చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎక్కడున్నా.. తెలుగుజాతి ఒక్కటే

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Jan 4, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎక్కడున్నా.. తెలుగుజాతి ఒక్కటే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రపంచ ప్రథమస్థానంలో తెలుగుజాతిని నిలపాలి
  • 2047నాటికి నెరవేర్చాలన్నది నా ఆకాంక్ష..
  • ఏపీ అభివృద్ధి ఉద్యమానికి చేతులు కలపండి
  • తల్లిని గౌరవించినట్టే భాషనూ గౌరవించాలి
  • తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్‌..
  • ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే పేదరికంలేని సమాజ స్థాపన
  • ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని, 2047నాటికి ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా తెలుగుజాతి నిలవాలన్నదే తన ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ స్పూర్తితో పేదరికంలేని సమాజం సాధిస్తామన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రపంచంలోని తెలుగువారందరినీ ఒకే వేదికపై చూడటం సంతోషంగా ఉంది. తెలుగువారి గౌరవాన్ని చాటిచెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తోన్న తెలుగు మహాసభలను ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడం మనకు గర్వకారణం. డీవీఎస్‌ రాజు, ఇందిరాదత్‌ సహా ప్రముఖులు సభలకు ఎనలేని సేవలందించారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్‌ వరకూ.. శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకూ ఎక్కడున్నా తెలుగువారంతా ఒకటే. ఏపీ, తెలంగాణలోనే కాదు… అమెరికా సహా ఏ దేశంలో చూసినా మన తెలుగువారే. బ్రెయిన్‌ డ్రెయిన్‌… బ్రెయిన గెయిన్‌ అవుతుందని నేను 1996లో ముఖ్యమంత్రి అయ్యినప్పుడే చెప్పాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికంటే విదేశాల్లో ఉన్న తెలుగువారే భాషా, సంప్రదాయాలను కాపాడుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధిని నేను ఆనాడే ఊహించా
‘1996లో నేను సీఎం అయినప్పుడు ఈ ప్రాంతమంతా రాళ్లు, రప్పలు. ఇది ప్రపంచంలోనే ఐటీ సిటీగా తయారవుతుందని ఆనాడే ఊహించాను. హైదరాబాద్‌ అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఉంది. దేన్నయినా ముందే ఊహించగలగాలి. 96లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నెలనెలా జీతాలు ఇవ్వలేక మూడునెలలకు ఒకసారి ఇచ్చేవాళ్లం. నేను విజన్‌ 2020 అన్నప్పుడు అందరూ ఎగతాళి చేశారు. తెలుగు ఏంజిల్స్‌ అనే స్టార్టప్‌ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మనమంతా సమష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలం. నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది’ అని చంద్రబాబు గుర్తు చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-12-2025

రైతు బిడ్డను..వారికి నష్టం జరగనివ్వను

నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక పురస్కారం

ప్రపంచమంతటా తెలుగువారు రాణిస్తున్నారు
‘సత్య నాదెళ్ల హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన వ్యక్తి. నేడు మైక్రోసాఫ్ట్‌ అధినేతగా తయారయ్యాడంటే అదీ మన తెలుగువారి శక్తి. దేశానికి దశ, దిశ చూపిన పీవీ మన తెలుగు బిడ్డ. 1996లో నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికే పీవి నరసింహారావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన సంస్కరణలను అందిపుచ్చుకుని ముందుకెళ్లాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ తిండిపెడుతుందా? సెల్‌ఫోన్‌లు ఉపయోగమా? అని ఎగతాళి చేశారు. యువత టెక్నాలజీని అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలుగా రాణించారు. ప్రపంచంలో అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది మన తెలుగువారే. ఏదేశంలోనైనా ఖరీదైన ప్రాంతానికి పోతే అక్కడ మన తెలుగు మాట్లాడేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2023-24లో 3 లక్షల 30 వేలమంది భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లగా అందులో లక్షా 80 వేలమంది తెలుగువారే. అమెరికాలో 12వ భాష తెలుగు. మున్ముందు అన్ని దేశాల్లో తెలుగు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. యువత అవకాశాలు కోసం విదేశాలు వెళ్లారు. అయితే ఏ దేశంలోనైనా మనకు ఆమోదం రావాలంటే అక్కడి ప్రజలకు మనం సేవలు అందించాలి. అదే సమయంలో జన్మభూమిని మర్చిపోకూడదు.

కర్మభూమికి కూడా సేవలు చేయాలని కోరుతున్నా. నేడు ఏఐ, డీప్‌ టెక్నాలజీ యుగం నడుస్తోంది. ప్రతి ఇంటికీ ఒక ఐటీ ఉద్యోగి ఉండాలి. ప్రతి ఇంట్లో ఎటర్‌ప్రెన్యూర్‌ రావాలి. నేను సింగపూర్‌ పర్యటనలో ఒక మాట చెప్పాను. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బు సంపాదిస్తే వాటిని మళ్లీ ఉపాధి కల్పనకు ఉపయోగించాలని పిలుపునిచ్చాను. ఆనాడు హైదరాబాద్‌లో ఒక మంచి కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టాలనుకుని దుబాయ్‌ ప్రభుత్వాన్ని సంప్రదించాను. ఇక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌ కడితే ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌లో విల్లాస్‌ కట్టేందుకు అనుమతి ఇస్తానని హామీ ఇచ్చాను. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నేను ఇలాంటివి తెచ్చాను. ఐటీ అభివృద్ధి కోసం హైటెక్‌ సిటీ కట్టాను. ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చాను. ఏపీ, తెలంగాణలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారందరూ పరస్పరం సహకరించుకోవాలి. పేదరికంలేని సమాజం మన లక్ష్యం కావాలి. భారత్‌ బయోటెక్‌ ఎల్లా కృష్ణ ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్‌ తయారుచేశారు. మన ప్రధాని 90 దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారంటే అది హైదరాబాద్‌ నుంచి తయారుకావడం గర్వకారణం. పీపీపీ విధానంలో సంపద సృష్టించవచ్చు. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీ జనాభా గ్రోత్‌ రేట్‌ 1.5శాతం. దక్షణ కొరియా .5శాతంగా ఉంది. జపాన్‌, చైనా, ఐరోపావంటి దేశాల్లో జనాభా తగ్గింది. ఇండియానుంచి మనుషులను పంపమని జర్మనీలాంటి దేశాలు కోరుతున్నారు. నీటి భద్రత, కరువు నివారణ కోసం గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు చేపట్టాము. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతోపాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టాను. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి పెట్టాను. స్వచ్చాంధ్రప్రదేశ్‌ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నాము. భవిష్యత్‌లో డీప్‌ టెక్నాలజీదే హవా. వాట్సప్‌ గవర్నెన్స్‌ తీసుకొస్తున్నాం. ఆఫీస్‌కు రాకుండా 150 సర్వీసులు ఇంటి నుంచే అందించే సౌలభ్యం తీసుకొస్తున్నాం’ అని వివరించారు.

తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవలు చేసిన మహానుభావులు
ప్రపంచంలోనే తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్‌. పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించాడు. తెలుగుభాషకు వన్నె తెచ్చిన గిడుగు రామ్మూర్తి, తెలుగు భాషా వికాసానికి రామోజీరావువంటి వారిని ఈ సందర్భంగా స్మరించుకోవాలి. పీవీ నరసింహారావు, వెంకయ్యనాయుడు, కోకా సుబ్బారావు, జస్టిస్‌ రమణ, నీలం సంజీవరెడ్డి, బాలయోగివంటి తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణించారు. కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్‌, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవి సింధు, పెండ్యాల హరికృష్ణ, వెంకటపతి రాజు, నితీష్‌ కుమార్‌ రెడ్డి వంటి తెలుగువారు ఎందరో క్రీడాకారులు తమ ప్రతిభ చాటారు. చెన్నైనుంచి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమను తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశాము. నేడు తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరింది. కూచిపూడి భరతనాట్యం, బతుకమ్మ మన సంస్కృతికి అద్దంపడుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పలువురు ప్రముఖులను సన్మానించిన సీఎం చంద్రబాబు
వివిధరంగాల్లో నిష్ణాతులైన తెలుగువారికి బిజినెస్‌ అవార్డులను సీఎం చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా వరల్డ్‌ తెలుగు ఫెడరేషన్‌ సావనీర్‌, తెలుగు ఏంజిల్స్‌ పేరుతో స్టార్టప్‌ లోగోను చంద్రబాబు లాంచ్‌ చేశారు.

Previous Post

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌..మారనున్న రూపురేఖలు

Next Post

అభివృద్ధికి ఆకాశ బాట

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-12-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-12-2025

కార్యకర్త
@ December 15, 2025
రైతు బిడ్డను..వారికి నష్టం జరగనివ్వను
ఆంధ్రప్రదేశ్

రైతు బిడ్డను..వారికి నష్టం జరగనివ్వను

చైతన్యరధం
@ December 15, 2025
నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక పురస్కారం
ఆంధ్రప్రదేశ్

నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక పురస్కారం

చైతన్యరధం
@ December 15, 2025
నేడు శంషాబాద్‌ లోని కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

నేడు శంషాబాద్‌ లోని కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ December 15, 2025
స్మార్ట్‌ టెక్నాలజీతో సేవల్లో వేగం, పారదర్శకత
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్‌ టెక్నాలజీతో సేవల్లో వేగం, పారదర్శకత

చైతన్యరధం
@ December 15, 2025
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ December 15, 2025
జగన్‌ అరాచక పాలనలో..ఏటిగట్లను గాలికొదిలేశారు
ఆంధ్రప్రదేశ్

జగన్‌ అరాచక పాలనలో..ఏటిగట్లను గాలికొదిలేశారు

చైతన్యరధం
@ December 15, 2025
అవుకు రిజర్వాయర్‌ లీకేజీలు అరికడతాం
ఆంధ్రప్రదేశ్

అవుకు రిజర్వాయర్‌ లీకేజీలు అరికడతాం

చైతన్యరధం
@ December 15, 2025
Load More

ముఖ్య వార్తలు

విద్య ఎంత ముఖ్యమో..విలువలు కూడా అంతే ముఖ్యం

విద్య ఎంత ముఖ్యమో..విలువలు కూడా అంతే ముఖ్యం

చైతన్యరధం
@ December 14, 2025
కాగ్నిజెంట్‌ రాక.. చారిత్రక మైలురాయి

కాగ్నిజెంట్‌ రాక.. చారిత్రక మైలురాయి

చైతన్యరధం
@ December 13, 2025
ఐటీ డెస్టినేషన్‌ కేంద్రంగా విశాఖ

ఐటీ డెస్టినేషన్‌ కేంద్రంగా విశాఖ

చైతన్యరధం
@ December 13, 2025
ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీ

ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీ

చైతన్యరధం
@ December 11, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతు బిడ్డను..వారికి నష్టం జరగనివ్వను

రైతు బిడ్డను..వారికి నష్టం జరగనివ్వను

చైతన్యరధం
@ December 15, 2025
నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక పురస్కారం

నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక పురస్కారం

చైతన్యరధం
@ December 15, 2025
నేడు శంషాబాద్‌ లోని కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

నేడు శంషాబాద్‌ లోని కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ December 15, 2025
స్మార్ట్‌ టెక్నాలజీతో సేవల్లో వేగం, పారదర్శకత

స్మార్ట్‌ టెక్నాలజీతో సేవల్లో వేగం, పారదర్శకత

చైతన్యరధం
@ December 15, 2025
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist