ఉద్వేగానికి గురైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
పెండింగ్ పనుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటుతో రుణం తీర్చుకుంటానన్న లోకేష్
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లో రాళ్లపాడు ప్రాజెక్టువద్ద యువనేత నారా లోకేష్ ఘనంగా వీడ్కోలు పలికారు.
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోవూరు ఇన్ చార్జి దినేష్ రెడ్డి, ఉదయగిరి ఇన్ చార్జి బొల్లినేని రామారావు, పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కైవల్యారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్, బీద గిరిధర్, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు యువనేతకు వీడ్కోలు పలికారు.
యువనేత లోకేష్ ఉమ్మడి నెల్లూరు జిల్లాను వీడుతున్న సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు.
పార్టీ సీనియర్ నేతలను హత్తుకొన్న యువనేత లోకేష్ జిల్లాలో టిడిపి జెండా రెపరెపలాడించాలని కోరారు.
నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు.
31రోజులపాటు తనను కుటుంబసభ్యుడి మాదిరిగా ఆదరించి ఆతిధ్యమిచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలకు యువనేత లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా రుణం తీర్చుకుంటానని చెప్పారు.