• వెంకటగిరి నియోజకవర్గం ఓబులాయపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కండలేరు జలాశయం క్రింద సుమారు 19 గ్రామాలు ముంపుకు గురయ్యాయి.
• 1985 నుండి 1989 వరకు నష్టపరిహారం కల్పించారు.
• 1990-1993 సంవత్సరాల్లో ఇంటి నివేశన స్థలాలకు నష్టపరిహారం కల్పించారు.
• ముంపులో ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని జీఓ ఇచ్చారు.
• కానీ 10 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించలేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాం.
• మా గ్రామంలో ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సివస్తోంది.
• మరికొంత మంది ప్రభుత్వ భూమిని చదును చేసుకుని వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ఈ భూములకు పట్టాలు ఇప్పించాలి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
• అధికారంలోకి వచ్చాక కండలేరు జలాశయాన్ని భూములిచ్చిన రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చాం.
• స్వయం ఉపాధి రుణాలు అందజేసి ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నివారిస్తాం.
• ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ నిబంధనలు, గత ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.