- వరద ప్రాంతాల్లో ముందుండి చంద్రబాబు సేవలు
- మహిళలకు కష్టమనేదే రాకుండా జాగ్రత్తలు
- ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలు తెప్పించి పంపిణీ
- పాడైన గ్యాస్ సిలిండర్లకు మెకానిక్‌లతో మరమ్మతులు
- నాడు గోదారి వరదల్లో మహిళలను వదిలేసి జగన్‌రెడ్డి దాష్టీకం
- నేడు బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని బురద రాజకీయం
- ప్రభుత్వంపై అడ్డగోలుగా విషప్రచారాలు చేయిస్తూ సైకో చేష్టలు
- ముంపు ప్రాంతాల్లో ఎటువంటి సహాయం చేయని వైసీపీ నేతలు
అమరావతి(చైతన్యరథం): పౌర హితం, సంక్షేమం కోరి పాలించడం నాయకుడి లక్షణం. 40 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన చంద్రబాబు ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారు. విశాఖలో హుద్‌హుద్ తుఫాన్ సందర్భంగా ఆయన సహాయక చర్యల్లో ముందుండి నడిపించారు. అదే అనుభవంతో నేడు విజయవాడ వరద ప్రాంతాల్లో సహా యక చర్యలు అందించడంలో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. దాని కృషి ఫలితమే నేడు వరద ప్రభావిత ప్రాంతాలు కోలుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వంపై నగర ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్‌రెడ్డి బురద రాజకీయాలకు తెరలేపుతూ విష ప్రచారాలకు తెరతీశాడు. ప్రభుత్వంపై అబద్ధాలు వెళ్లగక్కుతూ తన సైకో మనస్తత్వాన్ని చాటుకున్నాడు.
మహిళలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు
వరద ప్రాంతాల్లో మహిళల కష్టాలు చెప్పనలవి కానివి. దీనిని దృష్టిలో పెట్టుకుని మరీ ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలు అభినందనీయం. ముంపు ప్రాంతాల్లో పూర్తిగా ఇళ్లు మునిగిపోయిన నిరాశ్రయులైన మహిళలను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇళ్లలో మహిళలు ఇబ్బంది పడకుండా నిత్యావసర వస్తువు లతో కూడిన కిట్ల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పు, కిలో చక్కెర, 2 కిలోల బంగాళాదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నారు. మహిళలు ఇబ్బంది పడకుండా ఇళ్ల దగ్గర పేరు కుపోయిన బురద తొలగింపు పనులు వేగంగా చేయిస్తున్నారు.
కష్టాలను కళ్లారా చూసి అప్పటికప్పుడే వస్త్రాలు
భవానీపురం, ఊర్మిళా నగర్, కబేలా సెంటర్, డాబా కొట్టు సెంటర్లలో పర్యటన సందర్భం గా తాము పడుతున్న ఇబ్బందులను మహిళలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షా లకు ఇళ్లలో దుస్తులు చీకిపోయి పాడైపోయాయని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. వెంటనే అక్కడిక్కడే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలు తెప్పించి స్త్రీలకు పంపిణీ చేయించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు పాడైన గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సర్వీస్ చేసేందుకు మెకానిక్‌లు ముం దుకు రాగా ఆ పనులూ చకచకా జరుగుతున్నాయి. తెలుగు మహిళా కమిటీ సభ్యులు వారంరోజులుగా వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆహార పదార్థా లు, తాగునీరు, చీరలు, దుప్పట్లను పునరావాస కేంద్రాల్లోని వారికి అందిస్తున్నారు.
బాధితులను గోదాట్లో వదిలేసిన జగన్‌రెడ్డి
చంద్రబాబు వరద బాధితుల కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటే బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని అసత్య ప్రచారం చేయిస్తున్నాడు. 2021లో అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకు పోయిన ఘటనలో 33 మందిని బలితీసుకున్న సైకో 2022లో గోదావరి వరద బాధితు లను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. నాడు ప్రజలకు గోదావరి వరదల వల్ల వచ్చిన కష్టాల కంటే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల వచ్చిన కష్టాలే ఎక్కువయ్యా యి. ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వం నుంచి సరైన సాయం అందక ఇబ్బందులు పడు తుంటే కనీసం పట్టించుకోలేదు. వరదల్లో చిక్కుకుని నిలువ నీడ కోల్పోయిన మహిళలను పునరావాస కేంద్రాలకు కూడా సరిగా తరలించలేదు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందించలేదు. అర కిలో బంగాళా దుంపలు, పావు కిలో టమోటాలు చేతిలో పెట్టి దులిపే సుకున్నాడు. వరద బాధితులను గాలికొదిలేసిన జగన్‌రెడ్డికి పదిరోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న చంద్రబాబును విమ ర్శించే హక్కు ఎక్కడిది? అని ప్రజలే వారిని ప్రశ్నిస్తున్నారు.