చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

ఎమ్మెల్యే గళ్ళా మాధవి

by చైతన్యరధం
October 24, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారం కోసం నాడు ‘అక్కాచెల్లెమ్మలు’ అంటూ ఓట్లు వేయించుకుని.. నేడు సొంత కుటుంబానికే అన్యాయం
  • మేనకోడలి పెళ్లిని సైతం అడ్డుకోవడం మేనమామ లక్షణం కాదు.. కంస మామ వైఖరి
  • నాడు ప్రజలను కలవకుండా పరదాలు కట్టుకున్న వ్యక్తి.. నేడు పెళ్లికి అపరిచిత వ్యక్తులు వస్తారని సాకులు
  • పేర్ని నాని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. తప్పును సమర్థిస్తే రేపు సొంత కుటుంబంలోనే గౌరవం దక్కదు
  • చంద్రబాబు కలుపుగోలు రాజకీయాలు చేస్తుంటే.. జగన్ ‘విభజించు-పాలించు’ పద్ధతిని నమ్ముకున్నారు

నాయకత్వం అంటే మైకుల ముందు నిలబడి ఆర్భాటపు ప్రసంగాలు ఇవ్వడం, ప్రెస్ మీట్లలో గొప్పలు చెప్పుకోవడం కాదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. అధికారం, కుర్చీల కోసం కొట్లాడే రాజకీయ యుద్ధాలు నాయకత్వం అనిపించుకోవని, అత్యంత క్లిష్టమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవస్థలను గౌరవిస్తూ, బాధ్యతతో వ్యవహరించి సరైన విధానంతో ముందుకు సాగడమే నిజమైన నాయకత్వ లక్షణమని ఆమె పేర్కొన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ పనితీరును శంకిస్తూ కేంద్ర బలగాలు రావాలని, స్ట్రాంగ్ రూమ్‌లు పెట్టాలని, తమ అభ్యర్థులకు విపరీతమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేయడం జగన్ అవివేకానికి నిదర్శనం.

వ్యవస్థల మీద కనీస గౌరవం లేకుండా మాట్లాడే ఆయన, నేడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలను సైతం తమ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారు. సమయం చాలక లేదా ఇతర కారణాల వల్ల ఎవరైనా నామినేషన్లు వేయలేకపోయి ఉంటే వారికి అదనంగా మూడు రోజుల సమయం ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ వెసులుబాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి ప్రతి రాజకీయ పార్టీకి సమానంగా వర్తిస్తుంది. కోర్టు ఇచ్చిన సాధారణ గడువును తమ పార్టీ కోసమే ప్రత్యేకంగా ఇచ్చినట్టు, తమ ఆరోపణలను కోర్టు ధ్రువీకరించినట్టు జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కేవలం తమ పార్టీ వాళ్లతో నామినేషన్లు వేయించలేదనే నెపంతో నిరాధార ఆరోపణలు చేసి, ఇప్పుడు ‘ప్రజాస్వామ్యం గెలిచింది’ అంటూ సంబరపడటం అత్యంత హాస్యాస్పదమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎద్దేవా చేశారు.

సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర అక్కచెల్లెమ్మలకు ఏం చేస్తారు?

నైతికత, ప్రజాస్వామ్యం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక నాయకుడి మాటల కంటే, ఆయన అనుసరించే విధానాలు, వ్యక్తిత్వమే ఆయన ఎలాంటి వాడో తెలియజేస్తాయని ఆమె అన్నారు. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు శత్రువులైనా సరే పిలవడానికి వస్తే ఆహ్వానాన్ని గౌరవించి, ఆశీర్వదించి పంపడం మన తెలుగు సంస్కృతి, భారతీయ సాంప్రదాయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆయన వ్యవహార శైలి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఎవరి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా, స్వయంగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రజాస్వామ్యం,మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు దంచే నాయకుడు కాబట్టే ఆయన ద్వంద్వ వైఖరిని ప్రశ్నించాల్సి వస్తోంది. బయట సమాజంలో మహిళల ఆత్మగౌరవం, హక్కుల గురించి నీతులు చెప్పే జగన్.. తన సొంత చెల్లి, సొంత మేనకోడలి విషయంలో మాత్రం అత్యంత బాధింపజేసేలా ప్రవర్తిస్తున్నారు. ఆస్తిలో సమాన హక్కు ఉండాలని తండ్రి ఆశించినా, తన చెల్లి షర్మిల గారు స్వయంగా ప్రతి గడప తొక్కి తన కూతురి పెళ్లి ఫలానా చోట జరుగుతుందని శుభలేఖలు పంచుతుంటే..

ఆ నిర్ణీత స్థలంలో పెళ్లి జరగడానికి వీల్లేదని, తాను ఒప్పుకోనని కన్నతల్లితోనే రాయబారాలు నడిపించడం ఎంతవరకు సమంజసం? ఎంతటి శత్రువైనా ఇంటికి వచ్చి శుభకార్యానికి కార్డు ఇస్తే దీవించడం మన సంస్కారం. కానీ సొంత మేనకోడలి శుభకార్యం విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆయన మనస్తత్వం ఏంటో స్పష్టమవుతోంది. ఎన్నికల ప్రచారాల్లో “మీరంతా నా అక్కచెల్లెమ్మలు, మీకు అండగా ఉంటాను, మీకు అన్ని హక్కులూ కల్పిస్తాను” అంటూ వేదికలపై నమ్మబలికి ఓట్లు వేయించుకున్న వ్యక్తి జగన్. సొంత చెల్లికి హక్కుగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా, ఆమె బిడ్డ పెళ్లి విషయంలో కూడా అడ్డంకులు సృష్టించే ఒక వ్యక్తి.. రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తారని నమ్మడం ప్రజలను మోసం చేయడమే. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ, సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి.. బయటకొచ్చి ప్రజాస్వామ్యం, నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు.

జగన్‌కు అక్కచెల్లెమ్మలంటే ఓట్ల మాటే తప్ప ప్రేమాభిమానాలు లేవు.. మేనమామ కాదు కంసమామ

ఎన్నికల సమయంలో ప్రజలను బురిడీ కొట్టించడానికి ‘నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు’ అని పిలవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం ఒక రాజకీయ ప్రసంగం మాత్రమేనని, అందులో ఎలాంటి నిజమైన ప్రేమాభిమానాలు లేవని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రంగా మండిపడ్డారు. సొంత కుటుంబంలో ఆయన వ్యవహరిస్తున్న కర్కశ విధానాలే అందుకు నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, పార్టీని భుజాన మోసి ఆయన్ను రాజకీయంగా నిలబెట్టిన సొంత చెల్లెలు షర్మిల గారిని, అలాగే అండగా నిలిచిన కన్నతల్లిని అధికారం రాగానే కాళ్లతో తన్ని పక్కన పడేశారు. అవసరం తీరిపోయాక వదిలేయడం ఒక ఎత్తైతే, ఏకంగా తీవ్రమైన ద్రోహానికి ఒడిగట్టడం జగన్ నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో పిల్లలందరికీ ‘నేను మీ జగన్ మామను’ అని చెప్పుకునే జగన్, సొంత మేనకోడలి జీవితాన్ని, భవిష్యత్తును ఎలా మర్చిపోతారు? ఒక మనిషి జీవితంలో పెళ్లి, ఇల్లు కట్టుకోవడం మళ్లీ మళ్లీ రాని అతిపెద్ద శుభకార్యాలు. అలాంటిది ఆ అమ్మాయి ఒక మంచి ఘడియల్లోకి అడుగుపెడుతుంటే ఆశీర్వదించాల్సింది పోయి, ఆ శుభకార్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. జగన్ వ్యవహారం మేనమామలా కాకుండా కంసమామలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక ముఖ్యమంత్రికి భార్యగా, మరొక ముఖ్యమంత్రికి తల్లిగా గౌరవం పొందాల్సిన విజయమ్మ గారు, నేడు సొంత కొడుకు పెట్టిన కష్టాలతో పరాయి ఇంట్లో తలదాచుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని జగన్ కల్పించారు. కన్నతల్లికే గూడు లేకుండా చేసి క్షోభకు గురిచేసిన వ్యక్తిత్వం ఆయనది. మహిళల ఆత్మగౌరవం కోసం, వారి ఆర్థిక స్వావలంబన కోసం ఆనాడే ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు పరిపాలించిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రంలో సొంత చెల్లికి దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ, మహిళా సాధికారత గురించి జగన్ ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదం. ఎదుటివారిపై నిరంతరం బురదజల్లుతూ, కక్షలు-కార్పణ్యాలతోనే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూసే జగన్‌కు పరిపక్వత గానీ, సమన్వయ ఆలోచన గానీ లేవు. కేవలం కుర్చీ కోసం, అధికారం కోసం సొంత కుటుంబాన్నే రోడ్డుకీడ్చిన ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి నాయకుడిగా ఉండటానికి ఏమాత్రం అర్హుడు కాదని, ఆయన చర్యలు రాష్ట్రానికే చేటని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

కుటుంబాలను కలిపేది కూటమి ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని ముక్కలు చేసేది జగన్
సొంత ఇంటి ఆడబిడ్డలకే గౌరవం ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి, ఆయనను సమర్థిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతున్న తీరు అత్యంత సిగ్గుచేటని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను, పార్టీ తీరును ఆమె ఎండగట్టారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏకంగా తిరుమల సెట్టింగ్ వేయించుకుని ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు రాని సెక్యూరిటీ సమస్యలు, అపరిచిత వ్యక్తుల అంశం.. సొంత మేనకోడలి పెళ్లికి మాత్రమే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. చెల్లెలికి బంధువులైన వారు జగన్‌కు కూడా బంధువులేనన్న కనీస ఇంగితాన్ని పేర్ని నాని మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను కలవడానికి పరదాలు కట్టుకుని తిరిగిన మనస్తత్వం కాబట్టే, సొంతింట్లో జరిగే పెళ్లిని కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ అహంకారాన్ని, కంసమామ పోకడలను సమర్థిస్తూ మాట్లాడితే పేర్ని నానిని రేపు ఆయన సొంత కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటారని హెచ్చరించారు. తప్పును తప్పుగా ప్రశ్నించే ధైర్యం లేకపోతే సొంత ఇంట్లోనే గౌరవం దక్కదని హితవు పలికారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నాలుగు కుటుంబాలను కలుపుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తుంటే, జగన్ మాత్రం ఉన్న కుటుంబాన్నే నాలుగు ముక్కలు చేస్తున్నారని విమర్శించారు.

“విభజించు–పాలించు, బురదజల్లు–పైకెదుగు” అనే దుర్మార్గమైన ఆలోచనతో సాగే జగన్ వంటి వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని తేల్చిచెప్పారు. “ఈగో ఈజ్ ఫైనల్” అన్నట్లుగా ప్రవర్తిస్తూ అందరినీ దూరం పెట్టి తానే గొప్ప అనుకునే వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. అమరావతి విషయంలోనూ ప్రజలను విభజించిన చరిత్ర ఆయనదని గుర్తుచేశారు. జగన్ మాట్లాడే మాటల్లో కేవలం ఓట్ల యావ, కుర్చీ పిచ్చి మాత్రమే కనిపిస్తుందని, మహిళల పట్ల ఆయనకు ఎలాంటి ప్రేమా, గౌరవమూ లేవని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో చిన్నపాటి విభేదాలు ఉన్నా పట్టువిడుపులు సహజం. కానీ, తనకు వత్తాసు పలకలేదన్న ఏకైక కారణంతో కన్నతల్లిని, తోబుట్టువును దూరం పెట్టి, చివరికి మేనకోడలి పెళ్లిని సైతం జరగకుండా అడ్డుకోవడం అత్యంత నీచమైన చర్య. ఇది యావత్ రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. అధినేత ఇంట్లోనే మహిళలకు రక్షణ, మర్యాద లేనప్పుడు క్రింది స్థాయి నాయకులు ఆడవారిని గౌరవిస్తారని ఎలా ఆశిస్తాం? కృష్ణా జిల్లాతో పాటు పలుచోట్ల వైసీపీ నాయకులు ఆడవారిని వేధిస్తున్నా జగన్ ప్రోత్సహించడమే తప్ప చర్యలు తీసుకోరు. మరీ దారుణంగా.. మహిళా నేత శ్యామల, మాజీ మంత్రి రోజా కూడా ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం. సొంత కుటుంబానికే రక్షణ, న్యాయం ఇవ్వలేని జగన్‌కు రాష్ట్రంలో ‘మామ’ అనిపించుకునే అర్హత గానీ, ‘అన్న’ అని పిలిపించుకునే నైతిక హక్కు గానీ లేవని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

Next Post

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

November 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

November 5, 2026
సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

November 5, 2026
జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

November 5, 2026
అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం
ఆంధ్రప్రదేశ్

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

November 5, 2026
కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి

November 5, 2026
Next Post
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

by కార్యకర్త
November 6, 2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

by కార్యకర్త
November 5, 2026

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

by చైతన్యరధం
November 5, 2026

ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారని ప్రశంస అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోను చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి...

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

by చైతన్యరధం
November 5, 2026

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలి కూటమి పార్టీల ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): గురువారం జరగబోయే జిల్లా పరిషత్,...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.