- అవధుల్లేని మంత్రి సత్యనారాయణ దోపిడీ
- యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జా
- మద్యం మాఫియా మొత్తం మంత్రి కనుసన్నల్లోనే
- ప్రతి పనికీ ఒక రేటు
- గనులను మింగిన ఘనుడు
- టీడీఆర్ బాండ్లలోనూ చిలక్కొట్టుడు
- మంత్రి దోపిడీ రూ. 800 కోట్లపైనే
- లేఅవుట్ వేస్తే ఎకరానికి రూ.10 లక్షలు
- అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తే రూ.50 లక్షలు
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు రూ.5 నుంచి రూ.10 లక్షలు
- పోలీసు పోస్టింగులకు ఎస్‌ఐకి రూ.10 లక్షలు, సీఐ రూ.15 లక్షలు
- రిజిస్ట్రార్ పోస్టింగులకు రూ.25 లక్షలు
- యూనివర్సిటీల్లో పోస్టుల అమ్మకం.. ఒక్కో పోస్టుకు రూ.15 లక్షలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గమంటే తెలుగు రాష్ట్రా ల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మామిడి తోటలకే కాదు.. అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన నియోజకవర్గం. ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్టీకల్చర్ యూనివర్సిటీ..ఇంకా ఎన్నో ఉన్నాయి.నేడు అటువంటి నియోజకవర్గంలో మంత్రి కొట్టు సత్యనారా యణ మండలానికో అవినీతి కొట్టు తెరిచారు. అందిన దీ మనదే.. అందనిదీ మనదే అన్న రీతిలో యథేచ్ఛగా దోపిడీ సాగించి ఈ అయిదేళ్లలో అక్షరాలా రూ.800 కోట్ల అవినీతి సంపదను మంత్రి కొట్టు సత్యనారాయణ వెనకేశారు.
నియోజకవర్గంలో ల్యాండ్,శాండ్, లిక్కర్ మాఫియా మొత్తం మంత్రి కొట్టు సత్యనారాయణ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రితోపాటు ఆయన బంధువులు, అను చరులు చేసిన అవినీతి దందా లెక్కిస్తే అయిదేళ్లలో రూ.1500కోట్లమేర సంపాదన వెనకేసినట్లు అంచనా.
ఇళ్ల పట్టాల పేరుతో దందా
ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దందా చేయని వైసీపీ నేతలు లేరు. కొట్టు సత్యనారాయణ వాళ్లందరి కంటే మరో అడుగు ముందుకేసి ఇళ్ల పట్టాలిచ్చే ప్రాం తాలను ముందుగానే గుర్తించి వందల ఎకరాల భూము లను బినామీల పేరుతో కొనుగోలు చేశారు. ఆ భూము లను తిరిగి ప్రభుత్వానికి అధిక రేట్లతో అమ్ముకోవడం తోపాటు తన భూములు పెరిగేలా పథకం రూపొందిం చి అమలు చేశారు. జగనన్న కాలనీల్లో మట్టి పూడికకు తాడిపూడి కాలువ గట్టును కూడా తవ్వేసి అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తం ఈ దందాలో రూ.70 కోట్ల మేర వెనకేశారు.
ప్రతిదానికీ ఒక రేటు
ఇలా నియోజకవర్గంలో ప్రతిపనికీ ఒక రేటు పెట్టి తన అనుచరులతో పెద్దఎత్తున దందా కొనసాగిస్తున్నారు.
అసైన్డ్ భూముల కబ్జా
నియోజకవర్గంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, అసైన్డ్‌దారులను బెదిరించి వందల ఎకరాల భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. మంత్రి అండదండల తో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి దళితుల భూము లకు రక్షణ లేకుండా చేశారు. దళితుల భూముల్లో అక్ర మంగా మట్టి తవ్వకాలు చేయడం వంటివి నిత్యకృత్య మయ్యాయి.
గనులను మింగిన ఘనుడు
నియోజకవర్గంలో గనులను, కొండలను కూడా మింగిన ఘనుడు కొట్టు సత్యనారాయణ. మాధవరం గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమ క్వారీలు నిర్వహించి ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చారు.
టీడీఆర్ బాండ్లలో అక్రమాలు
మాస్టర్ ప్లాన్ ప్రకారం సెట్‌బ్యాక్స్ వదిలి 2019లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్న వారి స్థలాలకు టీడీఆర్ బాండ్లు జారీచేసి రూ.90కోట్ల మేర అక్రమాలకు కొట్టు సత్యనారాయణ పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న భూము ల విలువను అధికంగా చూపించి బాండ్ల విలువను పెంచేశారు.కోడేరు`నల్లజర్ల రహదారి విస్తరణకు తీసు కున్న భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. యజమానులకే తెలియకుండా వాళ్ల పేరు మీద కూడా బాండ్లు జారీ చేశారు. ఈ తతంగం మొత్తాన్ని కొట్టు సత్యనారాయణ దగ్గరుండి నడిపారు.
రైతుల్నీ వదల్లేదు
రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతి ఏటా టార్గెట్ పెట్టి ప్రతి మిల్లర్‌కు న్యాయం జరిగేలా లక్ష్యాలను నిర్దేశిస్తుం ది.అంతకుమించి ధాన్యాన్ని సేకరించే అవకాశం లేదు. అదే జాబితాను అధికారులకు కూడా అప్పగిస్తారు.కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అందుకు భిన్నంగా రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కే`ట్యాక్స్ వసూ లు చేసి అటు రైతులకు, ఇటు మిల్లర్లకు తీరనిద్రోహం చేశారు. తనకు నచ్చిన మిల్లర్లకు పెద్ద ఎత్తున ధాన్యం తరలించి మిగతా వారికి మొండిచెయ్యి చూపారు. ఈ దందాలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.
లిక్కర్ మాఫియా
తాడేపల్లిగూడెంలో ఉన్న మద్యంషాపులకు అద్దె నిర్ణ యించడంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఉన్న అద్దె ధరలను రెట్టింపు చేసి ఒక్కో మద్యం షాపు నుంచి సగటున రూ.25వేల వరకు నొక్కేశారు. మద్యం షాపుల అద్దెదందాలో నెలకు రూ.20లక్షలమేర సొమ్ము వెనకేసుకుంటున్నారు.నియోజకవర్గంలోని బార్‌లు కూ డా నెలకు రూ.5లక్షల చొప్పున మామూలు చెల్లించా ల్సిందే. ఈలిక్కర్ దందాలో లెక్కలు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించారని సమాచారం.
భూకబ్జాలు
శ్మశానాల నుంచి కొండల వరకు కబ్జా చేయడంలో కొట్టు సత్యనారాయణ సిద్ధహస్తుడు.చెరువులను పూడ్చి, కొండలను చదును చేసి, ప్లాట్లు వేసి యథేచ్ఛగా అక్ర మాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడలేని పరిస్థితి. విమానాశ్రయ భూముల్లో పట్టాలిస్తానని చెప్పి సుమారు 100 మంది దగ్గర రూ.5 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో 400 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. ఈ భూమి విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. శారదా గ్రంథాలయం, మహాత్మాగాంధీ గ్రంథాలయాన్ని కూడా మింగేశారు. నిట్‌కు ఆనుకున్న ఉన్న భూములను కూడా రికార్డులు మార్చి కుటుంబసభ్యుల పేర మార్చుకున్నారు. మంత్రి భూదందా గురించి నియోజకవర్గంలో ప్రజలు కథకథ లుగా చెప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుం టున్న భూములను కూడా రాత్రికి రాత్రి రికార్డులను మార్చేసి కబ్జా చేసేశారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద షాపింగ్ మాల్ నిర్మిస్తుంటే రూ.4కోట్లు,తాడేపల్లిగూడెంలో సవిత్రాపేటలో షాపింగ్ కాంప్లెక్స్ యాజమాన్యం వద్ద రూ.2 కోట్లు వసూలు చేశారు.ఇవే కాకుండా అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లె క్స్‌లు నిర్మించే యజమానుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కొట్టు సత్య నారాయణ దోపిడీ రూ.800 కోట్ల పైనే ఉంటుందని నియోజకవర్గం మొత్తం గుసగుసలాడుకుంటున్నారు. ఆయన బంధువులు, అనుచరులు వెనకేసుకున్న అవి నీతి సొమ్ము కూడా కలిపితే ఈ మొత్తం రూ.1500 కోట్లు దాటుతుందని అంచనా.