం నా బయోడేటా లో లేదు. తగ్గేదేలేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.