• ఉదయగిరి నియోజకవర్గం నేకునంపేట తూర్పుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి, మేమంతా వ్యవసాయంపై మేం అధారపడి జీవిస్తున్నాం.
• రెణమాల ట్యాంక్ గా పిలిచే చెరువు చెరువు కింద 1,300 ఎకరాల్లో వరి, పత్తి పంటలు పండిస్తున్నాం. ఈ చెరువుకు నీరు అందించాలి.
• కొండాపురం టు కొమ్మి రోడ్డులోని పార్లపల్లి వరకు రోడ్డు వేయాలి.
• దీనివల్ల 10కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రవాణా సౌకర్యం సులభమవుతుంది.
• తూర్పుపాళెం నుండి రెణమాల వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
• గత నాలుగేళ్లుగా గ్రామీణరోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
• గత టిడిపి హయాంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణరోడ్లు, పుంతరోడ్ల నిర్మాణం చేపడతాం.
• రెణమాల చెరువుగు సాగునీరు అందజేసి, రైతుల కష్టాలు తొలగిస్తాం.