- కలసికట్టుగా కదిలితేనే సమగ్రాభివృద్ధి సాధ్యం
- తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ
మంగళగరి: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విభిన్న కుల, మతాల సమా హారంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం సమగ్రా భివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని యువనేత నారా లోకేష్ పిలు పునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రము ఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగు తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ… గతంలో ఏ నాయకుడు వెళ్లని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రము ఖులను ఇళ్లవద్దకు వెళ్లి కలుస్తూ తమ ఆలోచనలను వివరించి, వారి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు.శుక్రవారంనాడు పలువురు ప్రముఖు లను వారి ఇళ్లవద్దకు వెళ్లి కలుసుకున్న లోకేష్… మంగళగరిని నెం.1 గా చేయడానికి తమవద్ద గల ప్రణాళికలను వివరించి, మీ వంతు సహాయ,సహకారాలు అందించాల్సిం దిగా కోరారు. తొలుత దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన నల్లబోతు తిరుపతయ్యను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. చెంచు సామాజికవర్గ పెద్దగా ఉన్న తిరు పతయ్య ఇంటికి చేరుకోగానే వారి కుటుంబసభ్యులు ఆనందంతో పొంగి పోయారు. లోకేష్‌ను సాదరంగా ఆహ్వానించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ కులస్తులు పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టడం, చేపలవేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారని, సంచారజాతిగా ఉన్న తమ సామాజికవర్గీయులను ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరారు. మీ అందరి ఆశీస్సులతో మరో 3 నెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వం చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని యువనేత పేర్కొ న్నారు. తర్వాత మంగళగిరి రూరల్ మండలం పెదవడ్లపూడికి చెందిన లంబాడీ సామాజికవర్గ ప్రముఖుడు జరపాల సాంబ శివరావును ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకుని, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం మంగళగిరి 10వ వార్డుకు చెందిన ప్రముఖ చేనేత వ్యాపారి, వైష్ణవి టెక్స్ టైల్స్ అధినేత వెనిగళ్ల శంకర్రావును కలుసు కున్నారు. మార్కండేయ ఎడ్యు కేషన్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడైన శంకర్రావు మార్కండేయ పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నా రు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన చేనేత సామాజికవర్గీయులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను శంకర్రావు ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి తెచ్చారు. అనంతరం మంగళగిరి 15వవార్డుకు చెందిన మరో ప్రముఖుడు కొల్లి నాగేశ్వరరావును వారి నివాసంలో కలుసుకున్నారు. మంగళగిరి మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఆమె సోదరుడు కొల్లి శ్రీనివాస చక్రవర్తిలను నాగేశ్వరరావు చిన్న వయసులో దత్తత తీసుకుని, పెంచి పెద్దచేశారు. చివరిగా మంగళగిరి పట్టణంలో సేవలందిస్తున్న ప్రముఖ స్వచ్చంద సంస్థ ఖిద్మత్ టీమ్ సభ్యులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. షేక్ షఫీ అధ్యక్షుడిగా ఉన్న ఈ సంస్థలో 200మంది సభ్యులుగా ఉన్నారు. ఖిద్మత్ టీమ్ సభ్యులు కోవిద్ సమయంలో అనాధలు, పేదలకు విశేష సేవలందించారు. మంగళగిరి పట్టణంలో విశేష సేవలందిస్తున్న ఖిద్మత్ టీమ్ ను యువనేత అభినందించారు. రాబోయే రోజుల్లో ఆదర్శ మంగళగిరి కోసం టీమ్ సభ్యులంతా తమవంతు సహాయ,సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ కోరారు.